Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లోకి గల్లీ బాయ్.. ఆ స్పెషల్ కోటాలో ఛాన్స్.. ఎంత ఇస్తున్నారో తెలిస్తే!

కొంత కాలంగా తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్న ఏకైక షో బిగ్ బాస్. వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోన్న ఈ రియలిటీ షో.. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఫలితంగా నిర్వహకులు గ్యాప్ లేకుండా సీజన్లను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇక, ఈ సీజన్‌లోకి బుల్లితెరపై ఫేమస్ అయిన కమెడియన్ అడుగు పెట్టబోతున్నాడని తెలిసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే!

ఏడో సీజన్‌‌కు ఫిక్సైన డేట్:మిగిలిన భాషల కంటే తెలుగులో బిగ్ బాస్ షో మరింత ఎక్కువ సక్సెస్ అయింది. అందుకే నిర్వహకులు ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఏడో దాన్ని మొదలు పెట్టబోతున్నారు. దీన్ని అక్కినేని నాగార్జున హోస్టింగ్‌లో సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

Jabardasth Comedian Riyaz Likely Entry To Bigg Boss 7 Telugu

అంచనాలు పెంచేసింది:వాస్తవానికి గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ ఆరో సీజన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా ఏడో దాన్ని సూపర్ సక్సెస్ చేయాలని నిర్వహకులు భావిస్తున్నారు. ఇందుకోసం తొలిసారిగా కొత్త కాన్సెప్టును పరిచయం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వచ్చిన ప్రోమోల ద్వారా వెల్లడించారు. దీంతో ఈ సీజన్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది.

వేగంగా వర్క్.. ఇప్పుడదే:సెప్టెంబర్ 3వ తేదీ నుంచి మొదలు అవుతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌ పనులు దాదాపుగా పూర్తైనట్లు బుల్లితెర వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే షో హౌస్ సెట్‌ వర్కును, స్టేజ్‌ను కూడా సుందరంగా తీర్చిదిద్దే పనులను చాలా వరకూ చేశారు. ఇప్పుడు వీటికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు తెలిసింది. అలాగే, టాస్కులకు సంబంధించిన వర్క్‌ను కూడా ఇప్పుడే చేస్తున్నారని టాక్.

కంటెస్టెంట్లు.. జంటలతో:మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. తర్వాత నేరుగా మాట్లాడి డీల్స్ చేసుకున్నారు. ఇందులో కొన్ని జంటలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ లిస్టును నిర్వహకులు ఇంకా ఫైనలైజ్ చేయలేదని టాక్.

షోలో గల్లీ బాయ్ రియాజ్:ఎన్నో అంచనాలతో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న ఏడో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వహకులు ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారట. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్న వాళ్లను ఎక్కువగా తీసుకుంటున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే ఈ సీజన్ కోసం జబర్ధస్త్ కమెడియన్, గల్లీ బాయ్స్ రియాజ్‌ను కంటెస్టెంట్‌గా తీసుకు వస్తున్నారని తాజాగా న్యూస్ లీకైంది.

ఆ కోటాలోనే ఆఫర్ ఇచ్చి:బిగ్ బాస్ కంటెస్టెంట్ల విషయంలో నిర్వహకులు కొన్ని కేటగిరీలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరుగుజ్జు అనే స్పెషల్ కోటాలో రియాజ్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. బిగ్ బాస్ హిందీ 16వ సీజన్‌లో Abdu Rozik కంటెస్టెంట్‌గా వచ్చి సెన్సేషన్ అయ్యాడు. అందుకే ఇప్పుడు రియాజ్‌తో తెలుగు టీమ్ ప్రయోగం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Jabardasth Comedian Riyaz Likely Entry To Bigg Boss 7 Telugu

భారీగానే ఇస్తున్నారంట:ప్రస్తుతం జబర్ధస్త్‌లోని కమెడియన్లలో ఒకడైన రియాజ్‌ను అత్యధిక రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తీసుకు వస్తున్నారని బుల్లితెర వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి పొట్టి నరేష్‌ను కంటెస్టెంట్‌గా తీసుకోవాలని భావించినా.. అతడి కమిట్‌మెంట్స్ వల్ల వర్కౌట్ కాలేదని తెలిసింది. అందుకే రియాజ్‌కు బిగ్ బాస్ టీమ్ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X