బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్‌లో ట్విస్ట్.. షోలోకి జబర్ధస్త్ స్టార్ టీమ్ లీడర్

టెలివిజన్ రంగంలో ఎన్నో రకాల కార్యక్రమాలు వచ్చినా.. అందులో కొన్ని మాత్రమే ట్రెండ్ సెట్ చేసి సెన్సేషన్ అవుతుంటాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ ఒకటి. ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చిన ఇది.. ఊహకే అందని విధంగా రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో దాన్ని మొదలెట్టబోతున్నారు. ఇందులోకి ఓ స్టార్ కమెడియన్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలను మీరే చూసేయండి మరి!

అవి కంప్లీట్.. దేశంలో టాప్
అన్ని భాషలతో పోల్చుకుంటే తెలుగులో బిగ్ బాస్ కాస్త ఆలస్యంగానే ప్రారంభం అయింది. అయినప్పటికీ దీనికి ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్ లభించింది. దీంతో ఏమాత్రం లేట్ లేకుండా ప్రతి ఏడాది ఒక సీజన్ చొప్పున ఇప్పటికే ఏడింటిని కంప్లీట్ చేసుకున్నారు. వీటికి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ దేశంలోనే టాప్ ప్లేస్‌కు చేరింది.

Jabardasth Comedian Rocking Rakesh Likely Entry To Bigg Boss Telugu 8 Show

8వ సీజన్ అంతులేకుండా

బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇలా ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు అన్నీ డిఫరెంట్ థీమ్‌లతో వచ్చాయి. ఇలా ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను 'అంతులేని వినోదం' అనే కాన్సెప్టుతో తీసుకు రాబోతున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఎంతో వింతలు, విశేషాలను చూపించబోతున్నారు. దీంతో ఈ సీజన్‌పై హైప్ భారీ స్థాయిలో పెరిగిపోతోంది.

ఆరోజు నుంచే.. సిద్దంగానే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు తగ్గట్లుగానే దీన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారని ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు అన్నీ చివరి దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా సెట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ అంతా కూడా దాదాపు పూర్తి అయిపోయింది.

ఆరోజు 14 మంది ఎంటర్

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపిక అనేది చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇందులో పాల్గొనే సెలెబ్రిటీలపై నిర్వహకులు స్పెషల్‌గా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కంటే మరింత పేరున్న కంటెస్టెంట్లకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఇలా ప్రీమియర్ ఎపిసోడ్‌లో 14 మందిని హౌస్‌లోకి పంపుతారని మరో న్యూస్ వైరల్ అవుతోంది.

Jabardasth Comedian Rocking Rakesh Likely Entry To Bigg Boss Telugu 8 Show

షోకి జబర్ధస్త్ టీమ్ లీడర్
భారీ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల వివరాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది పేర్లు లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇందులో జబర్ధస్త్ టీమ్ లీడర్ రాకింగ్ రాకేష్ (కూడా పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే నిర్వహకులతో అతడితో ఒప్పందం కూడా సెట్ అయిందట.

భార్యను వదిలేసి మరీ

రాకింగ్ రాకేష్ సుదీర్ఘ కాలంగా జబర్ధస్త్ షోలో కొనసాగుతున్నాడు. అలాగే, అతడి భార్య సుజాత కూడా ఇందులో పాల్గొంటోంది. అలాంటిది ఆమె ప్రెగ్నెంట్ అవడంతో ఇద్దరూ గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాకేష్‌తో బిగ్ బాస్ నిర్వహకులు సంప్రదింపులు జరిపారని తెలిసింది. దీంతో అతడు ఇందులోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X