అమ్మాయిలా మారిన తరువాత నరకం చూశాను.. జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్
జబర్దస్త్ షో నుంచి వచ్చిన కమెడియన్స్ చాలా వరకు సినిమాల్లో క్లిక్కవుతూనే ఉన్నారు. ధన్ రాజ్, షకలక శంకర్, హైపర్ ఆది, మహేష్ వంటి వారికి మంచి గుర్తింపు తెచ్చిన ఆ షో మరికొందరికి మాత్రం అనుకున్నంతగా సినిమాలలో అవకాశాలు తెప్పించలేకపోయింది. సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు ఇంకా ఆ షోలతోనే కాలాన్ని గడిపేస్తున్నారు. ఇక మరో వర్గానికి కూడా జబర్దస్త్ షో ఒక ఆధారంగా మారింది.

వివాదాల నడుమ..
జబర్దస్త్ ఎంతగా క్లిక్కయినా అప్పుడప్పుడు ఆ షో వివధాల్లోకి వెళుతూనే ఉంది. ఇక కమెడియన్స్ పై కూడా పలుమార్లు విమర్శలు వచ్చాయి. ఇక వివాదాలతో ఫేమస్ అయిన వారిలో సాయి తేజ ఒకరు. ప్రస్తుతం సాయి తేజ అదిరింది షోకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. మొదట్లో అబ్బాయిగా ఉన్నా ఆ తరువాత ప్రియాంక సింగ్ అంటూ అమ్మాయిలా మారింది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలను ఆమె బయటపెట్టారు.

చిన్నప్పటి నుంచి అంతే..
జబర్దస్త్ షోలో అడుగు పెట్టిన తరువాత సాయి తేజగా అందరికి తెలిసినప్పటికి చిన్నప్పటి నుంచి నేను అమ్మాయిలా ఉండడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపాను. ఐదేళ్ల వయసు నుంచే ఎవరికి తెలియకుండా అక్క బట్టలు వేసుకున్నాను. ఆ తరువాత చీర కూడా కట్టుకున్నా. ఆ తరువాత కొన్నేళ్లకు సొంత నిర్ణయంతోనే నా జీవితాన్ని ఇష్టం ఉన్నట్లు కొనసాగించాలని అనుకున్నాను.

నరకం చూశాను..
అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడానికి చాలా కష్టపడ్డాను. సర్జరీ అయిపోయిన తరువాత 9 నెలల పాటు నరకం చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు కేవలం స్నేహితులు మాత్రమే అండగా నిలిచారు. నేను అలా మారుతున్నట్లు ఇంట్లో ఎవరికి తెలియదు. అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ జీవితంలో నాకు నచ్చిట్లుగా కొనసాగాలని ఆ నిర్ణయం తీసుకున్నాను.

అలా మారడానికి లక్షల్లో ఖర్చు..
అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. నేను సంపాదించిన డబ్బుతోనే సర్జరీ చేయించుకున్నాను. ఎవరు కూడా నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఇలా మరలేను అని ఒక నిర్ణయం తీసుకున్న తరువాతే సర్జరీ చేయించుకున్నాను అని ఈ కమెడియన్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











