అర్ధరాత్రి నడిరోడ్డుపై దారుణంగా.. వాళ్లను చంపేయాలనేంతగా.. జబర్దస్త్ కమెడియన్ సాయితేజ
జబర్దస్త్‌లో తనదైన శైలిలో ఆకట్టుకొంటున్న కమెడియన్ సాయితేజ అలియాస్ ప్రియాంకగా వేధింపుల పర్వం కొనసాగుతున్నది. గతంలో పలుమార్లు వేధింపులకు గురైన సాయితేజ అడపదడపా అలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా నడి రోడ్డుపై టార్చర్ అనుభవించానని సాయితేజ ఆవేదన వ్యక్తం చేశారు. తెర మీద వినోదాన్ని పండిస్తున్న తనకు నిజ జీవితంలో కష్టాలు తప్పడం లేదని వాపోయారు. తాజాగా ఎదురైన చేదు అనుభవాల గురించి చెబుతూ..

అర్ధరాత్రి రోడ్డుపై
ప్రియాంకగా మారిన సాయితేజ తాజాగా స్పందిస్తూ.. తన పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తున్నదన్నారు. ఇటీవల బైక్‌పై వస్తుంటే కొందరు పోకిరిలు అడ్డగించి వేధించారు. తనతో దారుణంగా.. చెప్పలేని భాషతో టార్చర్‌కు గురిచేశారు. తనను ఉద్దేశించి చాలా అసభ్యంగా మాట్లాడారని సాయితేజ చెప్పారు. ఇలాంటి వేధింపులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని భావించినప్పటికీ.. ఆ విషయాన్ని పెద్దగా చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే విషయంతో ఊరుకుండాల్సి వస్తున్నదని చెప్పారు.

అమ్మాయిలను వేధించే పోకిరిలు
జీవితాన్ని నిలబెట్టుకొనేందుకు రాత్రింబళ్లు అనే తేడా లేకుండా ఇచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొంటూ కష్టపడుతుంటే.. ఎలాంటి పనీ పాట లేకుండా రోడ్లపై తిష్టవేస్తూ తననే కాకుండా అమ్మాయిలను కూడా వేధిస్తున్నారు. అలాంటి వాళ్లను చంపినా పాపం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సామాన్య జనమే కాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సంఘటనలు ఎదురవ్వడం కామన్‌గా మారింది అని సాయితేజ ఉరఫ్ ప్రియాంక చెప్పారు.

మృగాళ్లలా ప్రవర్తిస్తూ..
టెలివిజన్ రంగంలో వినోదాన్ని పండించడం తప్ప అసభ్యమైన పాత్రలు కూడా వేయడం లేదు. డిసెన్సీని మెయింటేన్ చేస్తున్నాను. అందంగా తయారవుతే చాలూ కామంతో కళ్లు కప్పిన వాళ్లు మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి అడ్డగించిన అలా నీచంగా బిహేవ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని అన్నారు. ఇలాంటి వెధవలు ఉన్నంత వరకు నేరాలు జరగవంటే నమ్మలేం అని ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video

తనపై దుష్రచారం అలా..
ఇక తన వ్యక్తిగత జీవితంపై కూడా దుష్రచారం చేస్తున్నారు. తనకు పెళ్లి జరిగిందనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా తనను వెంటాడుతున్నారు. తనకు పెళ్లి కాలేదని స్పష్టం చేశారు. ఎవరైన తనను అర్ధం చేసుకొనే వాళ్లు దొరికితే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని ప్రియాంక చెప్పారు. తనకు ఇష్టమని టిక్ టాక్ వీడియోలు చేస్తే కూడా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











