రోజా..నిన్ను వదిలిపెట్టేది లేదు.. జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం హోరాహోరీగా జరిగింది. వైసీపీ అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో ఇరుపక్షాలు సర్వశక్తులను ఒడ్డాయి. అయితే నేతల మధ్య మాటల యుద్ధం శృతిమించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తదితరులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు చిన్న నటులు , చిన్న ప్రాణాలని రోజా వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీ ఆగ్రహానికి గురైతే ఇండస్ట్రీలో మనుగడ సాగించలేమని వారు భయపడుతున్నారని.. అందుకే పవన్ కోసం ప్రచారం చేస్తున్నారని రోజా ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కిరాక్ ఆర్పీ, గెటప్ శ్రీను వంటి వారు అంతే ఘాటుగా కౌంటరిచ్చారు. వాళ్లంతా చిన్న ఆర్టిస్టులైతే .. రోజాకు 15 నేషనల్ అవార్డులు, 10 ఆస్కార్ అవార్డులేమైనా వచ్చాయా అని ఆర్పీ ప్రశ్నించారు. నీకు దమ్ముంటే గెటప్ శ్రీను వేసే క్యారెక్టర్లు నీ జీవితంలో ఒక్కటైనా వేయగలవా..? సుడిగాలి సుధీర్ కష్టపడి పైకొచ్చాడని, నీకంటే 10 రెట్లు ఫాలోయింగ్ వుందని వాడితో పోటీపడగలవా , ఆదిలా గంటల తరబడి నవ్వించగలవా.. నీ బతుకులో వీరి ఛరిష్మాను చూశావా అని రోజాపై కిరాక్ ఆర్పీ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అందరికంటే ఓడిపోయేది రోజాయేనని, ఆమెకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.

jabardasth comedian shakalaka shankar made sensational comments on ex minister rk roja

ఆర్పీ అన్నట్లుగానే నగరిలో రోజా దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆ క్షణం నుంచి ఆమెపై టీడీపీ, జనసేన కేడర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగాయి. రోజా గతంలో టీడీపీ, చంద్రబాబు , నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పాత వీడియోలను బయటకు తీసి కామెంట్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై స్పందించారు కమెడియన్ షకలక శంకర్. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తప్పు చేసినవాళ్లని వదిలిపెట్టరని అది ఇవాళ కాకపోయినా రేపైనా తప్పదన్నారు. అసలు అనడమెందుకు, ఎంత రాజకీయాల్లో ఉంటే మాత్రం మనుషుల్ని మర్చిపోతారా .. ఇకనైనా పద్దతి మార్చుకోవాలని శంకర్ హితవు పలికారు. గెలిస్తే విర్రవీగకూడదని.. గెలుపు ఏమైనా శాశ్వతమా , భారతదేశంలో ఎంతోమంది ఓడిపోయారు, గెలిచారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడే కాలేదని రోజా అన్న మాటలన్నీ బయటకు తీస్తారని, ఇవాళ చేసిన పాపం రేపటితో క్లియర్ అయిపోవాల్సిందేనని శంకర్ అన్నారు.

పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టరని , నాలుగు రోజులు అటు ఇటూ కావొచ్చు కానీ చేయడం మాత్రం కన్ఫర్మ్ అని ఆయనే చెప్పారని గుర్తుచేశారు. చాలామంది పవన్‌ని హేళన చేశారని ఆయన మాట్లాడుతుంటే.. ఇది సినిమా కాదు నాయనా, డైలాగ్స్ కొట్టొద్దని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజజీవితంలో జరిగిన సంఘటనల తాలూకా మాటలనే పవన్ అన్నారని , వాటినే సినిమాల్లో పెట్టుకుంటారని శంకర్ తెలిపారు. వాటిని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలని, నేర్చుకోవాలని ఆయన సూచించారు. గోపాల గోపాల సినిమాలోని ''నాలుగు రోజులు లేట్ కావొచ్చు కానీ రావడం మాత్ర పక్కా '' అనే డైలాగ్ అక్షరాల నిజమైందని, నాలుగేళ్లు కాదు పదేళ్లు లేటైందని కానీ రావడమైతే జరిగిందిగా అంటూ చురకలంటించారు.

jabardasth comedian shakalaka shankar made sensational comments on ex minister rk roja

ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గాలో పవన్‌కు తెలుసునని.. అందుకే తండ్రి లాంటి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వద్ద తగ్గే ఉన్నారని .. అలాగే నెగ్గాల్సిన చోట నెగ్గారని షకలక శంకర్ ప్రశంసించారు. మనం సమాజాన్ని పాడు చేస్తే సమాజం మనల్ని కనిపించనీయదని .. సమాజానికి పవన్ కీడు చేయడని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతాడని కొనియాడారు.

మహానుభావులు రాసిన వందలాది పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ ఎంతో జ్ఞానం సంపాదించారని , అది సొసైటీకి ఎంతో పనిచేస్తుందని శంకర్ చెప్పారు. పవన్ జ్ఞానం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ఉపయోగపడుతోందని.. చంద్రబాబు, నరేంద్ర మోడీలను ఆయన ఎందుకు నెత్తిన పెట్టుకుంటారని శంకర్ ప్రశ్నించారు. బెదిరించేవారిని, రౌడీయిజం చేసే వాళ్లు లేదంటే మేం లీడర్లమని చెప్పుకునేవాళ్లు రాష్ట్రానికి అక్కర్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X