ఆస్తి లెక్కలు బయటపెట్టిన జబర్దస్త్ శాంతి స్వరూప్.. ఇదే నా ఆడి కారు అంటూ ఎమోషనల్!

జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ కు ఒక రూటు దొరికింది. టాప్ మోస్ట్ తెలుగు కామెడీ షోగా కొనసాగుతున్న జబర్దస్త్ లో కొంతమంది అమ్మాయిల గెటప్స్ జనాలను అమితంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక వారిలో కొంతమంది ఎన్నో ఆటు పొట్లను ఎదుర్కొంటు ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నారు. అయితే హైపర్ ఆది టీమ్ లోని శాంతి స్వరూప్ కూడా కోట్ల ఆస్తులు వెనకేసుకున్నాడు అంటూ రూమర్స్ చాలానే వచ్చాయి. ఇక ఇటీవల శాంతి స్వరూప్ తన ఆస్తి, పాస్తులపై క్లియర్ గా వివరణ ఇచ్చారు.

తిరుగులేని కామెడీ షోగా

తిరుగులేని కామెడీ షోగా

జబర్దస్త్ గత కొన్నేళ్లుగా తిరుగులేని కామెడీ షోగా రేటింగ్ అందుకుంటోంది. పోటీగా ఇతర ఛానెల్స్ లో ఎన్నో కామెడీ షోలు వచ్చాయి. కానీ ఏవి కూడా అనుకున్నంత స్థాయిలో నిలదొక్కుకోలేదు. ఆ మధ్య అదిరింది బాగానే వర్కౌట్ అయినప్పటికీ ఎక్కువ రోజులు పోటీని ఇవ్వలేకపోయింది.

10లక్షల వరకు కట్టేసి

10లక్షల వరకు కట్టేసి

ఇక జబర్దస్త్ లో ఒక్క స్కిట్ కోసం నటీనటులు బాగానే కష్టపడతారు. అయితే షో నుంచి బయటకు వచ్చిన కొంతమంది బ్యాక్ గ్రౌండ్ ప్రొడక్షన్ ఏ మాత్రం కరెక్ట్ గా ఉందదని చెబుతుంటారు. మధ్యలో మానేజ్మెంట్ బిహేవియర్ ఏ మాత్రం నచ్చడం లేదని చెబుతుంటారు. ఎన్నో ఏళ్ళు జడ్జ్ గా ఉన్న నాగబాబు షో నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఇక అవినాష్ కూడా 10లక్షల వరకు కట్టేసి బయటకు వచ్చేశాడు.

శాంతి స్వరూప్.. కోట్ల ఆస్తులు

శాంతి స్వరూప్.. కోట్ల ఆస్తులు

ఆ సంగతి పక్కన పెడితే జబర్దస్త్ లో ప్రతి ఒక్కరి ఆదాయం హై రేంజ్ లో ఉంటుందనే రూమర్స్ యూ ట్యూబ్ లో బాగానే వస్తుంటాయి. కొంతమంది టీమ్ లీడర్స్ అయితే బాగానే సంపాదించుకున్నారు. అయితే హైపర్ ఆది టీమ్ లో ఉన్న శాంతి స్వరూప్ కూడా కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నట్లు రూమర్స్ బాగానే వచ్చాయి.

క్లారిటీ ఇచ్చిన శాంతి స్వరూప్

క్లారిటీ ఇచ్చిన శాంతి స్వరూప్

ఇక ఫైనల్ గా శాంతి స్వరూప్ తన యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా హోమ్ టూర్ వీడియో చేసి అందులో తన ఆస్తుల విషయాల గురించి మొత్తం క్లారిటీగా చెప్పాడు. కృష్ణ నగర్ లో ఒక బిల్డింగ్ లో ఉంటున్న శాంతి స్వరూప్ తన ఇంటిని అలాగే వచ్చిన అవార్డులను తన ఆస్తులను అన్నిటినీ కూడా సరదాగా చూపించాడు.

గొప్పగా బ్రతకాలనే ఆలోచన లేదు

గొప్పగా బ్రతకాలనే ఆలోచన లేదు

నిజానికి తనకు సొంత ఇల్లు కూడా లేదని అంటూ అద్దె రూమ్ లోనే ఉన్నట్లు చెప్పాడు. ఒకే గదిలోనే ఉంటున్నాను అని అందులోనే హాల్, కిచెన్, బెడ్ రూమ్ అని చాలా సున్నితంగా వివరించాడు. తనకు గొప్పగా బ్రతకాలనే ఆలోచన లేదని అంటూ నాకు వచ్చిన దాంట్లో తృప్తిగా ఉండడమే ఇష్టమని చెప్పాడు.

Recommended Video

Chiranjeevi Releases Shasi Movie Teaser
అదే నాకు ఆడి కారు

అదే నాకు ఆడి కారు

ఇక తనకు ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఒక ఆడి కారు కూడా ఉందని వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని అంటూ.. తనకు ఉన్నదల్లా ఒక చిన్న స్కూటీ అని అది కూడా EMI లో కొనుక్కున్నట్లు చెప్పాడు. అదే తన ఆడి కారు అనుకుంటానని జీవితంలో వచ్చిన సంపాదనలో నా పేరెంట్స్ కు కొంత పంపించడం కంటే గొప్ప సంతోషం తనకు మరొకటి లేదని శాంతి స్వరూప్ ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X