twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jabardasth: సుడిగాలి సుధీర్ టీమ్ ఏం చేయకపోయినా కలిసొస్తుంది.. మేం మాత్రం కష్టపడాలి

    |

    జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును అందుకుని ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో బిజీగా కొనసాగుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దశాబ్దకాలంపాటు జబర్దస్త్ లో ఉన్న వారు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. అయితే కొంత మంది మాత్రం జబర్దస్త్ ద్వారా మంచి ఆదాయం వస్తున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వలన బయటకు వచ్చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ టీమ్ కూడా అదే తరహాలో జబర్దస్త్ కు దూరం అవుతున్నట్లు ఇటీవల ఒక ప్రముఖ కమెడియన్ వివరణ ఇచ్చాడు.అంతే కాకుండా వారిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

    విబేధాల కారణంగా..

    విబేధాల కారణంగా..


    జబర్దస్త్ షోలో అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ లలో దాదాపు అందరూ కూడా ఏదో ఒక విధంగా లాభం పొందినవారే. అత్యధిక రేటింగ్స్ తో నెంబర్ వన్ కామెడీ షోగా కొనసాగుతున్న జబర్దస్త్ లో అవకాశం కోసం ప్రస్తుతం చాలామంది పోటీ పడుతున్నారు. ఇక సీనీయర్స్ లో కొంతమంది విబేధాల కారణంగా షోలో నుంచి బయటకు వెళ్లిపోయారు. నాగబాబు వెళ్లిపోయిన తరువాత కొందరు ఆయన వెంటనే వచ్చేశారు.

     నిలకడగా కొనసాగిన ఏకైక టీమ్

    నిలకడగా కొనసాగిన ఏకైక టీమ్

    ఇక ఎన్ని టీమ్స్ మారుతున్నా కూడా జబర్దస్త్ షోలో చాలా నిలకడగా కొనసాగిన ఏకైక టీమ్ సుడిగాలి సుధీర్ టీమ్ అనే చెప్పాలి. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ అలాగే వారికి తోడుగా ఉండే ఫణి కూడా అద్భుతమైన కామెడితో ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చాడు. ఇక వీరు జబర్దస్త్ కి గ్యాప్ ఇవ్వడం ఆ షోపై కొంత గట్టి ప్రభావం చూపిస్తోంది.

     ఎలాంటి నిజం లేదని

    ఎలాంటి నిజం లేదని

    ఇక ఎంతో కలిసి కట్టుగా ఉండే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీమ్ విడిపోవడానికి గల కారణాలు ఒక్కటి కాదని చాలా ఉన్నట్లు ఇంతకు ముందు కొన్ని రూమర్స్ వచ్చాయి. జబర్దస్త్ మేనేజ్మెంట్ కారణంగా అసంతృప్తి తోనే వాళ్ళ మధ్యలో విబేధాలు వచ్చినట్లు కూడా టాక్ వచ్చింది. కానీ ఆ విషయంలో ఎలాంటి నిజం లేదని ఆ తరువాత వారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు.

    ఏం చేయకపోయినా కూడా..

    ఏం చేయకపోయినా కూడా..

    అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ కమెడియన్ రాకింగ్ రాకేష్ వారి ముగ్గురి గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. వాళ్ళు ముగ్గురికి మిగతా వారికి ఉన్న తేడా ఏమిటంటే. వాళ్ళు స్టేజ్ పైకి వస్తేనే హావభావాలతోనే నవ్విస్తారు. అదొక అదృష్టం ఉంది. వాళ్ళ ఫెసెస్ అలాంటివి. కానీ మేము మాత్రం స్క్రిప్ట్ రాసుకొని రాత్రిపగలు పంచ్ లు రెడీ చేసుకొని ఉండాలి. వాళ్ళు కొన్నిసార్లు. ఏం చేయకపోయినా కూడా కలిసొస్తుంది.

    Recommended Video

    Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu
    ఎందుకు వెళ్లిపోతున్నారంటే?

    ఎందుకు వెళ్లిపోతున్నారంటే?

    నిజానికి జబర్దస్త్ నుంచి కొందరు దురమవ్వడానికి కారణం అయితే ఒక స్థాయి నుంచి మరో స్థాయికి ఎదగాలనే ఆలోచన ఉండడమే. సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వస్తుండడంతో రెండింటిని బ్యాలెన్స్ చేయలేక మరికొందరు జబర్దస్త్ కు దూరం అవుతున్నారు. ఇక సుడిగాలి సుధీర్ టీమ్ కూడా అదే తరహాలో ముందుకు సాగుతోందిని అనుకుంటున్నట్లు చెబుతూ.. ఇందులో పెద్దగా కాంట్రవర్సీ ఏమి లేదని కూడా రాకేష్ వివరణ ఇచ్చారు.

    English summary
    Jabardasth comedian shocking comments on sudigali sudheer team
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X