శ్రీదేవి డ్రామా కంపెనీలో విషాధం.. కమెడియన్ కోసం చేయి కట్ చేసుసుకున్న శ్రీవిద్య.. 6 కుట్లు!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించేందుకు ప్రయత్నించే షో శ్రీవేది డ్రామా కంపెనీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో తర్వాత అంతటి ప్రేక్షకాదరణ పొందిన ఈ షోలో విషాధం చోటు చేసుకుంది. ముఖ్యంగా లేడీ కమెడియన్ శ్రీవిద్య.. తన ప్రియుడు, మరో మేల్ కమెడియన్ కోసం తన చేయిని కట్ చేసుకుంది. అలా చేసుకోవడంతో ఆమెకు మొత్తం ఆరు కుట్లు పడ్డాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ.. లోకల్ ఛానెల్ లో కామెడీ వీడియోలు చేసే శ్రీవిద్యను జబర్దస్త్ షోకు తీసుకు వచ్చారు. ఇక్కడకు వచ్చిన తర్వాత నుంచి ఈమెకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా కనిపిస్తోంది. అయితే అద్భుతమైన కామెడీని పండించడంలో ఎప్పుడూ ముందుండే ఈమె.. తాజాగా అందరికీ ఓ షాక్ ఇచ్చింది. తన ప్రియుడు గురించి చెప్పింది. ముఖ్యంగా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో తనతో పాటు కమెడియన్ గా చేసే మరో వ్యక్తిని ఇష్టపడుతున్నట్లు వివరించింది.

కేవలం వివరించడమే మాత్రమే కాదండోయ్.. అతడు ఈ మధ్య తనతో ఎక్కువగా మాట్లాడట్లేదనిస, పట్టించుకోవడం లేదని, కనీసం ఫోన్లు చేస్తుంటే లిఫ్ట్ కూడా చేయట్లేదని చాలా ఫీల్ అయినట్లు చెప్పింది. అయితే అతడిపై తనకు ఉన్న ప్రేమను ఎలా చూపించాలో తెలియక, ఆ బాధను ఎలా దిగమింగుకోవాలో తెలియక తన చేయిని కట్ చేసుకున్నట్లు చెప్పింది. అలా చేయడం వల్ల తనకు చేతికి చాలా గాయం అయిందని.. మొత్తం 6 కుట్ల పడ్డాయని వివరించింది.
అయితే ముందుగా శ్రీవిద్య తనకు చేతికి గాయం అయిందని మాత్రమే చెప్పగా.. కమెడియన్ హైపర్ ఆది అసలు విషయాన్ని వివరించారు. కమెడియన్ బాబు కోసమే.. శ్రీవిద్య ఇలా చేసుకుందని అక్కడ ఉన్న వాళ్లందరికీ వివరించాడు. ఆమెను స్టేజీ మీదకు తీసుకు వచ్చి బాబును పిలిచి పూర్తి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదంతా చూసిన యాంకర్ రష్మి.. ఇలాంటి వాటి కోసం చేతులు కట్ చేసుకోవడం ఏంటి పిచ్చి కాకపోతే.. ఇలాంటి పనులు అస్సలే చేయకూడదు అంటూ వివరించింది.

అయితే బాబు కూడా.. నేను ఏదో బిజీలో ఉండి మాత్రమే నిన్ను పట్టించుకోవడం లేదు తప్ప నీ మీద ప్రేమ లేక కాదు అంటూ చెప్పుకొచ్చాడు. మనం జీవితాంతం కలిసి ఉన్నా లేకపోయినా.. నువ్వు మాత్రం ఇలాంటి పనులు ఇంకోసారి చేసుకోకూడదని అంటూ వివరించాడు. నువ్వు మాత్రమే కాదు మరెవరూ ఇలాంటి పనులు చేయొద్దంటూ తెలిపాడు. అయితే ఇదంతా టీఆర్పీ కోసం వేసిన ప్లాన్ అని చూస్తుంటేనే అర్థం అవుతుంది. ముఖ్యంగా కుట్లను సరిగ్గా చూపించకపోవడం.. అంత సీరియస్ నెస్ కనిపించకపోవడంతో.. ఇదంతా కామెడీ, మెసేజ్ లో భాగమేనని అర్థం అయింది.


Click it and Unblock the Notifications











