పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ సుధీర్.. ఆ అమ్మాయి ఎవరంటే..?
మెజిషియన్ గా కెరీరి స్టార్ట్ చేసి ఆ తరువాత కమెడియన్ స్థిరపడ్డాడు సుధీర్. కెరీర్ మొదట్లో ఎంతగానో కష్టపడిన సుధీర్ ఆ తరువాత జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి అనే ట్యాగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా వెండితెరపై నటుడిగా కూడా అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపోతే రీసెంట్ గా మనోడు పెళ్లికి సిద్ధమవుతున్నట్లు టాక్ వస్తోంది.

లాక్ డౌన్ లో కొత్త ఆలోచన..
మూడు పదుల వయసు దాటినా సుధీర్ కి బుల్లితెరపై ప్లే బాయ్ అనే ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ఇకపోతే ఈ లాక్ డౌన్ లో సుధీర్ తన భవిష్యత్తు ప్రణాళికలతో పాటు పెళ్లి గురించి కూడా ఆలోచించినట్లు తెలుస్తోంది. సుధీర్ పెళ్లిపై గతంలోనే చాలా రూమర్స్ వచ్చాయి. ఇక ఇన్నాళ్లకు ఈ యంగ్ కమెడియన్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అది నిజం కాదు..
రూమర్స్ పై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా సుధీర్ రష్మీ రిలేషన్ పై గాసిప్స్ పుట్టుకొస్తునే ఉన్నాయి. కేవలం రేటింగ్స్ కోసమే టీవీలో అలా నటిస్తామని చెప్పినప్పటికీ రూమర్స్ డోస్ ఆగడం లేదు. చాలా సార్లు సుధీర్, రష్మీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కనీసం క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కాదని రష్మీ ఒక ఇంటర్వ్యూలో ఘాటుగా ఆన్సర్ ఇచ్చింది.

పెళ్లికి రెడీ..
ఇప్పటికే జబర్దస్త్ లో చాలా కమెడియన్స్ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చూస్తున్నారు. ఇక సుధీర్ కూడా పెద్దలు నిర్ణయించిన పెళ్లితో ఒక ఇంటివాడు కాబోతున్నట్టుకు తెలుస్తోంది. ప్రస్తుతం సుధీర్ పెళ్లికి సంబంధించిన రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. షూటింగ్స్ లేకపోవడంతో మళ్ళీ ఇలాంటి సమయం దొరకదని పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
Recommended Video

ఆ అమ్మాయి ఎవరంటే..?
ఇక సుధీర్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ అమ్మాయి కృష్ణా జిల్లాకు చెందిన యువతి అని తెలుస్తోంది. దాదాపు పరిచయాలు అయిపోయాయని త్వరలో నిశ్చితార్థంతో ఇరు కుటుంబాలు అఫీషియల్ గా పెళ్లి పనులు స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











