కొత్త సినిమాలతో సిద్దమవుతున్న సుడిగాలి సుధీర్.. రష్మీ ఒప్పుకుంటుందో లేదో?

జబర్దస్త్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుధీర్ ఒకడు. ఆ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ అనే ట్యాగ్ ని అందుకొని జనాల్లో మంచి క్రేజ్ అందుకున్నాడు. నేడు సుధీర్ పుట్టినరోజు సందర్భంగా అతని ఫాలోవర్స్ విషెస్ అందిస్తూ కెరీర్ ప్లానింగ్స్ గురించి అనేక రకాల ప్రశ్నలు వేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ కమెడియన్ రియాలిటీ షోలు కూడా చేయడం లేదు. ఇక నెక్స్ట్ హీరోగానే సినిమాలు చేయాలని ప్లాన్స్ వేసుకుంటున్నాడట.

Recommended Video

#HBDSudigaliSudheer : Sudigali Sudheer Next Film with Rashmi Gautam
లాక్ డౌన్ ఎంజాయ్..

లాక్ డౌన్ ఎంజాయ్..

లాక్ డౌన్ లో చాలా వరకు కమెడియన్స్ అలాగే మిగతా యాంకర్స్ యూ ట్యూబ్ మీద పడ్డారు. కానీ కొంతమంది మాత్రం ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. సుధీర్ కూడా చాలా రోజుల తరువాత గ్యాప్ దొరికిందని లాక్ డౌన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. తోటి కమెడియన్స్ యూ ట్యూబ్ తో బిజీగా ఉన్నప్పటికీ ఆ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

 జబర్దస్త్ కి ఎండ్ కార్డ్?

జబర్దస్త్ కి ఎండ్ కార్డ్?

గత కొన్ని రోజులుగా జబర్దస్త్ షోపై అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. షోను ఆపేస్తున్నారని సుధీర్ వంటి వారు ఆ షోకి ఇక ఎండ్ కార్డు పెట్టి సినిమాలతో బిజీ అవ్వాలని అనికుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అవి ఎంతవరకు నిజమనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

సినిమాలతో బిజీ..

సినిమాలతో బిజీ..

ఇకపోతే సుధీర్ నెక్స్ట్ కొన్ని సినిమాలతో హీరోగా సరికొత్తగా కిక్కివ్వాలని ట్రై చేటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్ అంటూ ఒక సినిమాతో వచ్చిన సుధీర్ కాస్త హడావుడి చేసినట్లు అనిపించింది. ఇక ఈ లాక్ డౌన్ లో కొన్ని కొత్త స్క్రిప్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. రష్మితో కూడా ఒక సినిమా అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రష్మీ ఒప్పుకుంటుందా..

రష్మీ ఒప్పుకుంటుందా..

హాట్ యాంకర్ రష్మి గౌతమ్ బగ్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమవుతోంది. బోల్డ్ కంటెంట్ తో అప్పట్లో కాస్త హడావుడి చేసిన ఈ బ్యూటీ ఈ మధ్య ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. అయితే సుధీర్ రష్మిల మధ్య వచ్చే పుకార్ల గురించి అందరికి తెలిసిందే. ఇక వీరి కలయికలో కూడా సినిమా ఉంటుందని టాక్ వస్తోంది. కానీ ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరి సుధీర్ తో నటించే ఛాన్స్ వస్తే రష్మీ ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X