స్కిట్ కోసం నాలుక కోసేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. షాక్‌లో జడ్జిలు!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే అద్భుతమైన షో జబర్దస్త్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కామెడీతో అందరూ ఫుల్ ఎంజాయ్ చేసేలా ఉండే ఈ షోకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తాజాగా ఈ షోలో స్కిట్ కోసం ఓ కమెడియన్ షాకింగ్ డిసీషన్ తీసుకున్నాడు. ముఖ్యంగా అతడు తన నాలుకను కత్తిరించుకుని.. అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గత 12 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉర్రూతలూగిస్తున్న జబర్దస్త్ షో ఎప్పటికప్పుడు సరికొత్త స్కిట్ లతో ముందుకు వస్తోంది. స్కిట్ కోసం, జనాలను నవ్వించడం కోసం అందులోని కమెడియన్లు ఎంతైనా కష్టపడుతుంటారు. ఇటీవలే టీం లీడర్ బుల్లెట్ భాస్కర్ స్కిట్ కోసం గుండు కూడా కొట్టించుకుని షాక్ ఇచ్చాడు. ఇదంతా చూసిన జనాలను నిజంగానే ముక్కున వేలేసుకున్నారు. అయితే తాజాగా మరో కమెడియన్ అంతకు మించిన షాక్ ఇచ్చాడు. ఎవరూ ఊహించని స్థాయిలో స్కిట్ కోసం తన మాటలను త్యాగం చేశాడు.

ముఖ్యంగా కమెడియన్ సన్నీ.. ఆటో రాం ప్రసాద్ స్కిట్ లో పని చేస్తున్నాడు. సన్నీ, బాబులతో పాటు ఆటో రాం ప్రసాద్ స్టేజీపైకి వచ్చి స్కిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాది మంచి పురం అండి.. మా ఊరోళ్లంతా మంచోల్లు అంటూ ఆటో రాం ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అలాగే కమెడియన్ సన్నీని చూపిస్తూ తను నా తమ్ముడు అని పరిచయం చేశాడు. ఆ తర్వాత వీడు చాలా మంచివాడు అనగానే.. పక్కనే ఉన్న బాబు ఎందుకు అంత మంచివాడు అయ్యాడు అనగా.. ఈ స్కిట్ కోసం వాడు చాలా పెద్ద త్యాగం చేశాడని చెప్పాడు.
ఏంటో ఆ త్యాగం అంటూ బాబు అడగ్గానే.. సన్నీ ఈ స్కిట్ కోసం తన నాలుక కట్ చేసుకున్నాడని చెప్పాడు ఆటో రాం ప్రసాద్. ఇది వినగానే అంతా షాక్ అయ్యారు. అంతలోనే రాంప్రసాద్ ఈ స్కిట్ లో వీడికి మాటలు లేవని చెప్పాడు. వీడు చూడు ఎలా ఉన్నాడు అని తమ్ముడు సన్నీని అడగ్గా.. బాబును చూసి మీసాలు మెలేస్తాడు. ఏంటి ఇలా మీసాలు తిప్పుతున్నాడు అనగా... అచ్చం నువ్వు హీరోలా ఉన్నావని చెబుతున్నాడంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలాగే కంటిన్యూ చేద్దాం వీడికి డైలాగ్స్ ఇవ్వొద్దంటూ వివరించాడు బాబు.

అయితే కేవలం స్కిట్ లో మాత్రమే ఆయన మూగవాడిగా మారాడని తెలుస్తోంది. కేవలం డైలాగ్స్ లేకపోవడం వల్ల ఆయనను నాలుక కోసేసుకున్నాడని చెప్పారు కానీ... అతను వాస్తవానికి అలా ఏం చేయలేదు. కానీ ఇప్పటికే స్కిట్ల కోసం చాలా మంది తమకు నచ్చిన పనులు చేయడంతో ఇది కూడా నిజమేనని అంతా అనుకున్నారు. 29వ తేదీ రోజు వచ్చే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా చూస్తే మీకు కూడా ఓ క్లారిటీ వచ్చేస్తుంది.


Click it and Unblock the Notifications











