హత్యాయత్నంపై నోరు విప్పిన జబర్దస్త్ కమెడియన్ వినోద్.. షాకింగ్ కారణాలు

జబర్దస్త్ ఫేమ్ వినోద్ అలియాస్ వినోదినిపై నిన్న (శనివారం) తీవ్రంగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాచిగూడలోని కుత్బిగూడాలో ఇంటి ఓనర్, కొందరు దుండగులు చేసిన దాడిలో వినోద్ త్రీవంగా గాయపడ్డారు. తలపై, ముఖంపై బలమైన గాయాలు కావడంతో స్నేహితులు ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న వినోద్.. తనపై జరిగిన హత్యాయత్నానికి కారణాలు వెల్లడించాడు. ఆ వివరాలు చూస్తే..

10 లక్షలు అడ్వాన్స్ ఇవ్వగా

10 లక్షలు అడ్వాన్స్ ఇవ్వగా

తాను ఉంటున్న ఇల్లు కొందామని ఇద్దరు వ్యక్తులకు 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని, అయితే ఇంటి రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని వారిని అడగగా రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చారని వినోద్ అన్నాడు. దీంతో రిజిస్ట్రేషన్ అయినా చేయించండి లేదా నా డబ్బు అయినా వెనక్కి తిరిగివ్వండి అని వారిపై ఒత్తిడి తెచ్చానని వినోద్ చెప్పాడు.

సరే సెటిల్‌మెంట్ చేసుకుందాం అని చెప్పి

సరే సెటిల్‌మెంట్ చేసుకుందాం అని చెప్పి

ఓకే నీ 10 లక్షలు ఇవ్వడమా లేక ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడమా.. ఏదో ఒకటి సెటిల్ చేసుకుందామని నమ్మించి నాపై ఇలా దాడికి పాల్పడ్డారని ఆవేదన చెందాడు వినోద్. ఇంటి పైకి పిలిచి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని, నీ 10 లక్షలు ఇవ్వం, ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేయం అంటూ దౌర్జన్యం చేశారని వినోద్ చెప్పాడు.

ఎలాగోలా తప్పించుకుని వస్తుండగా

ఎలాగోలా తప్పించుకుని వస్తుండగా

వారు చెప్పిన దానికి తాను ఓకె అనకపోవడంతో వెంటనే దాడికి దిగారని వినోద్ చెప్పాడు. అయితే ఆ సమయంలో తాను ఎలాగోలా తప్పించుకుని పారిపోదామని ప్రయత్నించగా, వెంటాడి మరీ కడుపులో తన్నారని, కన్నుపై గుద్దడంతో కమిలిపోయిందని చెబుతూ తీవ్ర ఆవేదన చెందాడు వినోద్.

పరారీలో దుండగులు

పరారీలో దుండగులు

జబర్దస్త్ వినోద్ పై జరిగిన దాడిపై వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రధాన నిందితుడిగా ఇంటి ఓనర్ పేరును రాశాడు. వినోద్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వినోద్ పై దాడి చేసిన పరారీలో దుండగులు పరారీలో ఉన్నట్టు తెలిసింది. గతంలో ఓ సారి పెళ్లి విషయంలో కూడా వినోద్‌పై దాడి జరిగింది. అంతేకాదు ఓ సారి వినోద్ కిడ్నాప్ కూడా అయ్యాడు. ప్రస్తుతం వినోద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X