అదిరింది షోలోకి మరో ఇద్దరు జబర్ధస్త్ కమెడియన్లు.. నాగబాబు ఇలా చెప్పడంతో జంప్.!

By Manoj

బుల్లితెరపై వారం వారం వచ్చే షోలు చాలా ఉన్నాయి. అందులో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యేవి మాత్రం చాలా తక్కువ. అలాంటి వాటిలో ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న 'జబర్ధస్త్' షో ఒకటి. దాదాపు ఏడేళ్ల నుంచి ఈ కామెడీ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. అది కూడా వారంలో రెండు రోజులు. ప్రేక్షకుల అభిప్రాయానికి తగినట్లు మార్పులు చేసుకుంటూ వెళ్తున్న జబర్ధస్త్.. ఆదరణను దక్కించుకుంటోంది. ఈ తరుణంలో ఆ షో నుంచి ఇద్దరు కమెడియన్లు 'అదిరింది'లోకి జంప్ అయ్యారని ఓ న్యూస్ లీక్ అయింది. ఇంతకీ ఎవరా ఇద్దరు.? పూర్తి వివరాల్లోకి వెళితే....

జబర్ధస్త్ అంటే వాళ్లు.. వాళ్లంటే జబర్ధస్త్

జబర్ధస్త్ అంటే వాళ్లు.. వాళ్లంటే జబర్ధస్త్

బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతోన్న జబర్ధస్త్ వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు, కమెడియన్లు, రైటర్లు, టెక్నీషియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరీ ముఖ్యంగా కొందరు ఆర్టిస్టులు సినిమా హీరోలతో సమానంగా వాళ్లు అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే, షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన రోజా, నాగబాబుకు మంచి పేరు వచ్చింది.

జబర్ధస్త్‌ షోను నిషేదించాలని డిమాండ్

జబర్ధస్త్‌ షోను నిషేదించాలని డిమాండ్

దాదాపు ఏడేళ్లకు పైగానే జబర్ధస్త్ షో హై టీఆర్పీ రేటింగ్‌ను సంపాదిస్తోంది. దీంతో ఈ షో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని వాడకూడని పదాలు, డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు అసభ్యకరమైన సన్నివేశాలు చేస్తున్నారు కొందరు టీమ్ లీడర్లు. దీంతో ఈ షోను నిషేదించాలని అప్పట్లో చాలా మంది డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

షో నిర్వహకులకు షాకిచ్చిన నాగబాబు

షో నిర్వహకులకు షాకిచ్చిన నాగబాబు

విజయవంతంగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్‌ షోకు జడ్జ్ నాగబాబు భారీ షాక్ ఇచ్చారు. ఏడేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వహించిన ఆయన.. వ్యక్తిగత కారణాలతో షో నుంచి తప్పుకున్నారు. అంతేకాదు, షో నిర్వహకులపై ఆయన సంచలన ఆరోపణలు సైతం చేయడం హాట్ టాపిక్ అయింది. ఆ సమయంలో ఆయనతో పాటు చాలా మంది వెళ్లిపోతారని అనుకున్నా.. అలా జరగలేదు.

నాగబాబు వెంటే డైరెక్టర్స్, టాప్ కమెడియన్

నాగబాబు వెంటే డైరెక్టర్స్, టాప్ కమెడియన్

నాగబాబు వెళ్లిపోయిన సమయంలోనే జబర్ధస్త్‌ షోకు చాలా కాలం నుంచి దర్శకులుగా పని చేస్తున్న నితిన్, భరత్ కూడా నిష్క్రమించారు. వాళ్లతో పాటు టాప్ కమెడియన్ చమ్మక్ చంద్ర టీమ్, కిర్రాక్ ఆర్పీ కూడా జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత వీళ్లందరూ కలిసి మరో ప్రముఖ చానెల్‌లో ‘అదిరింది' అనే కామెడీ షోను ప్రారంభించిన సంగతి విధితమే.

అదిరిందిలోకి మరో ఇద్దరు జబర్ధస్త్ కమెడియన్లు

అదిరిందిలోకి మరో ఇద్దరు జబర్ధస్త్ కమెడియన్లు


లాక్ డౌన్ సమయంలోనూ జబర్ధస్త్, అదిరింది మధ్య పోటీ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జబర్ధస్త్ ఆర్టిస్టులు, నాగబాబు మధ్య సెటైర్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సక్సెస్‌ఫుల్ షో నుంచి మరో ఇద్దరు ‘అదిరింది'లోకి జంప్ అయ్యారని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. వాళ్లిద్దరూ ఎవరో కాదు.. ఇటీవల ఓ కేసులో పోలీసులకు దొరికిన దొరబాబు, పరదేశీనే.

Recommended Video

Dhanraj & Venu Tillu Hilarious Skit On Corona
నాగబాబు ఇలా చెప్పడంతోనే జంప్.!

నాగబాబు ఇలా చెప్పడంతోనే జంప్.!


వాస్తవానికి దొరబాబు, పరదేశీని జబర్ధస్త్ నుంచి తీసేశారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అది నిజమేనన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాళ్లిద్దరూ నాగబాబు చెంతకు చేరారని, ఆయన షోలో అవకాశం కోసం సంప్రదింపులు జరిపారని తెలిసింది. దీంతో మెగా బ్రదర్ వాళ్లను ‘అదిరింది'లోకి తీసుకుంటామని అభయం ఇచ్చారని ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X