దొరబాబు.. నీ పనులకు పరువు పోతోంది... గాలి తీసేసిన భార్య

By Manoj

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను పొందరూ... టీఆర్పీ రేటింగ్‌లో టాప్ ప్లేస్‌లో నిలుస్తోన్న షో జబర్ధస్త్. ఈ షో ద్వారా కొన్ని వందల మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇప్పుడు వాళ్లంతా స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ దొరబాబు ఒకడు. హైపర్ ఆది టీమ్ ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు... షోలో పెర్ఫార్మెన్స్ కంటే వ్యక్తిగతంగా చాలా ఫేమస్ అయ్యాడు. అదే సమయంలో వ్యభిచారం కేసు ద్వారా మరింత హైలైట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో దొరబాబు తీరుపై ఆయన భార్య అమూల్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం.!

జబర్ధస్త్ కంటే ముందు ఆ సినిమాల్లో

జబర్ధస్త్ కంటే ముందు ఆ సినిమాల్లో

దొరబాబు... జబర్ధస్త్‌లోకి రావడానికి ముందే అప్పట్లో బాగా డిమాండ్ ఉన్న బీ గ్రేడ్ చిత్రాల్లో నటించడం ద్వారా చాలా మందికి సుపరిచితుడు అయ్యాడు. ఆ తరహా చిత్రాల్లో నటించిన విషయాన్ని కూడా జబర్ధస్త్‌లో పలుమార్లు వెల్లడించాడు. అవి మాత్రమే కాదు... మామూలు సినిమాల్లోనూ దొరబాబు నటించాడు. చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

హైపర్ ఆది వల్ల హైలైట్ అయ్యాడు

హైపర్ ఆది వల్ల హైలైట్ అయ్యాడు

అప్పటికే నటుడిగా గుర్తింపు దక్కించుకున్న దొరబాబు.... ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్‌లోకి ఎంటర్ అయ్యాడు. అయినా అతడికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ, ఎప్పుడైతే హైపర్ ఆది టీమ్‌లోకి వచ్చాడో.. అప్పటి నుంచి అతడి పేరు మారుమ్రోగిపోయింది. దీంతో దొరబాబుకు క్రేజ్ పెరిగిపోయింది. అంతేకాదు, అతడికి పలు అవకాశాలు కూడా దక్కాయి.

దొరబాబు లైఫ్‌పై హైపర్ పంచులు

దొరబాబు లైఫ్‌పై హైపర్ పంచులు

దొరబాబు కెరీర్ ఆరంభంలో బీ గ్రేడ్ చిత్రాల్లో నటించిన విషయాన్ని హైపర్ ఆది తరచూ తన స్కిట్లలో గుర్తు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతడిపై అడల్ట్ పంచులు పేలుస్తుంటాడు. ఇవి బాగా పేలుతుండడంతో ఇప్పటికీ వాటిని కంటిన్యూ చేస్తున్నాడు. అంతేకాదు, దొరబాబుకు తరచూ ప్లేబాయ్ తరహా పాత్రలు క్రియేట్ చేసి తన స్కిట్లలో ప్రాధాన్యం ఇస్తున్నాడు హైపర్ ఆది.

వ్యభిచారం చేస్తూ దొరికిపోయాడు

వ్యభిచారం చేస్తూ దొరికిపోయాడు

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో దొరబాబు వ్యభిచారం కేసులో చిక్కుకున్నాడు. ఇందులో అతడి స్నేహితుడు, సహచర టీమ్ మెంబర్ పరదేశీ కూడా ఉన్నాడు. విశాఖలోని ఓ లాడ్జ్‌లో పోలీసులు జరిపిన దాడుల్లో ఈ ఇద్దరూ పట్టుబడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు. వీళ్లిద్దరూ మాత్రం తాము అందుకు వెళ్లలేదని చెప్పుకొస్తున్నారు.

పోలీస్ కేసును కూడా వదల్లేదుగా

పోలీస్ కేసును కూడా వదల్లేదుగా

వ్యభిచారం కేసులో ఇరుక్కున్న కొద్ది రోజులకు జబర్ధస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు దొరబాబు, పరదేశీ. దీన్ని కూడా తన స్కిట్ల కోసం వాడుకుంటున్నాడు హైపర్ ఆది. ఇందులో భాగంగానే తరచూ ఆ కేసును గుర్తు చేస్తూ దొరబాబుపై పంచుల వర్షం కురిపిస్తున్నాడు. తన ప్రతి స్కిట్లోనూ ఇదే రిపీట్ చేస్తూ అతడి గాలి తీసేస్తున్నాడు. ఈ విధంగానూ దొరబాబు బాగా హైలైట్ అవుతున్నాడు.

భర్త గాలి తీసేసిన దొరబాబు భార్య

ఆ కేసు సమయంలో దొరబాబుకు బాసటగా నిలిచింది అతడి భార్య అమూల్య. తన భర్త గురించి తనకే బాగా తెలుసని, అతడు తప్పుచేయలేదని స్పష్టం చేసింది. అయితే, తాజాగా దొరబాబు వ్యవహార శైలిపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నన్నేమో అమ్మూ అమ్మూ అంటావ్.. నువ్వు అక్కడ చేసే పనులు చూసి నేనేమో అమ్మో అమ్మో అనుకోవాల్సి వస్తుంది' అంటూ పరువు తీసింది.

Recommended Video

ఇండస్ట్రీ లో ఆయనే నా 'గాడ్ ఫాదర్'!!
హైపర్ ఆది చెప్పడం వల్లే ఆమె ఇలా

హైపర్ ఆది చెప్పడం వల్లే ఆమె ఇలా

దొరబాబు భార్య అమూల్య ఇటీవలే జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగానే హైపర్ ఆది స్కిట్లలో చిన్న పాత్రలు పోషిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరగనున్న ఎపిసోడ్‌లోనూ నటించింది. ఇందులో దొరబాబు ‘నాకింకా పెళ్లి కాలేదు' అనే డైలాగ్ చెబుతాడు. అప్పుడే ఆమె ఎంటరై ‘మరి నేనెవరిని' అంటూ ప్రశ్నించడంతో పాటు పై విధంగా స్పందించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X