Jabardasth నుంచి ఆదాయం లేకపోవడంతో..మరో బడా ప్లాన్ తో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది?

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు అందుకుని ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్న టాప్ కమెడియన్స్ లో సుడిగాలి సుదీర్ హైపర్ ఆది ఉన్నారు. జబర్దస్త్ లో ఉన్నంత కాలం కూడా వీరికి మంచి ఆదాయంతో పాటు సినిమా అవకాశాలు కూడా చాలానే వచ్చాయి. అయితే హఠాత్తుగా వాళ్ళు జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో కూడా అనేక రకాల రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. కారణం చెప్పకుండా వాళ్ళు దూరం కావడం తో కొన్ని వివాదాలు కూడా జరిగి ఉంటాయి అనే అనుమానాలు వచ్చాయి.

జబర్దస్త్ లో ఉన్నప్పుడు భారీగా ఆదాయం అందుతూ ఉండేది. ఇప్పుడు వారందరూ కూడా కేవలం సినిమాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. రీసెంట్ గా హైపర్ ఆది సుడిగాలి సుదీర్ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఒక ప్లాన్ వేసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

ఎప్పుడు విడిపోకుండా..

ఎప్పుడు విడిపోకుండా..

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపును అందుకున్న సుడిగాలి సుదీర్ ఆ తరువాత చాలా తొందరగానే టీం లీడర్ గా కొనసాగిన విషయం తెలిసిందే. జబర్దస్త్ లో ఎక్కువగా కొనసాగిన అతి కొద్దిమందిలో సుడిగాలి సుదీర్ ఒకరు. అతనితోపాటు గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ ఇద్దరూ కూడా మంచి క్రేజ్ తో పాటు జబర్దస్త్ ద్వారా మంచి ఆదాయాన్ని కూడా అందుకున్నారు. ముగ్గురు కూడా ఎప్పుడూ విడిపోకుండా చాలా కలిసికట్టుగా జబర్దస్త్ మరో లెవల్ కు తీసుకువెళ్లారు.

 ఒత్తిడి వల్లే..?

ఒత్తిడి వల్లే..?

జబర్దస్త్ షో లో అంతా సవ్యంగా కొనసాగుతున్న సమయంలోనే సుడిగాలి సుదీర్ టీం సభ్యులు మొత్తం కూడా బయటకు రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటీవల కాలంలో ఈ కామెడీ షో కు కాస్త రేటింగ్ తగ్గుతోంది అనే వార్తలు కూడా వచ్చాయి. రేటింగ్స్ ఎక్కువగా అందుకోవడానికి నిర్వాహకులు కమెడియన్స్ పై లెక్కకు మించి ఒత్తిడి కూడా చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. ఒత్తిడి కారణంగానే కొంతమంది ఈ కామెడీ షో నుంచి బయటకు వచ్చేసినట్లు కథనాలు వెలువడ్డాయి.

అసలు కారణం అదేనా?

అసలు కారణం అదేనా?

జబర్దస్త్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా అసలు కారణం ఈ కమెడియన్స్ బయట పెట్టలేకపోయారు. మిగతా వాళ్ళు సినిమాల కారణంగానే బయటకు వెళ్లిపోయారు అంటూ క్లారిటీ ఇస్తున్నప్పటికీ కూడా సుడిగాలి సుధీర్ టీం మాత్రం పెద్దగా క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం. ప్రస్తుతం వారు కొన్ని సినిమాలతో అయితే బిజీగానే కొనసాగుతున్నారు.

కలవబోతున్న ఆది, సుధీర్?

కలవబోతున్న ఆది, సుధీర్?

జబర్దస్త్ ప్రోగ్రాంతో వారానికి లక్షల్లో ఆదాయం అందుకుంటూ వచ్చిన కమెడియన్స్ కు ఇప్పుడు ఒక సినిమా పూర్తయితే గాని పేమెంట్ లు రావడం లేదట. కొంత మంది నిర్మాతలు పూర్తిస్థాయిలో పేమెంట్స్ కూడా సెట్ చేయడం లేదట. మరోవైపు హైపర్ ఆది పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక వీరు జబర్దస్త్ ద్వారా ఎలాగైతే వారానికోసారి పారితోషికం అందుకున్నారో అదే తరహాలో మరొక రూపంలో ఆదాయాన్ని అందుకోవాలని కలిసికట్టుగా వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

యూ ట్యూబ్ లో న్యూ కంటెంట్ తో?

యూ ట్యూబ్ లో న్యూ కంటెంట్ తో?

యూ ట్యూబ్ లో సుడిగాలి సుదీర్ అలాగే హైపర్ ఆది కొత్త కామెడీ షో మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు ఈ విషయంపై ఎవరు కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ హైపర్ ఆది సుధీర్ అయితే కలిసి ఒక ప్రోగ్రాం కోసం మళ్ళీ కొత్తగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ అన్నీ కుదిరితే త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X