జబర్దస్త్ 12వ వార్షికోత్సవంతో నాగబాబు రీఎంట్రీ.. మరీ రోజా? ఆడేసుకున్న హైపర్ ఆది

బుల్లితెర ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తూ సక్సెస్ తో దూసుకు వెళ్తున్న ఏకైక తెలుగు కామెడీ షో జబర్దస్త్. ఈ షో దశాబ్దానికి పైగా తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సంగతి తెలిసిందే. 2013లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ కామెడీ షో 12 ఏళ్ల పాటు నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. నిరంతరాయంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంది. ఇక ప్రస్తుతం 12 ఏళ్లు గడిచిన సందర్భంగా షో నిర్వాహకులు ఘనంగా వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్నాళ్లు జడ్జీగా వ్యవహరించిన నాగ బాబు మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో సాగిన స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో హైపర్ ఆది రోజాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ కొత్త అధ్యాయం..
పదేళ్లలో జబర్దస్ కామెడీ షోలో ఎన్నో మార్పులు జరుగుతూనే వస్తున్నాయి. జడ్జీల మార్పులు, ఆర్టిస్ట్ లు, టీమ్ లీడర్లు, యాంకర్లు మారుతూనే వస్తున్నారు. కానీ ఆడియెన్స్ కు అందించే కామెడీ కంటెంట్ లో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా చూసుకుంటున్నారు. ఇక రీసెంట్ గా కూడా జబర్దస్త్ న్యూ ఛాప్టర్ అంటూ కొన్ని మార్పులను చేశారు. ఇటీవల ఈ షోలకు ఇద్దరు యాంకర్లను పరిచయం చేశారు. ఫీమేల్ యాంకర్ గా రష్మీ గౌతమ్ కొనసాగతుండగా.. మేల్ యాంకర్ గా మానస్ ను ఎంపిక చేశారు. ఇక మరింత జోష్ తో షోను రన్ చేస్తున్నారు.

Jabardasth Comedy Show 12th Anniversary

12వ వార్షికోత్సవం సందర్భంగా..
జబర్దస్త్ 12వ వార్షికోత్సవాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్పెషల్ ఎపిసోడ్ ను షూట్ చేశారు. ఈ ఎపిసోడ్ లో జబర్దస్త్ ప్రారంభంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జడ్జీ మెగా బ్రదర్ కొణిదెల నాగ బాబును ఆహ్వానించారు. ఆయన తిరిగి షోకు వచ్చినందుకు ఘనంగా స్వాగతించారు. మరోవైపు అప్పటి ఆర్టిస్ట్ లు వేణు, అదిరే అభి, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, హైపర్ ఆది, యాంకర్ అనసూయ వంటి వారిని కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న టీమ్ లీడర్లు స్పెషల్ స్కిట్లను ప్రదర్శించారు. వాటిపై నాగబాబు తీర్పులు చెప్పారు. ముఖ్యంగా నాగబాబు రాకతో షోకు ఫుల్ జోష్ వచ్చింది.

రోజా గురించి హైపర్ ఆది కామెంట్స్..
జబర్దస్త్ షో అంటేనే నాగ బాబు, రోజా అనిపించేలా అప్పట్లో జడ్జీమెంట్ ఇచ్చారు. అయితే 12వ వార్షికోత్సవం సందర్భంగా నాగబాబు రీఎంట్రీ ఇచ్చినప్పటికీ రోజా మాత్రం హాజరు కాలేదు. దీంతో హైపర్ ఆది రోజా ఎంట్రీని స్పెషల్ గా డిజైన్ చేశారు. ఆమెపై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చూపించారు. రోజా భారీ కటౌట్ ను తీసుకొచ్చి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో చిరంజీవి, విజయశాంతి మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ ను రిపీట్ చేశారు. ఈ సందర్భంగా పాలిటిక్స్ విబేధాలు, వ్యక్తిగత దూషణలను గుర్తు చేశారు.

ముఖ్యంగా పొలిటికల్ ప్రమోషన్స్ లో రోజా హైపర్ ఆదిపై మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. నన్ను ఎందుకు ఇంతలా దూషించావని మాట్లాడుకొచ్చారు. నువ్వు నన్ను అన్ని మాటలు అన్న కూడా నేను మాత్రం నిన్ను ఒక్క మాట అనలేదని, కావాలంటే యూట్యూబ్ మొత్తం చూసుకోండి అని సవాల్ విసిరారు. ఇక మీపైన ఎప్పటికీ అభిమానం అలానే ఉంటుందని తెలిపారు. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ ఆగస్టు 1 మరియు ఆగస్టు 2న ఈటీవీలో రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X