Jabardasth Show rating.. టాప్ రేపిన జబర్దస్త్ కామెడీ... అనసూయ షో ఎవరికీ అందనంత రేంజ్‌లో!

తెలుగు బుల్లితెరపై నాన్ సీరియల్స్ విభాగంలో వినోద ప్రధానమైన షోలు మంచి రేటింగ్‌ను సొంతం చేసుకొన్నాయి. 2021 ఏడాదిలో 25వ వారంలోను జబర్దస్త్ కామెడీ షో టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నాయి. తెలుగు టెలివిజన్ రంగంలో ఎక్స్‌ట్రా జబర్దస్త్, స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్, సిక్త్స్‌సెన్స్ లాంటి షోలకు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉన్నట్టు తాజా రేటింగ్స్‌లో స్పష్టమైంది. 25వ వారానికి సంబంధించిన రేటింగ్స్‌లోకి వెళ్తే...

25వ వారం రేటింగ్స్‌లో

25వ వారం రేటింగ్స్‌లో

ప్రస్తుత ఏడాది 25వ వారానికి సంబంధించి.. సీరియల్స్ విభాగంలో స్టార్ మా సత్తా చాటుకొంటే.. నాన్ సీరియల్ విభాగానికి సంబంధించిన రేటింగ్ విషయంలో ఈటీవీ భారీగా గణాంకాలను నమోదు చేసుకొన్నది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన ర్యాంకింగ్‌లో ఈటీవీలోని పలు కార్యక్రమాలను ఉత్తమ ఫలితాలను సాధించింది.

జబర్దస్త్ టాప్ రేటింగ్‌తో

జబర్దస్త్ టాప్ రేటింగ్‌తో

తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు టాప్ రేటింగును సొంతం చేసుకొన్నాయి. గత వారం అంటే.. 24వ వారంలో జబర్తస్త్ ఖతర్నాక్ కామెడీ షో అర్బన్‌లో 5.96, రూరల్‌లో 8.99 రేటింగ్‌ను నమోదు చేశాయి. ఇక తాజా వారంలో 7.64 అర్బన్‌లో, రూరల్‌లో 10.25 రేటింగును జబర్దస్త్ సొంతం చేసుకొన్నది.

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ గురించి

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ గురించి

ఇక ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో విషయానికి వస్తే.. 25వ వారంలో అర్బన్‌లో 6.55, రూరల్‌లో 8.86 రేటింగును నమోదు చేసుకొన్నది. గత వారంతో చూస్తే స్వల్పంగా క్షీణించింది. 24వ వారంలో ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో అర్బన్‌లో 7.00, రూరల్‌లో 8.99 నమోదు చేసింది. అయితే ఈవారం తగ్గడానికి కర్ఫ్యూ, లాక్‌డౌన్ సడలింపులు కారణం కావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

యాంకర్ సుమ, ఓంకార్ షోల రేటింగ్స్

యాంకర్ సుమ, ఓంకార్ షోల రేటింగ్స్

ఇక స్టార్ మా ఛానెల్‌లో యాంకర్ సుమ హోస్ట్‌గా ప్రసారమయ్యే స్టార్ మ్యూజిక్ 25వ వారంలో అర్బన్‌లో 3.55, రూరల్‌లో 4.47 రేటింగ్‌ను సాధించింది. అలాగే కామెడీ స్టార్స్ విషయానికి వస్తే... అర్బన్‌లో 3.33, రూరల్‌లో 4.12 రేటింగ్‌ను సాధించింది. ఇక ఓంకార్ హోస్ట్‌గా నిర్వహించే సిక్త్‌సెన్స్ షో కూడా మంచి రేటింగ్‌ను నమోదు చేసింది. 25వ వారంలో అర్బన్‌లో 4.05, రూరల్‌లో 5.23 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X