జబర్తస్త్ కమెడియన్‌పై హత్యా ప్రయత్నం... తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో
Recommended Video
జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న వినోద్‌కు చేదు అనుభవం ఎదురైంది. లేడీ గెటప్‌లో సుందరాంగి కనిపించే ఈ కమెడియన్‌పై హత్యా ప్రయత్నం జరిగినట్టు సమాచారం. తాజాగా కాచిగూడలోని కుత్బిగూడాలో జరిగిన దాడిలో త్రీవంగా గాయపడ్డారు. తలపై, ముఖంపై భారీగా గాయాలు కావడంతో స్నేహితులు ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వివరాల్లోకి వెళితే

ఓనర్‌తో వ్యక్తిగత విబేధాలు
మీడియా కథనాల ప్రకారం.. కమెడియన్ వినోద్ కొద్దికాలంగా కాచిగూడలో ఉంటున్నారు. కొద్దికాలంగా ఆయనకు తను నివాసం ఉంటున్న ఓనర్‌కు వ్యక్తిగత అభిప్రాయ బేధాలు ఉన్నాయి. దాంతో ఆయనకు ఓనర్‌కు మధ్య కొన్ని రోజులుగా విభేదాలు చోటుచేసుకొంటున్నాయి. అయితే వారి మధ్య ఎందుకు గొడవ చోటుచేసుకొన్నదనే విషయంలో స్పష్టమైన సమాచారం లేదని తెలిసింది.

ఇంటి యజమాని దాడితో
శుక్రవారం రాత్రి (జూలై 19వ తేదీ) వారిద్దరి మధ్య మాట మాట పెరిగి భారీ గొడవకు దారి తీసింది. వినోద్‌పై తన మిత్రులు, కుటుంబ సభ్యులతో దాడి చేశారు. ఆయనకు కంటి మీద గాయం ఏర్పడింది. తలకు కూడా గాయం కావడంతో హాస్పిటల్‌కు తరలించారు అని సమాచారం.

వినోద్‌కు చికిత్సతో
వినోద్ కళ్లకు బలమైన గాయం కావడంతో వైద్యులు కంటి వద్ద కుట్లు వేశారు. వినోద్‌కు ప్రాథమిక చికిత్స అనంతరం తదుపరి రిపోర్టుల ఆధారంంగా ట్రీట్‌మెంట్ చేస్తామని వైద్యులు వెల్లడించినట్టు స్నేహితులు తెలిపారు. గాయపడిన వినోద్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వెలుగు చూశాయి.

పోలీసుల దర్యాప్తుతో
తనపై ఇంటి ఓనర్ దాడి చేసినట్టు వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దాడి కారణం ఏమిటనే విషయాన్ని అటు పోలీసులు గానీ, బాధితుడి వర్గం కాని వెల్లడించడం లేదు. వినోద్ ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పెళ్లి విషయంలో కూడా వినోద్‌పై దాడి జరిగింది. అంతేకాకుండా ఓ సారి కిడ్నాప్ కూడా కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











