twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jabardasth లో అదంతా ఫేక్.. రేటింగ్ తగ్గడంతో క్రేజ్ కోసమే అలా.. షాకింగ్ లీక్?

    |

    జబర్దస్త్ లో ఎలాంటి గొడవలు జరిగినా కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే మీడియాలో కూడా అందుకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో అయితే జబర్దస్త్ పై ఊహించిన విధంగా చాలామంది సీనియర్ కమెడియన్లు స్పందించడం చర్చనీయాంశంగా మారింది. కొందరు తిడుతూ ఉంటే మరికొందరు ఆ తిట్లకు కౌంటర్లు కూడా ఇస్తున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక గొడవ మాత్రం పూర్తిగా రేటింగ్ కోసమే క్రేజ్ కోసమే అలా క్రియేట్ చేసినట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

     అప్పట్లో నెంబర్ వన్ షోగా

    అప్పట్లో నెంబర్ వన్ షోగా

    2013లో పెద్దగా అంచనాలు లేకుండా మొదలైన జబర్దస్త్ షో చాలా తొందరగానే టెలివిజన్ రంగంలో టాప్ షోగా క్రేజ్ అందుకుంది. మొదట్లో ఈ షోకు ఊహించిన విధంగా రేటింగ్స్ అయితే వచ్చాయి. గతంలో ఈ తరహా కామెడీ షో రాకపోవడంతో జనాలు కూడా చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యారు. దీంతో టీఆర్పీ ఒక్కసారిగా 20 వరకు వెళ్లిపోయింది. ఐదేళ్ల వరకు అదే తరహా దూకుడుతో జబర్దస్త్ నెంబర్ వన్ కామెడీ షో గా గుర్తింపును అందుకుంది.

    పోటాపోటీగా

    పోటాపోటీగా

    జబర్దస్త్ సక్సెస్ కావడంతో మిగతా చానల్స్ కూడా కామెడీ ప్రోగ్రామ్లను క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఏవి కూడా జబర్దస్త్ స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాయి. ఇక జబర్దస్త్ పోటీగా మరొక జబర్దస్త్ ఉండాలి అని మల్లెమాల నిర్వాహకులు ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే మరొక షోను కూడా మొదలుపెట్టారు. దానికి కూడా రేటింగ్స్ అయితే భారీ స్థాయిలోనే వచ్చాయి. ఆ రెండు షోలు కూడా పోటా పోటీగా నిలవడం విశేషం.

    లక్షల్లో పారితోషికాలు

    లక్షల్లో పారితోషికాలు

    మొదట వేల రూపాయల్లో పారిపోషకాలు అందుకున్న కమెడియన్ అందరూ కూడా జబర్దస్త్ సక్సెస్ అయిన తర్వాత లక్షల్లో డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇక నిర్వాహకులు కూడా అవసరం ఉన్న ప్రతి ఒక్కరిని వీలైనంత వరకు వదులుకోకుండా వారికి అడిగినంత ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం నిర్వాకుల పనితీరు ఏమాత్రం నచ్చలేదు అని ఓవర్గం వారు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ కారణంగానే నాగబాబు కూడా వచ్చేసినట్లు అర్థమయింది.

    కిర్రాక్ ఆర్పీ ఆరోపణలు

    కిర్రాక్ ఆర్పీ ఆరోపణలు

    అయితే ఇటీవల కాలంలో మాత్రం జబర్దస్త్ షోల రేటింగ్స్ తగ్గుతూ వచ్చాయి. పెద్దగా ప్రాఫిట్స్ అందించే విధంగా రేటింగ్స్ అందుకోవడం లేదు అని నిర్వాహకులు కొంతమంది సీనియర్స్ ఫీజులను కూడా తగ్గించారు. అయితే ఈ క్రమంలో హఠాత్తుగా కిరాక్ ఆర్పి చేసిన కొన్ని వ్యాఖ్యలు జబర్దస్త్ షోపై మరింత వైరల్ గా మారాయి. అతను నిర్వాహకుల పనితీరు అలాగే జబర్దస్త్ లో భోజనం సరిగ్గా లేదు అని కామెంట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

    హఠాత్తుగా ఎందుకు ఇలా?

    హఠాత్తుగా ఎందుకు ఇలా?

    ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారమైతే మల్లెమాల సంస్థలో పనిచేసిన చాలా మంది భోజనం అక్కడ అందరికీ ఒకే తరహాలో చాలా క్వాలిటీ గానే పెడతారు అని వివరణ ఇస్తున్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా కిరాక్ ఆర్పీ ఆ స్థాయిలో ఎందుకు కామెంట్ చేశారు అనే విషయంలో మాత్రం పెద్దగా క్లారిటీ రాలేదు. కానీ మిగతా వాళ్ళు మాత్రం స్పందించడం వెనుక షో పై కొంత హైప్ క్రియేట్ చేయడానికి నిర్వాహకులే ముందుకు తోసినట్లుగా మరొక కొత్త టాక్ వినిపిస్తోంది.

    అయినా లాభం లేదు?

    అయినా లాభం లేదు?

    కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు పట్టించుకోకుండా ఉంటే అతనే సైలెంట్ గా వెళ్ళిపోయేవాడు. గతంలో ఇంతకంటే పెద్ద తరహాలో వివాదాలు వచ్చినప్పటికీ కూడా జబర్దస్త్ వాళ్ళు పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ కిర్రాక్ ఆర్పీ అలా స్పందించడంతో వెంటనే కొంతమంది కమెడియన్స్ ను అతనికి కౌంటర్ ఇచ్చే దానికి ఉసిగొలిపినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో జబర్దస్త్ రేటింగ్స్ బాగా తగ్గడం వల్లనే ఆ విధంగా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ గొడవలు కారణంగా జబర్దస్త్ పెద్దగా లాభం కూడా రాలేదని సమాచారం.

    English summary
    Jabardasth comedy show controversy behind the reasons..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X