జబర్దస్త్ కామెడీ షో నుంచి నాగబాబు, రోజా ఔట్.. తిరిగి రావడం డౌటే?
తెలుగు టెలివిజన్ రంగంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ షో 'జబర్దస్త్ కామెడీ షో'. ఏపీ, తెలంగాణలో ఏ టీవీ షోకు లేనంత రెస్పాన్స్ ఈ షో సొంతం చేసుకుంది. ఇది ప్రారంభమై దాదాపు ఐదేళ్ల దాటిపోయినా ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రేటింగ్స్ పరంగా టాప్ పొజిషన్లో నిలుస్తోంది.
ఎప్పటికప్పుడు కొత్త కమెడియన్లు షోలోకి ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులకు కామెడీలో సరికొత్త కోణం చూపిస్తూ ఎంటర్టెన్ చేస్తున్నారు. జబర్దస్త్ షోకు ప్రధాన ఆకర్షణ రోజా, నాగబాబు. ఈ ఇద్దరూ జడ్జిలుగా కొనసాగడం కూడా షో మరింత రక్తి కట్టడానకి మరో కారణం. అయితే వీరు ఎన్నికల వేళ ప్రచారంలో బిజీ కావడంతో షో చేయలేని పరిస్థితి. దీంతో వారి స్థానంలో కొత్త జడ్జిలు ఎంట్రీ ఇచ్చారు.

శేఖర్ మాస్టర్, మీనా
తాజాగా జబర్దస్త్ షోలోకి... నాగబాబు స్థానంలో శేఖర్ మాస్టర్, రోజా స్థానంలో సీనియర్ నటి మీనా జడ్జిలుగా ఎంట్రీ ఇచ్చారు. గతవారం ప్రారంభమైన షో ఇద్దరితో రన్ కావడం గమనార్హం. అయితే వీరు తాత్కాలికంగా కొనసాగుతారా? లేక కంటిన్యూ అవుతారా? అనేది తెలియాల్సి ఉంది.

నాగబాబు రాజకీయాల్లో బిజీ బిజీ.. జబర్దస్త్‌కి తిరిగి రావడం డౌటే?
మెగా బ్రదర్ నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీలో చేరి నరసాపురం పార్లమెంట్ నిరయోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంపీగా గెలుపొందితే రాజకీయాల్లో మరింత బిజీ అయ్యే అవకాశం ఉంది. అలా కాకపోయినా... జనసేన వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి వస్తారా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది.

మీనా కంటిన్యూ అవుతుందా?
రోజా స్థానంలో ప్రముఖ నటి మీనాను తీసుకురావడం చర్చనీయాంశం అయింది. ఈ ఇద్దరూ కూడా ఒకప్పుడూ హీరోయిన్లుగా పోటీ పడ్డవారే. అందుకే రోజా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా మీనాను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. నాగబాబుతో పాటు రోజా కూడా ఈ షోకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. అందుకే మామూలు వారిని కాకుండా మీనాను తీసుకొచ్చినట్లు టాక్.

భారీ రెమ్యూనరేషన్
జబర్దస్త్ షో చేస్తున్నందుకు గాను శేఖర్ మాస్టర్, మీనాలకు వారు ఇప్పటి వరకు ఏ టీవీ షోకు తీసుకోనంత భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నాగబాబు, రోజా మీదిరిగా వీరు షోను ఏ మేరకు రక్తికట్టించగలరు? అనేది కొన్ని ఎపిసోడ్లు గడిస్తే కానీ చెప్పలేం.


Click it and Unblock the Notifications











