Jabardasth New Chapter: జబర్దస్త్‌కు కొత్త యాంకర్.. యాంకర్ రష్మీ గౌతమ్‌కు యాజమాన్యం షాక్

దశాబ్దానికి పైగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న పాపులర్ కామెడీ షో జబర్దస్త్. 2013లో ప్రారంభమైన ఈ కామెడీ షో ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు, టాలీవుడ్ సీనియర్ ఈ రోజా జడ్జీలుగా మొదలైంది జబర్దస్త్ కామెడీ షో. ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ వెర్షన్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ప్రస్తుతం జబర్దస్త్ రూపు రేఖలను మార్చుతూ మరో నూతన అధ్యాయం మొదలైనట్టు కొత్త సీజన్ ను ప్రారంభించారు. అయితే ఈ షోకు యాంకర్ గా బుల్లితెర స్టార్ వ్యవహరించబోతుండడం మరింత కిక్ ఇచ్చే అంశంగా మారింది.

జబర్దస్త్ న్యూ చాప్టర్...
12 ఏళ్లుగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను జబర్దస్త్ కామెడీ షో అలరిస్తూనే వస్తుంది. ఎప్పటికప్పుడు షోలో మార్పులు జరుగుతున్నప్పటికీ నిరంతరాయంగా కడుపుబ్బ నవ్వించే కామెడీని అందిస్తూ ఉన్నారు. ఇక ఈ షోలో యాజమాన్యం ఎప్పటికప్పుడు ఆర్టిస్టుల విషయంలో, జడ్జెస్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ అభిమానులకు, బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త చెప్పారు. జబర్దస్త్ రీలోడెడ్ అంటూ జబర్దస్త్ న్యూ చాప్టర్ ను ప్రారంభించారు. జూన్ 11న ఇందుకు సంబంధించిన గ్రాండ్ లాంచింగ్ టీజర్ ను కూడా విడుదల చేశారు.

Jabardasth Comedy Show New Chapter is Launched

జబర్దస్త్ న్యూ చాప్టర్ టీజర్ విశేషాలు..
జబర్దస్త్ న్యూ చాప్టర్ కు సంబంధించిన టీజర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ షోలో ఇకపై అంతా కొత్త కంటెంట్, మరింత కిక్కిచ్చే కామెడీ ఉంటుందని టీజర్ ద్వారా తెలియజేశారు. ఇకపై జబర్దస్త్ కామెడీ షోలో చాలా కొత్తగా ఉంటుందని ఫీమేల్ జడ్జీ ఖుష్బూ సుందర్ తెలిపారు. ఈ రీలోడెడ్ వెర్షన్ లో ఎర్జరీ డబుల్, ఎంటర్ టైన్ మెంట్ డబుల్, ఎవర్రీ థింగ్ డబుల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటి వరకు ఆడియెన్స్ లో జబర్దస్ ఉందని, ఇకపై జబర్దస్త్ లో ఆడియెన్స్ ఉంటారని మేల్ జడ్జీ కృష్ణ భగవాన్ చెప్పారు. ప్రతి ఎపిసోడ్ కు ఆడియెన్స్ కు ఆహ్వానించి వారి ముందే ఆర్టిస్ట్ ల లైవ్ పెర్ఫామెన్స్ మరోవైపు షూటింగ్ కూడా జరగబోతోంది. అలాగే ఈషో గురించి మరో కిక్కిచ్చే విషయాన్ని కూడా చెప్పారు. ఇక నుంచి అన్నీ డబుల్ ఉండటంతో యాంకర్ కూడా డబుల్ ఉంటారని ఖుష్బూ తెలిపింది.

మేల్ యాంకర్ గా బుల్లితెర స్టార్?
జబరస్ద్ కామెడీ షోకు ఇప్పటి వరకు ఒక్క ఫీమేల్ యాంకరే ఉన్నారు. కానీ జబర్దస్త్ న్యూ చాప్టర్ వెర్షన్ లో మేల్ యాంకర్ ను కూడా ఎంపిక చేశారు. ఆయన ఎవరనేది మాత్రం టీజర్ లో చూపించ లేదు. కానీ హిట్స్ ఇచ్చారు. ఆ స్టైల్, నడకతీరు, కళ్లజోడు పెట్టే విధానంతో సుడిగాలి సుధీర్ అని తెలుస్తోంది. యాంకర్ రష్మీకి యాజమాన్యం షాకిచ్చేలా మరో యాంకర్ ను తీసుకు రావడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే వీరిద్దరిని మళ్లీ బుల్లితెరపై చూడాలని సుధీర్ ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. వారి కాంబినేషన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ కాంబినేషన్ లో జబర్దస్త్ షో ఇంకెలా నడుస్తుందనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

జబర్దస్త్ న్యూ ఛాప్టర్ టీమ్ లీడర్లు..
జబర్దస్త్ కొత్త ఛాప్టర్ లో కూడా పాత ఆర్టిస్టులే కొనసాగనున్నారు. కొన్ని మార్పులతో తాజాగా కొత్త టీమ్ లీడర్లను కూడా ప్రకటించారు. కృష్ణ భగవాన్, ఖుష్బూ జడ్జీలుగా వ్యవహరిస్తుండగా.. ఆటో రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవా, తాగుబోతు రమేశ్, నూకరాజు, బుల్లెట్ భాస్కర్, యాదమ్మరాజు, సద్దామ్, ఇమ్మాన్యుయేల్ వంటి వారు టీమ్ లీడర్లు వ్యవహరిస్తారు. జూన్ 20న కొత్త వెర్షన్ ఎపిసోడ్ రానుంది. ప్రతి శుక్ర, శని వారం ఈటీవీలో రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X