జుట్టు ముడేసి కొడుతా.. దీపిక పిల్లిపై హైపర్ ఆది వీరంగం.. కమెడియన్ ఇజ్జత్ తీసిన జోర్దార్ సుజాత
బుల్లితెర మీద అత్యంత ప్రజాదరణ పొందిన డ్యాన్స్ షో ఏదైనా ఉందంటే.. అందులో ఢీ షోను ప్రముఖంగా చెప్పుకోవాలి. గడచిన కొద్ది సంవత్సరాల్లో పలు సీజన్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. తాజాగా ఢీ షో కోసం నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ ఆసక్తికరంగా సాగుతున్నది. ఢీ ప్రిమియర్ లీగ్ షోకు సంబంధించిన ప్రోమోలు యూట్యూబ్‌లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో దీపిక పిల్లి, హైపర్ ఆది, జోర్దార్ సుజాతకు సంబంధించిన స్క్రిట్స్ ఫన్నీగా సాగాయి. తాజా ప్రోమోలో వెల్లడించిన ప్రకారం..
ఢీ లేటేస్ట్ సీజన్ కోసం నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ కోసం జట్లను ఎంపిక చేస్తున్నారు. పలు జిల్లాలు, ప్రాంతాల నుంచి బెస్ట్ టీమ్స్‌ను ఎంపిక చేసే దిశగా ప్లాన్ వేశారు. ఈ షోకు శేఖర్ మాస్టర్, పూర్ణ న్యాయమూర్తుులుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు యాంకర్ ప్రదీప్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. దీపిక పిల్లి, హైపర్ ఆది, జోర్దార్ సుజాత తదితరులు మెంటర్స్‌గా పాల్గొంటున్నారు.

డీ ప్రీమియర్ లీగ్‌లో హైపర్ ఆదిని దీపిక పిల్లి, జోర్దార్ సుజాత టార్గెట్ చేస్తూ ఆటపట్టించారు. దీపిక పిల్లి పంచ్ వేస్తూ.. నేను ఢీ షోకు రాగానే.. చేయి చేయి కలిపి.. వెంటనే పులిహోర కలిపిన వ్యక్తి ఒకరు ఉన్నారు అంటూ కామెంట్ చేసింది. దాంతో శేఖర్ మాస్టర్, పూర్ణ నవ్వుల్లో మునిగిపోయారు. హైపర్ ఆది తన గురించి గొప్పగా చెబుతున్నారనే విషయంతో పొంగిపోయాడు. ఈ రోజు మీరు విసిరే రాళ్లు, చెప్పులు ఆయన మీదకే వెళ్లాలి అంటూ కామెంట్ చేసింది.
ఇక డీ ప్రీమియర్ లీగ్‌లోకి జోర్దార్ సుజాత రాగానే.. వదిన అంటూ దీపిక పిల్లి పలకరించింది. దాంతో పక్కనే ఉన్న హైపర్ ఆది రియాక్ట్ అవుతూ..నువ్వు అక్కవు అయితే.. నాకు నీవు అక్కవు అని పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. దాంతో ఒక్కసారిగా హైపర్ ఆదిపై సుజాత భగ్గుమన్నది. నువ్వే అంకుల్ లెక్క ఉన్నావు. నేను నీకు అక్కను ఏందిరా.. కంకి ముఖమోడా అంటూ హైపర్ ఆది గాలి తీసేసింది.

అయితే తనను అడ్డంగా బుక్ చేసిన దీపిక పిల్లి, జోర్దార్ సుజాతను హైపర్ ఆది అంత ఈజీగా వదిలిపెట్టలేదు. మీ ఇద్దరు జుట్లు ముడేసి కొడుతా అంటూ వీరంగం సృష్టించాడు. వారిద్దరి వెంటపడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. దీపిక పిల్లి, హైపర్ ఆది, జోర్దార్ సుజాత మధ్య ఫన్నీగా ఢీ ప్రీమియర్ లీగ్‌లో స్కిట్ సాగింది. తాజా ఎపిసోడ్ ప్రోమోలో చూస్తే భారీగా వినోదాన్ని దట్టించినట్టు కనిపించింది.

ఇదిలా ఉండగా, వరంగల్, బెజవాడ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఔత్సాహిక జట్ల మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. యువతీ, యువకులు పోటాపోటీగా తమ టాలెంట్‌ను ప్రదర్శించారు. వచ్చే సీజన్ కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచేందుకు సిద్దమైందనే విషయం తాజా ఎపిసోడ్స్ స్పష్టం చేశాయి.


Click it and Unblock the Notifications











