సుడిగాలి సుధీర్ పెళ్లికి అడ్డుగా ఎవరంటే?.. జబర్దస్త్ కమెడియన్ భార్య షాకింగ్ కామెంట్స్

తెలుగు బుల్లితెరపై స్టార్‌ స్టేటస్ అనుభవిస్తున్నారు సుడిగాలి సుధీర్. అతి సాధారణ స్థాయి నుంచి వచ్చిన ఈ కుర్రాడు ఇప్పుడు తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. యాంకరింగ్ అంటే ఆడవాళ్లకే అన్న ముద్రని చెరిపివేసి మగాళ్లు కూడా యాంకరింగ్ చేయగలరని నిరూపించిన అతికొద్దిమందిలో సుధీర్ కూడా ఒకడు. ఇక తెలుగునాట మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీసుకొస్తే ఖచ్చితంగా సుధీర్ పేరు ముందు వరుసలో ఉంటుంది. 40కి చేరువ అవుతున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తకపోవడంతో సుధీర్ మ్యారేజ్‌పై ప్రతిరోజూ డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ భార్య ఒకరు సుధీర్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మేజిక్ షోలతో ఇండస్ట్రీలోకి

విజయవాడకు చెందిన సుడిగాలి సుధీర్ అసలు పేరు సుధీర్ ఆనంద్ బయానా. మ్యాజిక్ షోలు చేసుకుంటూ తన కెరీర్ ప్రారంభించిన ఆయన పలు ఛానెల్స్‌లో తన ట్రిక్స్ చూపిస్తూ పాపులారిటీ సంపాదించాడు. ఈ క్రమంలో జబర్దస్త్ షోలో అవకాశం సుధీర్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. వేణు వండర్స్ టీమ్‌లో ఓ చిన్న కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తన ప్రతిభతో.. టీమ్ లీడర్ స్టాయికి ఎదిగాడు. ఈ ప్రయాణంలో తన ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్‌లు అతనికి ఎంతో సాయం చేశారు.

jabardasth Dhanraj Wife Sirisha about Sudigali Sudheer Marriage

హీరో స్థాయికి ఎదిగిన సుధీర్

జబర్దస్త్‌లో చేస్తున్న సమయంలోనే సుధీర్‌కు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. రేసుగుర్రం, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలో ఏకంగా హీరోగా అవకాశం దక్కించుకుని షాకిచ్చాడు. కృషి, శ్రమ, పట్టుదల ఉంటే హీరో కావడం పెద్ద కష్టమేమీ కాదని సుధీర్ నిరూపించాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. త్రీమంకీస్, కాలింగ్ సహస్రా, గాలోడు వంటి సినిమాల్లో కథానాయకుడిగా అలరించాడు. షోలు, సినిమాలు, ఇతర ఈవెంట్స్ ద్వారా సుధీర్ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడని బుల్లితెర వర్గాల టాక్.

రష్మితో సుధీర్ ప్రేమలో ఉన్నాడా?

ఇక జబర్దస్త్ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న రష్మీ గౌతమ్‌కు సుధీర్‌కు మధ్య ఎఫైర్ ఉందని గాసిప్స్ వస్తున్నాయి. ఇది కేవలం డ్రామా మాత్రమేనని, షోలను హిట్ చేసేందుకు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ పెట్టారని పలువురు వ్యాఖ్యానించారు. అయితే ఇద్దరూ దీనిపై నోరెత్తకపోవడం, ఇద్దరూ పెళ్లి మాట ఎత్తకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సుధీర్ కోసం రష్మి.. రష్మి కోసం సుధీర్ వెయిట్ చేస్తున్నారని గాసిప్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ మాజీ కమెడియన్, సినీనటుడు ధనరాజ్ భార్య శిరీష .. సుధీర్ పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Take a Poll

ఆ ముగ్గురూ కోతులు

ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష మాట్లాడుతూ.. సుధీర్, శ్రీను, రాంప్రసాద్‌లు ఎప్పుడూ మా ఇంట్లోనే ఉండేవారని చెప్పారు. ముగ్గురు కోతుల్లాగా గోల చేసేవారని, మాకు ఏం కావాలన్నా అండగా నిలిచేవారని శిరీష అన్నారు. సుధీర్ తనను వదిన అని పిలిచేవాడని.. కష్టముందని తెలిస్తే ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉండేవాడని పేర్కొన్నారు. తనకు తెలిసినంత వరకు సుధీర్‌కు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకుంటే ఒక్కదానికే స్ట్రక్ అయిపోవాలని అలా ఉండటం సుధీర్‌కు ఇష్టం లేదని ఇప్పట్లో తన మనసు అలా ఉందని, భవిష్యత్తులో మారొచ్చని శిరీష వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శిరీష వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X