Jabardasth కొత్త బిజినెస్ మొదలెట్టిన దొరబాబు.. హైపర్ ఆది అండతో మొదలెట్టిన బిజినెస్ ఏంటో తెలుసా?

జబర్దస్త్ షోలో హైపర్ ఆది వేసే పంచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైపర్ ఆది టైమింగ్, ప్రాసలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతూ ఉంటారు. హైపర్ ఆది స్కిట్ చూస్తూ ఉంటే ఎంతటి వారయినా పగలబడి నవ్వాల్సిందే. హైపర్ ఆదికి, ఆయన స్కిట్స్‌కు ఉండే క్రేజ్ తెలియాలంటే యూట్యూబ్‌లో చూడాల్సిందే. మిగతా టీమ్ లీడర్లు ఎవరూ సాధించని విధంగా కొన్ని వందల మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టాడు. ఇక హైపర్ ఆది స్కిట్ అంటే కచ్చితంగా అందులో దొరబాబు, పరదేశి ఖచ్చితంగా ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా దొరబాబు కొత్త బిజినెస్ మొదలు పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే...

 జబర్దస్త్ దొరబాబు

జబర్దస్త్ దొరబాబు

పెద్దిరేల దొరబాబు అనే వ్యక్తి నటుడు అవ్వాలనే కోరికతో హైదరాబాద్ వచ్చి జబర్దస్త్ దొరబాబుగా మారాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించిన దొరబాబు ఇప్పటివరకు టాలీవుడ్ లో కొనిని సినిమాల్లో కూడా నటించారు. ఆది టీం లో చేరిన తరువాత ఆయన మరింత ఫేమస్ అయ్యారు. అమూల్య అనే యాంకర్ ను వివాహం చేసుకున్న దొరబాబు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

కేసులో పట్టుబడి..

కేసులో పట్టుబడి..

దొరబాబు అంతకు ముందు బీ గ్రేడ్ సినిమాల్లో నటించడం గురించి అందరికీ తెలుసు. అందుకే ప్రతి స్కిట్ లో ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటారు హైపర్ ఆది. దానికి తోడూ దొరబాబు, పరదేశీలు వ్యభిచార గృహంలో పట్టుబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది పెద్ద సెన్సేషన్ అయింది. ఆ ఘటన జరిగి ఏడాదిన్నర పైన అవుతున్నా.. హైపర్ ఆది మాత్రం ఇంకా మరిచిపోలేక పోతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా దొరబాబు, పరదేశీలపై పంచ్‌లు వేస్తున్నాడు.

అలా దొరికిపోయి

అలా దొరికిపోయి

జబర్ధస్త్‌లో పని చేస్తున్న ఇద్దరు కమెడియన్లు దొరబాబు, పరదేశి ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ హైపర్ ఆది జట్టులో సభ్యులుగా చేస్తున్నారు. సెకెండ్ లీడ్‌గా ఉన్న ఆర్టిస్టులు అలా దొరికిపోవడం సంచలనం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరినీ టార్గెట్ చేస్తూ ఆది ఎన్నో సార్లు పంచులు వేశారు. ఇప్పటికీ దీన్ని కంటిన్యూ చేస్తున్నారు.

'శ్రీనిక' టిఫిన్ సెంటర్‌

'శ్రీనిక' టిఫిన్ సెంటర్‌

అయితే తాజాగా జబర్దస్త్ కమెడియన్ దొరబాబు కామెడీ ఆర్టిస్ట్ హైపర్ ఆది ఆశీస్సులతో తన సోదరుడిని ఆదుకోవడానికి కొత్త వ్యాపారం ప్రారంభించారు. లేడీ గెటప్ కమెడియన్ శాంతి స్వరూప్ తన యూట్యూబ్ ఛానెల్‌లో హైదరాబాద్‌లోని మైత్రీవనం సమీపంలో 'శ్రీనిక' అనే టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించిన వీడియోను పంచుకున్నారు.

Recommended Video

Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
ఓపెనింగ్

ఓపెనింగ్

ఇక ఈ ఓపెనింగ్ కార్యక్రమం గురించి చేసిన వీడియోలో హైపర్ ఆది మరియు శాంతి స్వరూప్‌తో పాటు, ఇతర జబర్దస్త్ కమెడియన్స్ అప్పారావు, రైజింగ్ రాజు, రాకెట్ రాఘవ, పరదేశి, ప్రసాద్ మరియు నాగి, రాము ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై ఆహారాన్ని రుచి చూశారు. సరసమైన ధరలకు ఆంధ్రా, తెలంగాణా వంటకాలను అందజేస్తున్నట్లు హైపర్ ఆది తెలిపారు. హైదరాబాద్ మైత్రీవనం దగ్గర్లో ఉన్న ఈ టిఫిన్ సెంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X