హైపర్ ఆది నిజస్వరూపం బయటపెట్టిన దొరబాబు భార్య: అందుకే ఫోన్‌లో అలా.. పర్సనల్ మేటర్ లీక్ చేసింది
బుల్లితెరపైకి ఎంతో మంది ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తుంటారు. అయితే, వారిలో కొందరు మాత్రమే సక్సెస్‌ను అందుకుంటారు. అందులోనూ మరికొందరైతే బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోతారు. ఈ జాబితాలోకే వస్తాడు జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది. సాధారణ ఆర్టిస్టుగా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయికి ఎదిగిపోయాడు. దీంతో స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నాడు. ఇలాంటి ఆదిపై జబర్ధస్త్ కమెడియన్ దొరబాబు భార్య షాకింగ్ కామెంట్స్ చేసింది. చేదు ఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఆ సంగతులు మీకోసం!

అలా మొదలైన కెరీర్.. దూసుకెళ్తున్నాడు
సినిమా స్ఫూఫ్‌లు, డబ్‌స్మాష్ వీడియాలు చేస్తూ కెరీర్‌ను మొదలు పెట్టాడు ఆది. అలా సోషల్ మీడియాలో చాలా మంది గుర్తించే స్థాయికి ఎదిగాడు. సరిగ్గా అప్పుడే అదిరే అభి ద్వారా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ టీమ్‌లో పని చేస్తున్న సమయంలోనే అతడిలోని అద్భుతమైన టాలెంట్‌ను గుర్తించిన షో నిర్వహకులు.. టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. అప్పటి నుంచి దూసుకెళ్తున్నాడు.

వన్ మ్యాన్ షోగా.. పంచులతో దండయాత్ర
ఎప్పుడైతే టీమ్ లీడర్ అయ్యాడో.. అప్పటి నుంచి హైపర్ ఆదికి తిరుగు లేకుండా పోయింది. పక్కన ఎంత మంది ఆర్టిస్టులు ఉన్నా.. పంచులతో వాళ్లందరిపై దండయాత్ర చేస్తుంటాడు. ఈ క్రమంలోనే గుక్క తిప్పుకోకుండా వాళ్లపై సెటైర్లు వేస్తూ ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాడు. తద్వారా అన్ని స్కిట్లనూ వన్ మ్యాన్ షోగా మార్చుకుంటున్నాడు. అందుకే అతడి పేరు మారుమ్రోగిపోతోంది.

ఎవ్వరినీ వదలని ఆది... అందుకే ట్రెండింగ్
హైపర్ ఆది స్కిట్లు సక్సెస్ అవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ట్రెండింగ్ అంశాలను వాడడం బాగా కలిసొస్తుంది. సమాజంలో జరిగే చాలా విషయాలను అతడు కామెడీకి వాడడంతో ఎక్కువ హిట్ అవుతున్నాడు. అదే సమయంలో షోలో పని చేసే యాంకర్లు, మిగిలిన టీమ్ లీడర్లనూ వదిలి పెట్టకుండా సెటైర్లు వేస్తుంటాడు. అందుకే అతడి స్కిట్లు ఎప్పుడూ ట్రెండు అవుతాయి.

వ్యభిచారం కేసుపై ఫోకస్ చేసి.. పంచులతో
జబర్ధస్త్‌లో హైపర్ ఆది టీమ్‌లో పని చేస్తున్న ఇద్దరు కమెడియన్లు దొరబాబు, పరదేశి ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఆ టీమ్‌లో సెకెండ్ లీడ్‌గా ఉన్న ఆర్టిస్టులు కావడంతో అప్పుడీ కేసు పెద్ద సంచలనం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరినీ టార్గెట్ చేస్తూ ఆది ఎన్నోసార్లు పంచులు వేశాడు. ఇప్పటికీ దీన్నే కంటిన్యూ చేస్తున్నాడు.

ఆ కంపెనీలోకి భార్యతో కలిసి వచ్చిన దొర
దొరబాబు తన భార్య అమూల్యను జబర్ధస్త్‌కు కూడా పరిచయం చేసిన విషయం తెలిసిందే. హైపర్ ఆది చేసిన కొన్ని స్కిట్లలో ఆమె పని చేసింది కూడా. ఈ క్రమంలోనే ఇప్పుడు అదే ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోకు తన భార్యతో కలిసి వచ్చాడు దొరబాబు. ఇందులో వాళ్లిద్దరూ కలిసి తెగ ఎంజాయ్ చేయడంతో పాటు ఎన్నో ముఖ్య విషయాలను పంచుకున్నారు.

అందుకే అతడిని పెళ్లి చేసుకున్నానంటూ
షోలో భాగంగా దొరబాబుతో కలిసి వచ్చిన అమూల్యతో 'దొరబాబును ఎందుకు పెళ్లి చేసుకున్నావ్' అని హోస్ట్ సుడిగాలి సుధీర్ ప్రశ్నించాడు. దీనికి ఆమె 'దొరలాంటి వాడిని పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు చెబితే.. దొరలాంటి వాడెందుకని దొరబాబునే చేసుకున్నా' అంటూ పంచ్ పేల్చింది. దీనికి పక్కనే ఉన్న ఆది 'నీకు ఫాలోయింగ్ ఎందుకొచ్చిందో ఇప్పుడు అర్థమైంది' అని కౌంటర్ వేశాడు.
Recommended Video

హైపర్ ఆది నిజస్వరూపం బయటపెట్టింది
ఇక, ఇదే షోలో హైపర్ ఆది గురించి అమూల్య మాట్లాడుతూ.. 'మేము కష్టాల్లో ఉన్న సమయంలో ఆది గారే ఆదుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయనే మా వెంట ఉన్నారు. అందుకే ఆయన నెంబర్‌ను మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం' అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో దొరబాబుపై పంచులు వేస్తున్నా.. అతడికి హైపర్ ఆది ఎలా హెల్ప్ చేశాడో రివీల్ చేసిందామె.


Click it and Unblock the Notifications











