twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్పీ బండారం బట్టబయలు చేసిన జబర్దస్త్ ఏడుకొండలు.. అందుకే సినిమా ఆగిందట!

    |

    జబర్దస్త్ మీద ఆ ప్రోగ్రాం నిర్మించిన నిర్మాణ సంస్థ మల్లెమాల పైన అలాగే నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి పైన జబర్దస్త్ లో ఒకప్పటి కంటెస్టెంట్ గా ఉన్న కిరాక్ ఆర్పీ పలు సంచలన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. మల్లెమాలలో భోజనం మొదలు అనేక విషయాల మీద ఆయన అనేక ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కరొక్కరిగా జబర్దస్త్ తరఫున మాట్లాడుతూ ఆయన ఆరోపణలు ఖండిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు కూడా చేరాడు. ఆ వివరాలు వెళ్తే

    కరెక్ట్ కాదంటూ

    కరెక్ట్ కాదంటూ

    ఒకప్పుడు జబర్దస్త్ లో మేనేజర్ ఏడుకొండలుకి సూపర్ క్రేజ్ ఉండేది. ఏకంగా ఆయన మేనరిజంతో స్కిట్స్ చేసి మరీ టీం లీడర్లు, కంటెస్టెంట్లు ఆయనతో మంచి అనుబంధం కలిగి ఉండేవారు. అయితే తర్వాతి కాలంలో ఆయన జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారు. అలా వచ్చి కూడా ఏడేళ్లు అవుతోంది. అయితే ఇప్పుడు శ్యాం ప్రసాద్ రెడ్డి పైన తల్లి లాంటి జబర్దస్త్ పైన ఆర్పీ ఇలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ ఏడుకొండలు తాజాగా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

    మేనేజర్ గా ఉండమని

    మేనేజర్ గా ఉండమని

    ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక సంచలన విషయాలను బయటపెట్టారు. తాను జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత అనేక సినిమాలకు మేనేజర్ గా పని చేశానని అదే సమయంలో ఒక సినిమా డబ్బింగ్ కోసం ఆర్పీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో ఆర్పీ అక్కడ తనను చూసి తన సినిమాకు మేనేజర్ గా ఉండమని కోరాడని తన జీతం 30 వేలు అయితే తనకు 50, 000 ఇస్తేనే సినిమా చేస్తానని అన్నానని ఆ 50, 000 ఇవ్వడానికి కూడా ఆర్పీ సిద్ధమయ్యాడని అన్నారు.

    సినిమా మొదలు పెట్టొచ్చు అని

    సినిమా మొదలు పెట్టొచ్చు అని

    అలా ఒక నెల అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆఫీస్ కి వెళ్లడం ప్రారంభించామని ఆఫీస్ కి వెళ్లడం ప్రారంభించిన తర్వాత అతను చేస్తున్న ఫ్రాడ్ వ్యవహారాలన్నీ తెలుసని చెప్పుకొచ్చారు. ముందు సినిమాలో ఎవరో నటీనటులు అని అడిగితే ప్రభాస్ గారి కజిన్ ఒకాయన ఉన్నారని ప్రస్తుతం కొంచెం హెవీ బాడీ ఉంది మరి కొన్నాళ్లలో తగ్గితే మనం సినిమా మొదలు పెట్టొచ్చు అని అనేవాడని అన్నారు.

    గట్టిగా అడగడంతో

    గట్టిగా అడగడంతో

    తర్వాత చిన్ని చరణ్ అనే సంగీత దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చామని, చెప్పారని అది నిజమే కానీ ఎవరో సినిమాటోగ్రాఫర్ కి అడ్వాన్స్ ఇచ్చినట్లు చెప్పిన విషయం మాత్రం నిజం కాదని తర్వాత తెలిసిందని అన్నారు. ఇదే విషయాన్ని నేను ఆ సదరు నిర్మాత అరుణాచలానికి చెప్పానని ఆయన గట్టిగా అడగడంతోనే ఆర్పీ ప్లేట్ ఫిరాయించాడని చెప్పుకొచ్చారు.

    ఆర్పీదే తప్పు

    ఆర్పీదే తప్పు

    అక్కడితోనే సినిమా చేయడానికి ఆయన ఆసక్తి చూపించలేదని అరుణాచలం ఐపి పెట్టి ఉండవచ్చు కానీ సినిమా విషయంలో మాత్రం ఆర్పీదే తప్పు అన్నట్లు కామెంట్ చేశారు. మరి ఈ విషయం మీద ఆర్పీ ఎలా స్పందిస్తాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

    English summary
    jabardasth edukondalu reveals kiraak rp movie issue in his latest interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X