కేక్ తెచ్చిన తంటా .. ఇమ్మాన్యుయేల్ సీరియస్.. నోరెత్తని రష్మీ గౌతమ్ !

కొత్త కొత్త రియాలిటీ షోలు, కార్యక్రమాలతో ఈటీవీ దూసుకెళ్తోంది. ఈ ఛానెల్‌కు ల్యాండ్ మార్క్ అన్నట్లుగా తయారైన జబర్దస్త్ ద్వారా బాగా క్లిక్ అయిన మరో ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. దాదాపుగా జబర్దస్త్ నటీనటులే ఈ షోను నడిపిస్తుండటం కామెడీ టైమింగ్ కూడా బాగుండటంతో ప్రేక్షకులు శ్రీదేవి డ్రామా కంపెనీని బాగానే ఆదరిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.

మల్లెమాల సంస్థ డిజైన్ చేసిన కార్యక్రమాలు ఇటీవలి కాలంలో బాగా క్లిక్ అవుతున్నాయి. ఇందులో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. జబర్దస్త్‌కు రెస్పాన్స్ తగ్గుతున్న దశలో తెరపైకి తెచ్చిన ఈ షోకు మొదట్లో ఎవరెవరో కమెడియన్లు, ముక్కూ మొహం తెలియనివారు రావడంతో ఇందులో విషయం లేదని జనానికి అర్ధమైపోయింది. దీంతో కార్యక్రమాన్ని ఎలా నిలబట్టాలా అని మల్లెమాల పెద్దలు వ్యూహం మార్చి సుడిగాలి సుధీర్‌ని రంగంలోకి దించారు.

jabardasth emmanuel anger on co contestant at Sridevi Drama Company here s the details

హోస్టింగ్ సుధీర్ చేతుల్లోకి వచ్చాక శ్రీదేవి డ్రామా కంపెనీ లుక్ మారింది. చలాకీతనం , సమయస్పూర్తి, తన టైమింగ్‌లతో ఈ షోని నిలబెట్టి ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చాడు సుధీర్. వారం వారం కొత్త కొత్త ఎలిమెంట్స్‌తో మేకర్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవడంతో షో గాడినపడి ఈటీవీకి పెద్ద ఎస్సెట్‌గా మారుతోంది. గతవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి బప్పా మోరియా అంటూ వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ బాగానే పేలింది. ముఖ్యంగా వర్ష- ఆటో రాంప్రసాద్ మధ్య మాటల యుద్ధం బాగా హైలెైట్ అయ్యింది.

తాజాగా సెప్టెంబర్ 22వ తేదీకి సంబంధించి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోని ఈటీవీ రిలీజ్ చేసింది. ఈసారి ఫోక్ సింగర్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో షోని ప్లాన్ చేశారు నిర్వాహకులు. వీళ్లంతా ఫోక్స్ సింగర్స్ కాబట్టి వచ్చారు.. నువ్వెందుకు వచ్చావని హైపర్ ఆది అడగ్గా.. నూకరాజు నోటితో ఏదో సౌండ్ చేయగా వద్దులే అంటాడు. తమకు గుర్తింపు తీసుకొచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫోక్స్ సింగర్స్ ఓ పార్టీని ఏర్పాటు చేసి అందరికీ కొసరి కొసరి తినిపిస్తారు. వారి పాటలకు జబర్దస్త్ వర్ష మాస్ స్టెప్స్‌తో హోరెత్తిస్తుంది.

అంత్యక్షరిలో రి అనే పదానికి ఏ పాట పాడాలో తెలియక.. ఆ అక్షరాన్ని తొలగించాలని బుల్లెట్ భాస్కర్ ఇంద్రజను రిక్వెస్ట్ చేస్తాడు. కేకులో రూ.25 వేల విలువైన గోల్డ్ రింగ్‌ని పెట్టి తినమని ఇస్తుంది రష్మి. అయితే కేక్‌ని ముఖానికి పూయడంపై ఓ కంటెస్టెంట్ .. ఇమ్మాన్యుయేల్‌పై ఫైర్ అవుతాడు. నువ్వు ఇష్యూని చాలా పెద్దది చేస్తున్నావ్ అన్నా అంటూ ఇమ్మాన్యుయేల్ కూడా సీరియస్ అవుతాడు. దీంతో స్టేజ్ మీదున్న వాళ్లంతా నిలబడి చూస్తుంటారు. మరి ఈ గొడవ ఎలా సద్దుమణిగింది, ఆ రింగ్ దక్కించుకున్న అదృష్టవంతుడు ఎవరు ..? తెలియాలంటే సెప్టెంబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఆ ప్రోమోని మీరు కూడా చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X