Jabardasth: ఆ హీరోయిన్ బెడ్ రూమ్ వీడియో కావాలన్న జబర్దస్త్ కమెడియన్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్స్!
జబర్దస్త్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ను ఇచ్చింది. ఎంతో మంది ఈ షో ద్వారా పాపులర్ అయ్యి.. సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నారు. అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఈ షోకు బేబీ సినిమా హీరో విరాజ్ అశ్విన్ వచ్చారు. దీంతో ఓ కమెడియన్ అడగకూడని ప్రశ్న అడిగాడు. కొన్ని సార్లు ఈ షోలో కామెడీ పేరుతో హద్దు మీరుతారనే విషయం తెలిసిందే. ఇక ఓ కమెడియన్ చేసిన పనికి హీరోతో పాటు.. జడ్జ్, యాంకర్ సైతం షాక్ అయ్యారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పాపులర్ అయ్యి... సినిమాలు చేసుకుంటున్నారు. ఓ సుధీర్, ఆది, గెటప్ శ్రీను వంటి కమెడియన్స్ సినిమాల్లో పాపులర్ అయ్యారు. ఇక వీరే కాదు.. చాలా మంది సినిమాల్లో సెటిల్ అయ్యారు. వేణు డైరెక్టర్ గా మారగా... ధనరాజ్ కూడా మారబోతున్నాడు. మరోవైపు శాంతి స్వరూప్ కూడా డైరెక్టర్ గా మారాడు. ఇలా చాలా మంది కమెడియన్స్ సినిమాల్లో సెటిల్ అయ్యారు.

ఇక ఆ విషయం పక్కన పెడితే.. జబర్దస్త్ షోలో ఈ మధ్య హద్దు మీరిన కామెడీ ఉంటుంది. వల్గర్ పంచ్ లతో జనాలపై కామెడీ రుద్దుతున్నారు. ఇంట్లో ఫ్యామిలీతో చూసే కాస్త... ఎవరికి వాళ్లం సపరెేట్ గా చూడాల్సి వస్తుంది. కుళ్లు జోకులు, డబుల్ మీనింగ్ డైలాగులతో జనాలకు చిరాకు తెప్పిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎక్స్ట్ ట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. అందులో ఓ కమెడియన్ అడగరాని ప్రశ్న వేసి.. షాక్ అయ్యాలా చేశాడు.
ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు రష్మి యాంకర్. ఇక ఈ షోకు బేబీ హీరోయిన్ విరాజ్ అశ్విన్ గెస్టుగా వచ్చారు. ఆయన బేబీ సినిమాతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదల అయిన బేబీ.. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దాదాపు 100 కోట్లరూపాయలు రాబట్టి.. సంచలనం క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీలో వైష్ణవి చైతన్యకు, ఆనంద్ దేవరకొండకు కూడా మంచి క్రేజ్ దక్కింది.

అయితే ఈ షోలో పాల్గొన్న విరాజ్ అశ్విన్ ను.. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్.. ఓ ప్రశ్న అడిగాడు. ఎలాగూ వచ్చారు కదా.. వైష్ణవి చైతన్య బెడ్ రూమ్ గంట వీడియో ఉందా అంటూ వెకిలి ప్రశ్న అడిగాడు. దాన్ని నాకు కొంచెం ఫార్వడ్ చేయండి అంటూ కామెడీ పేరుతో ఈ విధంగా అడిగాడు. దీంతో విరాజ్ అశ్విన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయాడు విరాజ్. ఇక అక్కడే ఉన్న జడ్జ్ లు ఇంద్రజ, భగవాన్, యాంకర్ రష్మి సైతం షాక్ అయ్యారు.
ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలోని ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఎపిసోడ్ నవంబర్ 24వ తేదీన ప్రసారం కానుంది. అయితే ఇలాంటి చీప్ ప్రశ్నలు.. వెకిలి కామెడీ అవసరమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతలా దిగజారిపోయారు ఏంట్రా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.


Click it and Unblock the Notifications











