twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఫోన్ నంబర్ బ్లాక్ చేసింది.. వర్ష నిజస్వరూపం బయటపెట్టిన ఇమాన్యుయేల్.. గెటప్ శ్రీనుతో అలా..!

    |

    బుల్లితెరపై ఫేమస్ అవ్వడం కోసం కొందరు లవ్ ట్రాకులు వాడుకుంటున్న సంగతి తెలిసిందే. లవ్ ట్రాకులతో కొన్ని షోలు, కొన్ని స్కిట్లను కొన్నేళ్లుగా సాగదీస్తూ వస్తున్నారు. ఒకానొక దశలో ఈ ట్రాకులను జనాలు పట్టించుకోవడం మానేశారు. అయినా కూడా షో నిర్వాహకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంకా కొత్త కొత్త ట్రాకులను తెచ్చి షోలను నడిపిస్తుంటారు. అలా కొత్త కొత్త ట్రాకులను పుట్టిస్తూనే ఉంటారు. జబర్దస్త్‌, ఇతర షోలలో సుధీర్ రష్మీ ట్రాక్ తరువాత.. వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్‌కు అంతటి పేరు వచ్చింది. అయితే వర్షతో తనకు ఉన్న రిలేషన్ గురించి ఇమ్మాన్యుయేల్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఏమిటంటే?

     ఊర మాస్ కామెడీతో

    ఊర మాస్ కామెడీతో

    జబర్దస్త్‌ ఊర మాస్ కామెడీతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. అయితే ఇందులో వచ్చే కంటెంట్‌పై మొదట్లో ఇదేంటి? ఇలా అడల్ట్ కంటెంట్ షోలో జొప్పిస్తున్నారేమిటనే కామెంట్లు, వివాదాలు చెలరేగాయి. అయితే ఇలాంటి కామెంట్లు, విమర్శలు పట్టించుకోకుండా ఈ షో ముందుకు వెళ్లింది. ఇండస్ట్రీకి కొత్త కొత్త హాస్యనటులను, కమెడియన్‌లను అందించింది. ఈ క్రమంలోనే ఇమ్మాన్యుయేల్, వర్ష జంటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

    మొదట్లో అలా..

    మొదట్లో అలా..

    ఇమాన్యుయేల్‌కు మొదట్లో ఈ ట్రాక్ ఉండేది కాదు. నల్లగా ఉన్నాడు.. జుట్టు లేదు.. చాక్లెట్ బాయ్ అంటూ ఇలాంటి పేర్లు పెట్టారు. రోజా కూడా ముద్దుగా చాక్లెట్ బాయ్ అని కౌంటర్లు వేసేది. అలా ఇమాన్యుయేల్ కెరీర్ పోతూ ఉంది. మధ్యలో వర్ష ఎంట్రీ ఇచ్చింది. సీరియళ్లు చేసుకుంటూ ఉన్న వర్షకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ షోలో చేసిన మొదటి స్కిట్‌తోనే అందరి దృష్టిలో పడింది.

    మొదలైన ట్రాక్..

    మొదలైన ట్రాక్..

    వర్ష ఇమాన్యుయేల్ కలిసి ఓ రెండు మూడు స్కిట్లు చేశాక.. ఈ లవ్ ట్రాక్‌‌ను జబర్దస్త్ డైరెక్షన్ టీం ఎంకరేజ్ చేసినట్టుంది. అలా మొదలైన ట్రాక్.. చివరకు పీక్స్‌కు చేరింది. ఈ ఇద్దరి పెళ్లి మీదే ఈవెంట్ చేసే వరకు వచ్చింది. అక్కడి వరకు జనాలు ఓపిక పట్టారు. కానీ వీరి పెళ్లి నాటకం ఆడుతూ వేసిన స్కిట్ తరువాత జనాలు చీదరించుకోవడం మొదలుపెట్టారు. దీంతో మధ్యలో ఈ ట్రాక్ గొడవను పక్కన పెట్టేశారు.

    వీడని ప్రేమలా..

    వీడని ప్రేమలా..

    వర్ష ఇమాన్యుయేల్ మీద వచ్చే స్కిట్లన్నీ లవ్ చుట్టూనే ఉంటాయి. ఇద్దరూ భార్యభర్తలుగానో, ప్రేమికుల్లానో నటిస్తుంటారు. ఆ మధ్య వరుసలు మారుస్తూ రెండు మూడు స్కిట్లు వేశారు. కానీ అది వర్కవుట్ కాలేదు. చివరకు లవర్స్‌గానే స్క్రీన్ మీద కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఈ ఇద్దరిది నిజమైన ప్రేమే అని భ్రమపడేలా చేస్తుంటారు. ఇక వర్ష అయితే లవ్ కొటేషన్స్, ప్రేమ డైలాగ్స్ బాగానే చెబుతుంది స్టేజ్ మీద.

    నంబర్ బ్లాక్ చేసిందట..

    నంబర్ బ్లాక్ చేసిందట..

    తాజాగా గెటప్ శ్రీను వేసిన స్కిట్లో అసలు విషయం బయటకు వచ్చింది. మేం ఇద్దరం లవర్స్ కాదు.. ఎవరు చెప్పారండి.. కెమెరాముందు డైలాగ్స్ చెబుతుంది.. బయటకు వెళ్తే నా నంబర్ బ్లాక్ చేస్తుంది.. నేను ఎక్కడికైనా వెళ్తే.. అన్నా వదిన ఎక్కడా? అని అడుగుతుంటారు.. అని తన ఫ్రస్ట్రేషన్‌ను బయటపెట్టేశాడు ఇమాన్యుయేల్.

    English summary
    Emmanuel love track with Varsha is special attraction in Jabardasth show. Here is the Emmanuel's clarity about his love with Varsha in Getup Srinu skit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X