twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Varsha Emmanuel: వర్ష బర్త్ డేకు ఇమ్మాన్యుయేల్ కాస్ట్ లీ గిఫ్ట్.. పెళ్లి షాపింగ్ త్వరలో చేస్తామంటూ..

    |

    అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షోలో వేసే స్కిట్స్ లలో ప్రేమలు, పెళ్లిల్లతో ఎంటర్టైన్ చేస్తారు. అలాగే షోలో ప్రోమోల కోసం ఎప్పుడూ జంటలు పుట్టుకొస్తారు. అలాంటి జంటలు పెళ్లి పీటల వరకు అయితే వెళ్లవనే చెప్పాలి. సుడిగాలి సుధీర్ అండ్ రష్మీ గౌతమ్ గానీ, మరో జంట గానీ, తర్వా త వచ్చే జంట గానీ వీక్షకులను ఆకట్టుకోవడం కోసం మాత్రమే అలా నటిస్తారని ఆడియెన్స్ కు అర్థమైంది. జబర్దస్త్ నుంచి పుట్టుకొచ్చిన మరో ఆన్ స్క్రీన్ జంట వర్ష అండ్ ఇమ్మాన్యుయేల్. అయితే తాజాగా వర్షకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు ఇమ్మాన్యుయేల్.

    రిలేషన్ షిప్ పై అనేక పుకార్లు..

    రిలేషన్ షిప్ పై అనేక పుకార్లు..

    జబర్దస్త్ కామెడీ షోలో వర్ష-ఇమ్మాన్యుయేల్ జంట గురించి తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ కు పరిచయం అవసరం లేదు. వీళ్లది ఆన్ స్క్రీన్ బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్. అలాగే స్కిట్ లలో స్టేజిపై వీళ్లద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ, కామెడీ బుల్లితెరకు వీక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తుంది. అయితే వీళ్ల రిలేషన్ షిప్ పై అనేక పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. అవన్ని రూమర్స్ గానే మిగిలిపోయాయి. సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ జంట తర్వాత అంత పాపులర్ అయన జంట వీళ్లదే.

    నెల ముందుగానే..

    నెల ముందుగానే..

    ఇదిలా ఉంటే తాజాగా వర్షకు ఇమ్మాన్యుయేల్ సర్ ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. అది కూడా నెల ముందుగానే. నెల ముందుగా ఇమ్మాన్యుయేల్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ తో ఆశ్చర్యపోయింది వర్ష. ఇమ్మాన్యుయేల్ వర్షను ఓ జ్యూయెలరీ షోరూమ్ కి తీసుకెళ్తాడు. అది సిల్వర్ జ్యూయెలరీ షో రూమ్. సిల్వర్ జ్యూయెలరీ షో రూమ్ కు తీసుకురావడంపై వర్ష ప్రశ్నిస్తుంది. గోల్డ్ ఇస్తే ఎక్కువ ఖర్చు అవుతుందని ఇక్కడికి తీసుకొచ్చావా అని అంటుంది వర్ష.

    పెళ్లి షాపింగ్ కూడా చేస్తాం..

    పెళ్లి షాపింగ్ కూడా చేస్తాం..

    వర్ష అలా అన్న వెంటనే ''నీకు గోల్డ్ కూడా ఉందిరా. అయితే అది ఇప్పుడు కాదు. మన పెళ్లికి. పెళ్లి షాపింగ్ కూడా చేస్తాం త్వరలోనే. మా పిల్లల్ని కూడా చూపిస్తాం'' అని ఇమ్మాన్యుయేల్ అన్నాడు. అయితే ఇదంతా ఓ యూట్యూబ్ వ్లాగ్ లో భాగంగా చేశారు. ఇటీవల ఇమ్మాన్యుయేల్ ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. అందులోని ఓ వ్లాగ్ లో భాగంగా వర్షకు బర్త్ డే స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నట్లు ఆ జ్యూయలరీ షోరూమ్ బ్లాగ్ చేశాడు ఇమ్ము.

    అదే బర్త్ డే గిఫ్ట్..

    అదే బర్త్ డే గిఫ్ట్..

    జ్యూయలరీ షో రూమ్ ను వర్షతో కలిసి పరిశీలించాడు ఇమ్మాన్యుయేల్. అదంతా అయిపోయాక చివరిలో వర్ష ఒక సిల్వర్ నెక్లెస్ పెట్టుకుంది. అది చాలా బాగుందని వర్ష అంటే.. అదే బర్త్ డే గిఫ్ట్ అని ఇమ్మాన్యుయేల్ సర్ ప్రైజ్ చేశాడు. ఇది నీ బర్త్ డే గిఫ్ట్ రా.. ఇప్పటికిప్పుడు హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకోవడం అందరి ముద్దు వద్దు. మిగతా ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం అని పంచ్ లు వేశాడు.

    సిగ్గు పడుతూ రొమాంటిక్ గా..

    ఇమ్మాన్యుయేల్ అలా అనేసరికి నవ్వుతూ, సిగ్గు పడుతూ రొమాంటిక్ గా ఇమ్మాన్యుయేల్ భుజంపై కొట్టింది. సో.. వచ్చే నెలలో రానున్న వర్ష పుట్టినరోజుకి ఇప్పుడే జ్యూయలరీ షో రూమ్ వ్లాగ్ లో భాగంగా గిఫ్ట్ కొనేశాడన్న మాట. ఇదిలా ఉంటే ఇటీవలే ఇమ్మాన్యుయేల్ కొత్త కారు కొన్నాడు. హ్యుండై వెన్యూ కారును ఇన్ స్టాల్ మెంట్ లో తీసుకుంటున్నట్లు ఇమ్మాన్యుయేల్ తెలిపాడు. ఈ కారు కొనేందుకు తన టీమ్ లీడర్ బుల్లెట్ భాస్కర్ సాయం చేశాడని, ఇల్లును షూరిటీగా పెట్టాడని ఇమ్ము తెలిపాడు.

    English summary
    Jabardasth Comedian Emmanuel Give Costly Gift To Varsha On Her Birthday Earlier A Month
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X