నడుము గిల్లినట్టు బిగ్‌బాస్‌కు కంటెస్టెంట్ ఫిర్యాదు.. రీతూ చౌదరీతో ఆ కంటెస్టెంట్..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో తొలివారం పూర్తి చేసుకొని రెండో వారంలోకి ప్రవేశించింది. ఫస్ట్ వీక్ ఇంటి నుంచి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిన తర్వాత ఇంటి సభ్యులు కంటెంట్‌పై దృష్టిపెట్టారు. సైలెంట్‌గా ఉంటే.. ఆడియెన్స్ ఓట్లు వేయడం లేదని గ్రహించిన కంటెస్టెంట్స్ కంటెంట్‌ను ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే హోస్ట్ నాగార్జున అక్కినేని సూచన మేరకు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తాజాగా చేసిన హల్‌చల్ ప్రోమో అందర్నీ ఆకట్టుకొంటున్నది. సోమవారం నాటి గేమ్‌లో ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు షోలో పార్టిసిపెంట్స్ రీతూ చౌదరీ, ఇమ్ము ఇద్దరు జబర్దస్త్ నుంచి ఫ్రెండ్స్. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు కలిసి చనువుగా మాట్లాడుకోవడం గత పది రోజుల్లో కనిపించింది. అయితే ఇటీవల పవన్‌తో రీతూ చౌదరీ క్లోజ్‌గా ఉంటూ కనిపిస్తున్నది. ఇద్దరు కలిసి చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. అయితే వారిని ఆట పట్టించేందుకు ఇమ్ము చిన్న స్కిట్ వేశాడు.

రీతూ చౌదరీ, పవన్ ఇద్దరు ఏకాంతంగా కూర్చొని ఉంటే.. ఇమ్ము వారిని చూస్తూ.. నేను రీతూను మిస్ అవుతున్నాను. ఈ మధ్య నాతో తిరగడం లేదు. నా పక్కన ఉన్నట్టు అనిపించడం లేదు. నా పక్కనే ఉన్నా.. దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నది. ఎందుకురా మా మధ్యలోకి వచ్చి.. మా జీవితాలతో, ఇద్దరి లైఫ్‌లతో ఆడుకుంటున్నావు. పాపిష్టి వాడా అంటూ పవన్‌ను ఉద్దేశించి అన్నాడు.
ఆ తర్వాత తన పక్క నుంచి వెళ్తున్న తనూజా గౌడను చూసి నా నడుము ఎందుకు గిల్లావు అనగానే.. ఆమె షాక్ అయింది. నేను నీ నడుము గిల్లానా? నేను అసలు టచ్ కూడా చేయలేదు అని తనూజా అంది. దాంతో బిగ్‌బాస్ నా నడుము గిల్లుతున్నది అంటూ కామెంట్ చేశాడు. దాంతో నేను ముట్టుకోలేదు అంటూ తనూజా వివరణ ఇచ్చింది. ముట్టుకోలేదా.. పెద్దగా నా నడుము గిల్లావు అంటే.. నీ నడుము ఎక్కడుంది అంటూ రీతూ ప్రశ్నించింది. దాంతో ఇది నడుము కాదా? అని తన శరీరాన్ని చూపించాడు.
ఇలా ఇంత పెద్ద షోలో నడుము గిల్లితే చూసే వాళ్లు ఏమనుకొంటారు అని ఇమ్ము వాపోయాడు. దాంతో ఫస్ట్ థింగ్ నీకు నడుము ఎక్కడుందో చూపించు అంటూ మళ్లీ రీతూ ప్రశ్నించింది. ఇదేంటి? ఇదంతా నడుము కాదా? అని ఇమ్ము మరోసారి నడుము చూపించాడు. దాంతో అది నడుమా? అంటే కాదా? ఉడుమా? అంటూ ఇమ్ము చమత్కరించాడు. దాంతో నీ నడుము ఎక్కడుందో చూపించు అంటూ దగ్గరికి వచ్చి నిజంగానే నడము గిల్లే ప్రయత్నం చేసింది. ఇలా సరదాగా తనూజ, ఇమ్ము సన్నివేశం చోటు చేసుకొన్నది.
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్‌లో రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ జోరుగా సాగుతున్నదనే విషయం సోషల్ మీడియాలో కనిపిస్తున్నది. ఇప్పటికే ఈ షోలో మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్, ప్రియా శెట్టి, ఫ్లోరా సైనీ, భరణి, పవన్ నామినేట్ అయినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











