సొంత అన్నకి అలా శత్రువునయ్యా... బిగ్‌బాస్ ఇమ్మాన్యుయేల్ కంటతడి

ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు ఇమ్యాన్యుయేల్. తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో అలరిస్తున్నాడు. జబర్దస్త్‌తో పాటు పలు ఛానెల్స్‌లో టాప్ షోలలో పాల్గొని నవ్వించాడు. ఈ ఫేమ్‌తో ఇమ్యాన్యుయేల్‌కు బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. బిగ్‌బాస్ హౌస్‌లో తన అల్లరి, మంచితనంతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఇమ్మాన్యుయేల్ ఫైనల్‌ వరకు వెళ్లాడు. కొద్దిలో బిగ్‌బాస్ టైటిల్ కోల్పోయినప్పటికీ.. ఆ సీజన్‌లో స్టార్ ఎంటర్‌టైనర్‌గా కింగ్ అక్కినేని నాగార్జున ప్రశంసలు పొందారు.

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఇమ్యాన్యుయేల్.. ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు. అయితే తన కుటుంబ మూలాలను, తన కుటుంబాన్ని ఎప్పుడూ మరిచిపోలేదు. వేదికలపై తాను ఎక్కడి నుంచి వచ్చింది చెబుతూనే ఉంటాడు. తాజాగా ఓ షోలో తన అన్నయ్య వంశీ గురించి చెబుతూ ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ అయ్యాడు. ఈ వివరాల్లోకి వెళితే..

Jabardasth Emmanuel Gets Emotional About Brother Vamsi in Adivaram with Star Maa Parivaaram Promo

శ్రీముఖి హోస్ట్‌గా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం తోబుట్టువుల స్పెషల్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, కావ్యశ్రీ, హరితేజ, ఇమ్మాన్యుయేల్, ప్రియాంక జైన్, ఆషికా గోపాల్ పదుకొణెలు తమ తోబుట్టువులతో ఈ షోకు హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోలను రెండు రోజుల నుంచి స్టార్ మా విడుదల చేస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో వీరంతా తమ తోబుట్టువుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

తొలుత కావ్యశ్రీ చెల్లెలు కేసరి చిన్ననాటి ఫోటోను ప్రదర్శించగా.. కావ్యను చాలా బాగుంది, చూస్తుంటే ముద్దుపెట్టాలనిపిస్తోందని ఇమ్మాన్యుయేల్ చెప్పడంతో అంతా నవ్వేశారు. నా చెల్లెలే నా ప్రపంచం, నా లవర్, నా లైఫ్ అని చెప్పింది. అనంతరం ఆషికా గోపాల్ తన తమ్ముడు అమోఘ్‌ను పట్టుకున్న ఫోటోను స్క్రీన్‌పై చూపించారు. ఇంట్లో ఒకరికి ఒకరం సేవ్ చేసుకుంటూ ఉండేవాళ్లమని ఆషికా చెప్పింది. తర్వాత ప్రియాంక జైన్, ఆమె తమ్ముడిని పిలిపించిన శ్రీముఖి.. వాళ్ల నాన్న ఎత్తుకున్న ఫోటోను చూపించింది. ఈమె నాకు తల్లి.. ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్ చేస్తుందని అక్క గురించి చెప్పాడు తమ్ముడు.

హరితేజ నన్ను అమ్మలా చూసుకుంటుందని ఆమె చెల్లెలు హరినిత్య చెప్పింది. ఇక ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ.. మా నాన్నగారికి, మా కుటుంబానికి మెయిన్ పిల్లర్ మా అన్నయ్య అని చెప్పి సోదరుడిని హత్తుకున్నాడు. ఇక చివరిలో ఇమ్మాన్యుయేల్ అందరినీ కంటతడి పెట్టించాడు. నేను ఎంత సంపాదించినా జీవితంలో ఏదో ఒక వెలితి ఉండేది. నా అన్న సక్సెస్ అవుతాడని నేను చాలా కలలు కన్నాను, దాని కోసం నేను వీడిని తిట్టేవాడిని. ఎంతలా అంటే ఒకటైంలో నన్ను శత్రువులా చూసి నాతో మాట్లాడటం కూడా మానేసేవాడు. నువ్వు అది చేయ్, ఇది చేయ్, నువ్వు అలా ఉండు, నువ్వు సంపాదించడం స్టార్ట్ చేయమని తొక్కడం స్టార్ట్ చేశా. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్న వాడి సినిమా చూసి ప్రశాంతంగా పడుకున్నానని అన్నయ్యని హత్తుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. బుల్లితెర సెలబ్రిటీలు తమ తోబుట్టువుల గురించి ఏం చెప్పారో తెలియాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చూసేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X