పాపం ఇమ్మాన్యుయేల్.. ఎలిమినేషన్ దారుణం అంటూ నెటిజన్ల సానుభూతి!
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ గ్రాండ్ ఫినాలే అనేక భావోద్వేగాల మధ్య ముగిసింది. ఇంటిలో 15 వారాలు తమ ప్రతిభతో ఆడియెన్స్ ప్రేమను, అభిమానాన్ని సంపాదించుకొన్న కంటెస్టెంట్లలో ఎవరు విజేతలుగా నిలుస్తారనే విషయం ఆసక్తిని రేపింది. ఫినాలే కార్యక్రమంలో తారల సందడి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియను ఉత్కంఠతో కొనసాగించారు. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో నెటిజన్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతున్నది. అందుకు గల కారణాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 9 ఫినాలేను హోస్ట్ నాగార్జున అక్కినేని తనదైన శైలిలో నడిపించారు. ఇంటిలోకి చాంఫియన్ సినిమా ప్రమోషన్స్ కోసం శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్, హీరోయిన్ అనశ్వర రాజన్ వచ్చారు. ఆ తర్వాత అనగనగా ఒకరాజు మూవీ కోసం నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ మీనాక్ష్ చౌదరీ, అలాగే భర్త మహశయులకు విజప్తి ప్రమోషన్స్ కోసం రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. వారి సినిమా ప్రమోట్ చేసుకొన్న తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.

ఇంటిలోకి వెళ్లిన నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ, రోబోతో కలిసి వెళ్లారు. వారితో సరదాగా చిన్న టాస్క్ ఆడిన తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఆ తర్వాత రోబో సహాయంతో ఇమ్యాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దాంతో ఈ సీజన్‌లో ఇమ్మాన్యుయెల్ జర్నీ ముగిసింది. అయితే ఇమ్ము ఎలిమినేషన్ అందర్నీ షాక్ గురి చేసింది. గత 15 వారాలుగా ఇంటికి పెద్ద దిక్కుగా మారడమే కాకుండా వినోదాన్ని పంచాడు. అంతేకాకుండా టాస్కులు ఆడతూ అందరికి సవాల్‌గా నిలిచాడు.
గత 15 వారాలుగా ఇంటిలో ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా.. లవ్ ట్రాక్, ఇతర చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా తన గేమ్‌తో లక్షలాది మంది హృదయాలను గెలుచుకొన్నాడు. అయితే అలాంటి ఇమ్మును టాప్‌లో 4వ కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ చేయడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో భగ్గుమంటున్నారు. స్క్రిప్టెడ్ ప్రకారమే ఇమ్మును అవుట్ చేశారు. ట్రోఫిని సాధించడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న వ్యక్తి ఇమ్ము. కనీసం రన్నరప్‌గా నైనా నిలిచే స్థాయి ఉన్న ఆటగాడు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
బిగ్‌బాస్ తెలుగు 9 ట్రోఫిని గెలువకపోయినా.. ప్రేక్షకుల హృదయాల్లో ప్రేమను, అభిమానాన్ని సంపాదించుకొన్నాడు. ఎంటర్‌టైనర్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతాడు. కమెడియన్ అయినంత మాత్రనా ట్రోఫికి అర్హుడు కాదా? అనే ప్రశ్నల్ని నెటిజన్లు సంధిస్తున్నారు. ఏది ఏమైనా ఇమ్ము పోరాడి ఓడిన విజేత. మీరు ఓడిోయింది ఓట్ల వల్ల కాదు. మీ కష్టాన్ని గుర్తంచలేని గుడడి లోకం వల్ల, మా గుండెల్లో మీ స్థానం ఎప్పటికీ నంబర్ 1 అని నెటిజన్లు సానుభూతితోపాటు ప్రశంసలు గుప్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











