MLA Kethireddy: వైసీపీ ఎమ్మెల్యేపై కమెడియన్ పంచ్‌లు.. చుట్టుముట్టి దాడి చేయడంతో.. ఫేమస్ షోలో కలకలం
ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్లను వెలుగులోకి తీసుకొచ్చి.. అందులో చాలా మంది స్టార్లుగా మారేలా చేసిన ఏకైక షో జబర్ధస్త్. ఈ షో ద్వారా ఇప్పటికే కొన్ని వందల మంది పాపులర్ అయ్యారు. అందులో టాలెంటెడ్ కమెడియన్ ఇమాన్యూయేల్ ఒకడు. అద్భుతమైన టైమింగ్‌తో పంచులు వేయగలిగే ఈ కుర్రాడు.. వర్షతో లవ్ ట్రాక్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు. అదే సమయంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఇమాన్యూయేల్ ఓ ఎమ్మెల్యేలా చేసి షాకిచ్చాడు. దీంతో వాళ్ల చేతిలో దెబ్బలు తిన్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే...

అలా వచ్చిన ఇమాన్యూయేల్
టాలెంటెడ్ ఆర్టిస్టు ఇమాన్యూయేల్ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన 'పటాస్' అనే షో ద్వారా బుల్లితెరపైకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ షోలో అద్భుతమైన టాలెంట్‌తో ఇరగదీసిన ఈ కుర్రాడు.. ఆ తర్వాత జబర్ధస్త్‌లోకి సైతం అడుగు పెట్టాడు. మొదట్లో సాదాసీదా ఆర్టిస్టుగా ఉన్నప్పటికీ.. క్రమంగా తన కామెడీతో మెప్పించాడు. ఫలితంగా సెకెండ్ లీడ్‌గా ఫేమస్ అయ్యాడు.

జబర్ధస్త్ ఎంట్రీతో మరింతగా
జబర్ధస్త్‌లోకి వచ్చిన తర్వాత ఇమాన్యూయేల్ రోజు రోజుకూ ఎంతో పరిణితితో పంచులు పేలుస్తూ ఫేమస్ అయిపోయాడు. ఇందులో తనదైన పంచులు, ప్రాసలతో ఆకట్టుకుంటోన్నాడు. అన్నింటికీ మించి వరుస ఆఫర్లు దక్కించుకోవడంతో పలు షోలలో భాగం అవుతున్నాడు. స్పెషల్ ఈవెంట్లలో సైతం అతడికి ప్రత్యేకమైన రోల్స్ ఇస్తుండడంతో సెలెబ్రిటీగా ఎదిగిపోయాడు.

వర్షతో లవ్.. కిస్సులు, హగ్స్
లేడీ కంటెస్టెంట్‌గా జబర్ధస్త్‌లో సత్తా చాటుతోన్న వర్షతో టాలెంటెడ్ కమెడియన్ ఇమాన్యూయేల్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. కొంత కాలంగా వీళ్లిద్దరూ కలిసి రొమాంటిక్ యాక్టులు చేస్తుండడమే. అంతేకాదు, తరచూ ముద్దులు, హగ్గులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ కారణంగానే ఈ జంట విపరీతమైన స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

ఈ మధ్య కాలంలో హైలైట్
గతంలో మాదిరిగా ఇప్పుడు జబర్ధస్త్ షోలో ఫేమస్ టీమ్ లీడర్లు లేరు. ఇప్పటికే ఎంతో మంది పాపులర్ ఆర్టిస్టులు ఈ షోకు దూరం అయ్యారు. దీంతో ఇమాన్యూయేల్ బాగా హైలైట్ అవుతోన్నాడు. అతడు భాస్కర్ టీమ్‌లో మెంబర్ అయినప్పటికీ.. చాలా మందితో కలిసి స్కిట్లు చేస్తున్నాడు. ఇలా షో మొత్తంలో తనదైన కామెడీ పండిస్తూ హైలైట్ అవడంతో పాటు క్రేజ్ పెంచుకుంటోన్నాడు.

వైసీపీ ఎమ్మెల్యేలా మారాడు
వచ్చే శుక్రవారం ప్రసారం కాబోతున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో అందరు టీమ్ లీడర్లు సినిమా స్ఫూఫ్‌లతో ప్రయోగాలు చేసినట్లు చూపించారు. దీంతో ఈ ఎపిసోడ్ మొత్తం సందడి సందడిగా సాగిపోయింది. ముఖ్యంగా ఇందులో జబర్ధస్త్ ఇమాన్యూయేల్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేలా చేశాడు.
అచ్చం ఆయనలాగే డైలాగ్
రాయలసీమకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తన నియోజకవర్గంలో పర్యటిస్తోన్న సమయంలో ఓ స్కూల్ పిల్లాడితో మాట్లాడిన వీడియో యమ పాపులర్ అయిన విషయం తెలిసిందే. అచ్చం ఆయన మాట్లాడినట్లుగానే జబర్ధస్త్ షోలో ఇమాన్యూయేల్ మాట్లాడాడు. అంతేకాదు, కమెడియన్ బాబును స్టూడెంట్‌లా చూపిస్తూ కర్రతో నాలుగు దెబ్బలు కూడా వేశాడు.

పిచ్చ కొట్టుడు కొట్టడంతో
ఈ స్కిట్ చివర్లో ఇమాన్యూయేల్‌ను ఆర్టిస్టులు అందరూ రౌండప్ చేసి మరీ పిచ్చ కొట్టుడు కొట్టారు. దీంతో అతడు పరుగులు తీస్తూ జడ్జ్‌లు వెనకాల దాక్కున్నాడు. మొత్తానికి ఈ స్కిట్ మొత్తం నవ్వులు పూయించింది. ఇక, ఇమాన్యూయేల్.. కేతిరెడ్డిని అనుకరించడంపై ఆయన అభిమానులు కోపంగా ఉన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రోమో కింద కామెంట్స్ చేస్తోన్నారు.


Click it and Unblock the Notifications











