Jabardasth Emmanuel: తొలిసారి ప్రియురాలిని స్టేజీపైకి తీసుకొచ్చిన ఇమ్మానుయేల్.. వర్ష ఎదురుగానే ప్రపోజ్!

తెలుగు బుల్లితెరపై ఎప్పుడూ నవ్వులు పూయించే జబర్దస్త్ షో గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అద్బుతమైన స్కిట్లు చేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించడంలో ముందుటారీ షో నిర్వాహకులు. ముఖ్యంగా ఇందులోని కమెడియన్లకు ఉన్న క్రేజ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా పాపులర్ అయిన వాళ్లు చాలా ఎక్కువే. అలాంటి వాళ్లలోనే ఒకడు ఇమ్మానుయేల్.

వర్షతో లవ్ ట్రాక్ చేస్తూ అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీగా మారిన ఆయన తాజాగా ప్రేమ కావాలి షోలోకి తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకు వచ్చి పరిచయం చేశాడు. ముఖ్యంగా తాను ఆ అమ్మాయిని ఎంతో కాలంగా ఇష్టపడుతున్నానని అందరి ముందు చెప్పగా.. ఆమె కూడా క్యూట్ గా నవ్వేసింది. ముఖ్యంగా చివరల్లో ఓ లవ్ ప్రపోజల్ చేసింది. ఈ షోకు ఆ డైలాగ్ యే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం

Jabardasth Emmanuel Introduce His Girl Friend Check Details

జబర్దస్త్ షో ద్వారా లవ్ ట్రాక్ చేసి విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్లు.. వర్ష, ఇమ్మానుయేల్ గురించి అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ బాగా పండగా.. వీరి జంటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో వాళ్లు కూడా ఈ ట్రాక్ ను కొనసాగిస్తూ షోలు చేస్తున్నారు. అయితే ఇటీవలే వీరిద్దరూ యాంకర్లుగా మారి ప్రేమ కావాలి అనే షో చేస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో గెస్టులను తీసుకు వస్తూ తెగ సందడి చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ ఎపిసోడ్ కు లంబసింగి సినిమా చిత్రబృందం వచ్చింది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ గా చేసిన బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్యాతో పాటు హీరో భరత్ రాజ్ కూడా వచ్చాడు. అయితే ఈ క్రమంలోనే ఓ అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిందీ జంట. ఆ తర్వాత వీరిద్దరూ మాట్లాడుతుండగా.. ఇమ్మానుయేల్ వచ్చి దివిని చూసి తెగ సిగ్గుపడిపోతూ.. ఈమే నా క్రష్ అంటూ చెప్పుకొచ్చాడు.

Jabardasth Emmanuel Introduce His Girl Friend Check Details

చాలా కాలంగా తాను బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్య్తాను ఇష్టపడుతున్నానని వివరించాడు ఇమ్మానుయేల్. అయితే ఇదంతా విన్న దివికి మాత్రం ఏం చేయాలో అర్థం కాక అతడిని సరదాగా చేత్తో కొట్టింది. ఆ తర్వాత తెగ సిగ్గుపడిపోతూ.. మెళికలు తిరిగిపోతూ మురిసిపోయింది. ఇక ఆ తర్వాత ప్రమించడంలో అమ్మాయిలు గొప్పా అబ్బాయిలు గొప్పా అనగా.. వీరిద్దరూ కలిసి చక్కగా ప్రేమించుకుంటూ, ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ ఇద్దరూ ఎదడగం గొప్ప అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అంతా ఫిదా అయిపోయారు.

ఇక ఆ తర్వాత దివి వాద్య్తా ప్రేమ గురించి ఓ సూపర్ డైలాగ్ కొట్టింది. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నేను నీతో కలిసి బతకాలి అనుకుంటున్నా.. పెళ్లి చేసుకుందాం.. నువ్వెలా ఉన్నా పర్లేదు నేను చూస్కుంటా నిన్ను ఐ నీడ్ నథింగ్ ఫ్రమ్ యూ.. ఐ లవ్ యూ... నీక్కూడా ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం దా అంటూ చెప్పింది. అయితే ఈ డైలాగ్ సినిమాలోదా.. లేక ఇమ్మానుయేల్ కే చెప్పిందా తెలియాలంటే మాత్రం పూర్తి ఎపిసోడ్ రావాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X