స్కిట్‌లోని ఆర్టిస్ట్‌ను లవ్ చేస్తున్నాడట.. జబర్దస్త్ ఇమాన్యుయల్ గుట్టు బయటపడింది

జబర్దస్త్ వేదిక నుంచి ఎంతో మంది పాపులర్ అయ్యారు. బుల్లితెర నుంచి వెండితెరకు ఎదిగిన వారెంతో మంది ఉన్నారు. తాజాగా ఈ మధ్య ఓ అందం జబర్దస్త్ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొన్ని కోట్లాది మంది వీక్షించే జబర్దస్త్ స్టేజ్ మీద ఓ అందం అంతలా అట్రాక్ట్ చేస్తుంటే ఆమె పాపులార్టీ ఏ రేంజ్‌లో పెరిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోన్న అందం పేరు వర్ష. సీరియల్స్‌లో నటిస్తున్న ఈ సుందరి ఇప్పుడు ఫుల్ ఫేమస్.

బాగానే పాపులర్..

బాగానే పాపులర్..

జబర్దస్త్ షోలో లేడీ కంటెస్టెంట్ల గెటప్ వేసే ఆర్టిస్ట్‌లు బాగానే ఫేమస్ అయ్యారు. అయితే కొంతకాలానికి లేడీ గెటప్‌లకంటే ఫీమేల్ ఆర్టిస్ట్‌లైతే బాగుంటుందని కొందరిని తీసుకొచ్చారు. హైపర్ ఆది అయితే స్కిట్ స్కిట్‌కూ మార్చేసేవాడు. చమ్మక్ చంద్ర మాత్రం సత్య అనే ఒకే అమ్మాయిని పైకి తీసుకొచ్చాడు.

హైపర్ ఆది స్కిట్‌లో..

హైపర్ ఆది స్కిట్‌లో..

ఆ మధ్య హైపర్ ఆది స్కిట్‌లో వర్ష అనే అమ్మాయి కనిపించింది. అప్పుడు బాగానే క్లిక్ అయింది. ఆ తరువాత వరుసగా స్కిట్స్‌లో అలా మెరుస్తూవస్తోంది. మరీ ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ పక్కన జోడిగా చేస్తుంటుంది. వెంకీ మంకీ టీంలో చేసే ఈ వర్ష ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. స్కిట్స్‌లో భాగంగా వర్షతో ఇమ్మాన్యుయేల్ కలిపే పులిహోర బాగానే ఫేమస్ అయింది.

తాజాగా అలా..

తాజాగా అలా..

తాజాగా ఈ ఇద్దరూ సాయి కుమార్ హోస్ట్‌గా వస్తోన్న వావ్ 3 షోలో గెస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఈ ఇద్దరూ కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ షోలో అసలు సంగతులన్నీ బయటకు వచ్చేశాయి. ఆ ఇద్దరి మధ్య ఉన్న కథ ఏంటిదన్నది తెలిసిపోయింది.

ప్రేమిస్తున్నాడట..

ప్రేమిస్తున్నాడట..

వర్ష జబర్దస్త్ గురించి చెబుతూ అది నాకు వావ్ మూమెంట్ అని తెలిపింది. తన గురించి ఏమీ చెప్పడం లేదంటూ ఇమ్మాన్యుయేల్ వర్షపై కౌంటర్ వేశాడు. ప్రేమిస్తున్నాను అని చెబుతున్నాడు సర్ అంటూ ఇమ్మాన్యుయేల్ గురించి సాయి కుమార్‌తో వర్ష చెప్పుకొచ్చింది.

ఇంట్లో వాళ్లకి..

ఇంట్లో వాళ్లకి..

మరో సందర్భంలో ఇమ్మాన్యుయేల్ వర్ష టైటానిక్ పోజులో రచ్చ చేశారు. మీ ఇంట్లో ఏమీ అనరా అని వర్షను సాయి కుమార్ అడిగితే.. ఏం కాదు సర్ మా ఆంటికి నా గురించి తెలుసు అని ఇమ్మాన్యుయేల్ కౌంటర్ వేశాడు. మరీ మీ ఇంట్లో ఏమీ అనరా అని ఇమ్మాన్యుయేల్‌ను ప్రశ్నించాడు సాయి కుమార్. అమ్మ ఈ పిల్లను తెచ్చేస్తున్నా అని మరో పంచ్ వేశాడు ఇమ్మాన్యుయేల్. మొత్తానికి అతనికి వర్షపై ప్రేమ ఉందని బయటపెట్టేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X