For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పంచ్ ప్రసాద్ రెండో పెళ్లి: జబర్ధస్త్ కమెడియన్ పోస్ట్.. కిడ్నీ ఇస్తానన్న భార్యను కాదని మరీ!

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ షోలు మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుని సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో జబర్ధస్త్ ఒకటి. సుదీర్ఘ కాలంగా విజయవంతంగా సాగిపోతోన్న ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అందులో పంచ్ ప్రసాద్ ఒకడు. తనదైన టాలెంట్‌తో చాలా కాలంగా సత్తా చాటుతోన్న అతడు.. అనారోగ్యంతోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్నాడు. ఈ నేపథ్యంలో ప్రసాద్ పెళ్లి గురించి ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే...

  అలా వచ్చాడు.. టీమ్ లీడర్‌గా

  అలా వచ్చాడు.. టీమ్ లీడర్‌గా

  బ్యాగ్రౌండ్ లేకపోయిన జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో పంచ్ ప్రసాద్ ఒకడు. కెరీర్ ఆరంభంలో వెంకీ మంకీస్ టీమ్‌లో సభ్యుడిగా పని చేసిన అతడు.. ఎన్నో స్కిట్లను ఒంటి చేత్తో లేపాడు. దీంతో అతడి టాలెంట్ గుర్తించిన నిర్వహకులు.. పొట్టి నరేష్‌తో కలిపి టీమ్ లీడర్‌ను చేశారు. ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్.. నాటీ నరేష్ అనే పేరుతో చాలా కాలం టీమ్ లీడర్‌గా కొనసాగాడు.

  యాంకర్ శ్యామల అందాల విందు: అలాంటి డ్రెస్‌తో రెచ్చగొడుతోందిగా!

  ప్రసాద్‌కు ప్రాణాంతక వ్యాధి

  ప్రసాద్‌కు ప్రాణాంతక వ్యాధి

  పంచ్ ప్రసాద్ ప్రాణాంతకమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అందుకే చాలా కాలం షోకు దూరంగా ఉన్నాడు. అతడి వ్యాధి గురించి తెలిసిన రోజా, నాగబాబు సహా ఇతర ఆర్టిస్టులు కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు. కానీ, అవి సర్జరీ మాత్రం చేయించుకునేందుకు సరిపోలేదు. దీంతో తరచూ డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు.

  ప్రసాద్ రీఎంట్రీ.. ఫుల్ ఫామ్

  ప్రసాద్ రీఎంట్రీ.. ఫుల్ ఫామ్


  సుదీర్ఘ గ్యాప్ తర్వాత కొన్నేళ్ల క్రితమే పంచ్ ప్రసాద్ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పుడు 'జాతి రత్నాలు', 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'జబర్ధస్త్' షోలు చేస్తున్నాడు. అలాగే, స్పెషల్ ఈవెంట్లలోనూ భాగం అవుతున్నాడు. దీంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతోన్నారు.

  సమంతకు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? షాకిస్తోన్న లేటెస్ట్ ఫొటోలు

  ఆరోగ్యంపై ప్రసాద్ పంచ్‌లు

  ఆరోగ్యంపై ప్రసాద్ పంచ్‌లు


  రీఎంట్రీలో పంచ్ ప్రసాద్ రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే తన కిడ్నీ సమస్య గురించి తరచూ హైలైట్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆరోగ్యంపై తనకు తానే పంచులు వేసుకుంటున్నాడు. అలాగే, వేరే వాళ్లు కూడా అతడి సమస్యపై సెటైర్లు వేస్తున్నారు. అయినప్పటికీ అతడు స్పోర్టివ్‌గానే తీసుకుంటూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నాడు.

  పంచ్ ప్రసాద్‌కు రెండో పెళ్లి

  పంచ్ ప్రసాద్‌కు రెండో పెళ్లి

  కడుపుబ్బా నవ్వించే కమెడియన్ల జీవితాలు అన్నీ అనుకున్నట్లుగా సజావుగా సాగవన్న విషయం తెలిసిందే. చాలా మంది కన్నీటి గాథలను దిగమింగుతూ ప్రేక్షకులను నవ్విస్తుంటారు. అలాగే పంచ్ ప్రసాద్ కూడా ఈ మధ్య కాలంలో తన ఆరోగ్య సమస్యను పక్కన పెట్టేసి మజాను పంచుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త హైలైట్ అవుతోంది.

  కోహ్లీ భార్య అనుష్క హాట్ షో: పండుగ పూట ఎద అందాలు కనిపించేలా!

  ఇమాన్యూయేల్ పోస్టు వల్లే

  ఇమాన్యూయేల్ పోస్టు వల్లే

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జబర్ధస్త్ మరో కమెడియన్ ఇమాన్యూయేల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచ్ ప్రసాద్ పెళ్లి గురించి ఓ స్టోరీ పెట్టుకున్నాడు. అందులో పంచ్ ప్రసాద్‌కు రెండో పెళ్లి అనే ఓ వీడియో థంబ్‌నైల్ ఉంది. అంతేకాదు, దాని మీద ప్రసాద్‌తో పాటు ఓ లేడీ ఉన్నారు. కానీ, ఆ ముఖాన్ని బ్లర్ చేయడంతో అందరూ నిజమే అనుకుంటున్నారు.

  భార్యను కాదని.. వీడియోలో

  భార్యను కాదని.. వీడియోలో

  ఇమాన్యూయేల్ చేసిన పోస్టు వల్ల పంచ్ ప్రసాద్‌.. కిడ్నీ ఇవ్వడానికి రెడీ అయిన భార్యను కాదని రెండో పెళ్లి చేసుకుంటున్నాడా అని అశ్చర్యపోతున్నారు. కానీ, అసలు మేటర్ ఏంటంటే.. ఇటీవలే ప్రసాద్‌కు, అతడి భార్యకు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో మళ్లీ పెళ్లి చేశారు. దీనికి ముందు ఇంట్లో జరిగిన డిస్కర్షన్‌కు సంబంధించిన వీడియోను ప్రసాద్ అప్‌లోడ్ చేశాడు. దీనికోసం అతడు ఆ హెడ్డింగ్ పెట్టి ఒక్క క్షణం అందరినీ అయోమయానికి గురి చేశాడు. మొత్తానికి ఈ న్యూస్ మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Telugu Actor and Comedian Jabardasth Emmanuel Very Active In Social Media. Recently He Posted a Pic about Punch Prasad Second Marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X