ఇమ్మాన్యుయేల్ మాటలతో వర్ష హార్ట్‌ బ్రేక్... కన్నీటితో షో నుంచి వాకౌట్

Photo Courtesy: ETV Telugu India

బుల్లితెరపై కొన్ని జంటలకు లవ్ ట్రాక్ పెట్టి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి ఆయా ఛానెల్స్. ఇలాంటి వాటిలో ఇమ్మాన్యుయేల్ - వర్ష జోడి కూడా ఒకటి. జబర్దస్త్‌లో స్టార్ట్ అయిన వీరి లవ్ ట్రాక్ సక్సెస్ అయ్యింది. ఇది బుల్లితెర వరకే పరిమితమైనా వర్షంతో ఇమ్యాన్యుయేల్ పెళ్లి ఎప్పుడు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతుంటారు. అయితే ఓ షోలో ఇమ్యాన్యుయేల్ అన్న మాటలకు వర్ష కన్నీటి పర్యంతమై, స్టేజ్ మీది నుంచి దిగేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

కొద్దినెలల క్రితం ఈటీవీలో హోలీ ఈవెంట్ పేరిట ఓ కార్యక్రమం జరిగింది. హైపర్ ఆది- ఆటో రాంప్రసాద్‌లు హోస్ట్‌గా ప్రసారమైన ఈ షోలో పలువురు బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలను వేరు వేరుగా ఉంచి వారితో గేమ్స్ ఆడించారు. ఇప్పటి వరకు లేడీసే లీడ్‌లో ఉన్నారని రాంప్రసాద్‌తో ఆది అంటాడు. అంత సీన్ లేదని ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. మేం చాలా కష్టపడ్డామని వర్ష అంటుంది. వాళ్లు ఏదో ఏడుస్తారని ఇవ్వడం తప్పించి.. సాంగ్ అప్పుడు మేమే బాగా చేశామని చెబుతాడు ఇమ్మాన్యుయేల్. అన్నీ నువ్వే చేస్తే మేం ఎందుకొచ్చామని రోహిణి పంచ్ వేస్తుంది.

Jabardasth Emmanuel s Comments Make Varsha Emotional Old Video Goes Viral

Photo Courtesy: ETV Telugu India

మేం గెలిచామని శివజ్యోతి అనగా... మీ ముఖం అంటూ కౌంటర్ వేస్తాడు ఇమ్మాన్యుయేల్. అక్కడ మీ వర్ష కూడా ఉంది కొంచెం చూసుకోమని అది నచ్చచెబుతాడు. వర్షం ఏం చేసింది, వర్ష ఇక్కడ ఉండాలి.. అది అబ్బాయిలాగే ఉంటుందని ఇమ్మాన్యుయేల్ అనడంతో వర్ష ఎమోషనల్ అయ్యింది. మా ఆవిడ కూడా అబ్బాయా? లేడీ గెటప్పా అని వర్ష గురించి అడిగిందని బుల్లెట్ భాస్కర్ అనడంతో వర్ష తట్టుకోలేక స్టేజ్ మీద నుంచి దిగి వచ్చేసింది. మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకుని మాట్లాడు.. అందరి ముందు కాదని కన్నీటి పర్యంతమైంది. ఇమ్యాన్యుయేల్ ఏదో సరదాగా అన్నాడని ఆది, రాంప్రసాద్ ఎంత నచ్చచెబుతున్నా వర్ష పట్టించుకోలేదు.

చనువు ఇచ్చేశాం కదా అని ఇన్ని అనకూడదు.. లీడ్ ఇవ్వడానికైతే ఇంకా చాలా ఉన్నాయి. మగాడి ముఖం ఇలాంటి మాటలు అంటారా అని వర్ష బాధపడింది. అది చూసిన రాంప్రసాద్ సారీ చెప్పమని అడగ్గా.. ఆవిడ కూడా నన్ను ఎన్నోసార్లు కర్రోడా అనింది, నేను ఫీల్ అయ్యానా అని ఇమ్మాన్యుయేల్ చెప్పాడు. ఒకసారి రెండు సార్లు అంతే.. ప్రతిసారి ఎవరూ పడరు. నీకు నాకు జోడీ పెట్టారు.. చేస్తున్నాం బాగానే ఉంది, కానీ అది దాటి చేయొద్దు. కొంచెం అర్ధం చేసుకోవాలి, ఇష్టమొచ్చినట్లు వర్ష కన్నీటి పర్యంతం అవ్వగా... ఇమ్యాన్యుయేల్‌ను తీసుకెళ్లి సారీ చెప్పించారు ఆది, రాంప్రసాద్. మనసులో ఒకటి పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావని వర్ష అనగా.. లీడ్ కోసమే అలా అన్నానని ఇమ్మాన్యుయేల్ చెప్పాడు.

అన్నిసార్లు సరదాగా తీసుకోవాలి, కొన్నిసార్లు సీరియస్ అవ్వొచ్చు మనమేం చేయలేం. అయినా నువ్వు సారీ చెప్పావు కదా అని ఆది అంటాడు. ఓ మంచి సాంగ్‌కి ఇమ్మాన్యుయేల్, వర్షలు డ్యాన్స్ చేసి వాతావరణాన్ని కూల్ చేశారు. వాళ్లిద్దరికీ నేనే కాంప్రమైజ్ చేశానని రాంప్రసాద్ అనడంతో .. అయితే యాంకరింగ్ నువ్వే చేసుకోమని ఆది కోపంతో వెళ్లిపోతాడు. దాంతో రాంప్రసాద్ వెళ్లి కాళ్లు పట్టుకోవాలా అని అడుగుతాడు. ఆ వెంటనే రోహిణి వచ్చి ఇలా ఎంతమందిని ఓదార్చాలి, నేను వెళ్లిపోతున్నానని అంటుంది. దానికి నువ్వు ఉండొద్దు.. వెళ్లిపోవాలి అంటూ రోహిణికి పంచ్ వేస్తాడు ఆది. దాంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more about: jabardasth emmanuel varsha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X