వర్షను చితకబాదిన ఇమ్మాన్యుయేల్.. అలా పిలవడంతో జబర్దస్త్ నటుడు సీరియస్!
తెలుగు టెలివిజన్ ఆడియన్స్ ఎంతగానో అలరిస్తున్న కామెడీ షో 'జబర్దస్త్'. ఈ షోలో స్కిట్స్ చేసి ప్రేక్షకులను అలరించడమే కాకుండా తమకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు ఆర్టిస్టులు. ఇప్పటికే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, రష్మి గౌతమ్, అనసూయ లాంటివారు ఎంత పాపులర్ అయ్యారో తెలిసింది. పదేళ్ల కింద స్టార్ట్ అయిన ఈ కామెడీ షో ఇంకా ఆసక్తికరంగానే కొనసాగుతోంది. రోజా, నాగబాబు, మను వంటి ప్రముఖులు ఈ షోకు జడ్జిగా వ్యవహరించి సక్సెస్ బాటలో నడిపించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ పాపులర్ కామెడీ షోకు టాలీవుడ్ సీనియర్ నటి ఇంద్రజ, కృష్ణ భగవాన్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తమదైన శైలిలో కామెడీ స్కిట్లను నడిపిస్తూ ఆసక్తికరంగా తీర్పులు ఇస్తూ మరింత రసవత్తరంగా నడిపిస్తున్నారు. షో నుంచి చాలామంది తప్పుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం హైపర్ ఆది, వెంకీ మంకీస్, రాకెట్ రాఘవ, చలాకీ చంటి, ఇమ్మానుయేల్, బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ టీం లీడర్లుగా ఇంట్రెస్టింగ్ స్కిట్లను ప్రదర్శిస్తున్నారు. కాగా ప్రతి వారం ఈ షో రెండు రోజులు ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతుంది. రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. మరోవైపు యూట్యూబ్ లోనూ పూర్తి ఎపిసోడ్ రానుంది. మార్చి 14, 15న ప్రసారం కానుంది.

ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన జబర్దస్త్ ప్రోమో షోపై కాస్త ఆసక్తిని పెంచింది. నటీనటులంతా తమ తమ స్కిట్లతో ఆలోచించే ప్రయత్నం చేశారు. పంచులు ప్రాసలు రాబోయే ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే టీం లీడర్ ఇమ్మానుయేల్ కాస్త వైరల్ గా మారింది. స్కిట్స్ సందర్భంగా ఇమాన్యుయెల్ ను అన్న అని పిలవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆ వార్తలను ఇద్దరూ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు.
అయితే లేటెస్ట్ స్కిట్ లో మాత్రం ఇమ్మానుయేల్ ను జబర్దస్త్ వర్ష అన్నా అని పిలవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన చేతిలో ఉన్న రాడ్ ను తీసుకొని వర్షపై దాడి చేశాడు. స్కిట్ చేయాల్సిన సందర్భంలో ఇలా పర్సనల్ వెళ్లడం వాళ్ళిద్దరి మధ్యల సంథింగ్ సంథింగ్ మరోసారి దారితీస్తుంది. కానీ అదంతా స్కిట్ కోసమేనని అర్థమవుతుంది. అలాగైతే ఇమాన్యుల్ ను వర్ష ఏం వరుసతో పిలిచినా సమస్య ఏంటని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా ఇమ్మానుయేల్ తన స్కిట్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సరికొత్తగా అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన టీమ్ లోనే వర్ష కూడా తనదైన రీతిలో పంచులు పేలుస్తూ, కామెడీ పంచుతుంది. అంతేకాకుండా వర్ష సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తుంటుంది. తన గురించిన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకోవడంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయదు. మరోవైపు స్టైలిష్ వేర్స్ లో అదిరిపోయేలా ఫోటోషూట్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట పంచుకుంటూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటుంది.


Click it and Unblock the Notifications











