హీరోయిన్ పూర్ణతో ఇమ్మాన్యుయేల్ అసభ్య ప్రవర్తన.. దెబ్బకు సొమ్మసిల్లి పడిన రష్మి?
జబర్దస్త్, ఢీ షోల తర్వాత అంత పేరు తెచ్చుకున్న షో మరేదైనా ఉంది అంటే అది ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పక తప్పదు. ముందు నుంచి కూడా ఈ షోను హిట్ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తోంది మల్లెమాల సంస్థ. తొలుత చాలామంది యాంకర్లు మారారు తర్వాత సుధీర్ యాంకర్ గా షో మంచి రేటింగ్ సాధిస్తోంది అనుకుంటున్న క్రమంలో సుధీర్ తప్పుకోవడంతో ఇప్పుడు రష్మి ఆ ప్లేస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇంద్రజ ఉండాల్సిన స్థానంలో ఇప్పుడు పూర్ణ కనిపిస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో వీడియో విడుదల కాగా కమెడియన్ ఇమ్మానియేల్ పూర్ణను అసభ్యకరంగా తాకినట్టు కనిపిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే

పరిచయం చేస్తూ
మల్లెమాల సంస్థ నుంచి వచ్చిన జబర్దస్త్, ఢీ షోల తర్వాత అదే స్థాయిలో క్రేజ్ సంపాదించింది శ్రీదేవి డ్రామా కంపెనీ షో. పేరుకి కొత్త ప్రోగ్రాం అయినా సరే దాదాపు ఈ ప్రోగ్రాంలో కనిపించే వారంతా జబర్దస్త్ ఆర్టిస్టులు అని చెప్పక తప్పదు. సుధీర్ యాంకర్ గా ఇంద్రజ మెంటర్ గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రతి ఆదివారం ఒక్కో కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సెలబ్రిటీలను, మట్టిలో మాణిక్యాలను పరిచయం చేస్తూ షో మంచి పేరు తెచ్చుకుంది.

జబర్దస్త్ లాగానే
అడపాదడపా ఇతర భాషలకు సంబంధించిన కళాకారులను కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ మంచి మన్ననలు అందుకుంటోంది. వాళ్ళు ఎవరు దొరకరు అనుకుంటున్న సమయంలో జబర్దస్త్ లాగానే కొన్ని స్కిట్ లు వేసి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే ఈ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న సుధీర్ ఇప్పుడు స్టార్ మ లో ప్రసారం అవుతున్న ఒక సింగింగ్ షోకు యాంకర్ గా వెళ్లారు.

హగ్గులు ఇవ్వలేక
మళ్లీ తిరిగి ఈ షోకు యాంకర్గా వస్తారో రారో తెలియదు కానీ ఇప్పుడు సుధీర్ స్థానంలో రష్మి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక తాజా ప్రోమో ఆసక్తికరంగా మారింది. ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా హీరోయిన్ పూర్ణ ఎంట్రీ ఇచ్చారు. పూర్ణ ఎంట్రీ ఇవ్వగా హైపర్ ఆది ఒక హగ్గు కావాలని అడగడంతో ఈ హగ్గులు ఇవ్వలేక ఢీ నుంచి బయటకు వచ్చా అని ఆమె సెటైర్ వేస్తుంది.

పూర్ణ భుజం మీద
అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్ వేసే మగ వాళ్ళు vs లేడీస్ అనే కాన్సెప్ట్ తో సందడి చేయించారు. ఇక ఈ క్రమంలో లేడీస్ ఎంట్రీ ఇచ్చాక లేడీ గెటప్స్ రావడం లేదని, ఇలా లేడీ గెటప్స్ వేయడంతో సమాజంలో కూడా చులకనగా చూస్తున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రోమో చివర్లో ఉండగా ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ ఉండగా.. ఇమ్మానియేల్ హీరోయిన్ పూర్ణ భుజం మీద తాకాడు. అయితే ఆయన ఎందుకు తాకాడో తెలియదు కానీ పూర్ణ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రోమో కోసమే
గతంలో ఇలాంటి విషయాలను పూర్ణ సరదాగా తీసుకున్నప్పటికీ ఈ కార్యక్రమంలో మాత్రం ఇమ్మాన్యుయేల్ పై ఒక్కసారిగా ఫైర్ అవడం చర్చనీయాంశం అయింది. అయితే వీరిద్దరూ గొడవ పడుతున్న సమయంలో అక్కడే నిలబడి ఉన్న రష్మీ ఒక్కసారిగా సొమ్మసిల్లి కిందపడి పోతుండగా ఆటో రాంప్రసాద్ ఆమెను కింద పడకుండా పట్టుకుంటాడు. అయితే నిజంగానే ఇలా జరిగి ఉంటే దాన్ని ఇక్కడిదాకా రానిచ్చేవారు కాదు, ఇదంతా ప్రోమో కోసమే ప్లాన్ చేసి ఉండవచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications











