Baby మూవీ ఎఫెక్ట్: ప్రియుడికి ఫైమా బ్రేకప్.. అతడితో పెళ్లికి సిద్ధమైన లేడీ కమెడియన్

గతంలో కంటే ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపై అమ్మాయిలు ఎక్కువగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే కమెడియన్లుగా రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో జబర్ధస్త్ ఫేం ఫైమా ఒకరు. అద్భుతమైన టాలెంట్లతో అదరగొడుతోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. అలాగే, ప్రవీణ్‌తో ప్రేమను కూడా నడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడికి ఫైమా బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

అలా వచ్చి జబర్ధస్త్‌గానే:ఫైమా 'పటాస్' అనే షో ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ చిన్నది జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టింది. అందులో తనదైన కామెడీతో అలరించిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతోన్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో షోలు, ఈవెంట్లలో భాగమైంది. తద్వారా కెరీర్‌ను జబర్ధస్త్‌గా మార్చేసింది.

Jabardasth Faima and Praveen Love Breakup Video Goes Viral

బిగ్ బాస్ ఛాన్స్... అన్నీ:బిగ్ బాస్ ఆరో సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపించారు. అందులో జబర్ధస్త్ ఫైమా లేడీ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలోనే యమ ఫోకస్ అయింది. ఆటకు ఆటతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తూ విశేషమైన పేరు ప్రఖ్యాతలను కూడా అందుకుని సత్తా చాటింది. ఇలా ఫినాలే ముందు వరకూ వచ్చి 13వ వారంలో ఎలిమినేట్ అయింది.

ఆ షోలో గెలిచిన ఫైమా:బిగ్ బాస్ ఆరో సీజన్‌లో యమ సందడి చేసిన ఫైమాకు గతంలో కంటే క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా అదే రీతిలో వస్తున్నాయి. ఇలా ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం స్టార్ మాలో ప్రసారం అయిన 'బీబీ డ్యాన్స్' షోలో పాల్గొంది. ఇందులో సూర్యతో కలిసి జట్టుగా వచ్చిన ఫైమా.. అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ఫలితంగా వీళ్లిద్దరూ ఏకంగా టైటిల్‌ను గెలిచారు.

Jabardasth Faima and Praveen Love Breakup Video Goes Viral

ఎన్నో షోలలో భాగమై:బిగ్ బాస్ షో పుణ్యమా అని ఫైమా స్టార్ మాలో సెటిల్ అయిపోయింది. ఇలా ఇప్పుడు ఈ కమెడియన్ 'స్టార్ మా పరివారం' షోలో చేస్తోంది. దీనితో పాటు ఎన్నో స్పెషల్ ఈవెంట్లలో కూడా పాల్గొంటోంది. ఇవి మాత్రమే కాదు.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ.. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తోంది. తద్వారా తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తోంది.

Jabardasth Faima and Praveen Love Breakup Video Goes Viral

ప్రవీణ్‌తో ప్రేమాయణం:జబర్ధస్త్ ఫైమా ప్రొఫెషనల్ లైఫ్ మాదిరిగానే పర్సనల్ లైఫ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఆమె 'పటాస్' షోలో పాల్గొన్నప్పటి నుంచే ప్రవీణ్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అలాగే, జంటగా యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేస్తూ తెగ హడావిడి చేసేస్తున్నారు.

Jabardasth Faima and Praveen Love Breakup Video Goes Viral

బేబి సినిమాతో బ్రేకప్:సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఫైమా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ఇందులో 'బేబి సినిమా చూసిన తర్వాత ఫైమా, ప్రవీణ్ బ్రేకప్' అని ఉంది. దీంతో అందరూ షాక్ అయ్యారు. అయితే, వీళ్లిద్దరూ కలిసి 'బేబి' మూవీ స్ఫూఫ్ వీడియో చేశారు. దానికి సంబంధించిన ప్రమోషన్‌లో భాగంగానే ఫైమా ఈ పోస్ట్ చేసినట్లు ఆ తర్వాత అర్థం అయింది.

Jabardasth Faima and Praveen Love Breakup Video Goes Viral

అతడితో పెళ్లికి రెడీగా:ఫైమా, ప్రవీణ్ కలిసి 'బేబి' స్ఫూఫ్ వీడియోను చేయడం వరకూ బాగానే ఉంది. కానీ, ఆమె వేరే వ్యక్తితో పెళ్లికి రెడీ అయినట్లు కూడా ఇందులో ఓ పోస్టర్ వేశారు. అందులో ఉన్న వ్యక్తి ముఖాన్ని కావాలనే ఫొటోషాప్ ద్వారా ఎడిట్ చేసి పెట్టారు. దీంతో దీన్ని హైలైట్ చేస్తూ ఫైమా అతడిని పెళ్లి చేసుకోబోతుంది అని కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X