Bigg Boss Telugu 6 నుంచి జబర్దస్త్ కంటెస్టెంట్ అవుట్.. వెటకారమే కొంప ముంచిందా?

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సీజన్ ఇప్పటికే 89 రోజులు 90 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇంకొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇగ గత ఎపిసోడ్స్ లలో నేరుగా ఫినాలేకు వెళ్లేందుకు అవకాశంగా టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చారు. ఈ పోటీలో చివరిగా రేవంత్, శ్రీహాన్ నిలిచారు. అయితే ఫినాలేకు వెళ్లిన మొదటి కంటెస్టెంట్ శ్రీహాన్ అని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే వీకెండ్స్ లో ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చూస్తుండగానే వీకెండ్ రానే వచ్చింది. ఈసారి సింగిల్ ఎలిమినేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 13వ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారనే వివరాల్లోకి వెళితే..

 తెలుగులో 2017లో ప్రారంభం..

తెలుగులో 2017లో ప్రారంభం..

బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో తొలుత హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి సైతం తీసుకొచ్చారు. ఇక తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమై భారీగా ప్రేక్షకాదరణ పొందింది. వరుస సీజన్లతో దూసుకుపోతూ ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది.

 కంటెస్టెంట్లుగా 21 మంది..

కంటెస్టెంట్లుగా 21 మంది..

ఇప్పటికే ఐదు టీవీ, ఒక నాన్ స్టాప్ (ఓటీటీ) సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో సెప్టెంబర్ 4న 6వ సీజన్ ను ప్రారంభించారు. ఈ 6 సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావు, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు.

హౌజ్ లో ప్రస్తుతం 8 మంది..

హౌజ్ లో ప్రస్తుతం 8 మంది..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 12 వారాలకు 13 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్ ఇలా 13 మంది వెళ్లిపోయారు. దీంతో హౌజ్ లో 8 మంది మాత్రమే మిగిలారు.

 నామినేషన్లలో ఆరుగురు..

నామినేషన్లలో ఆరుగురు..

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ప్రస్తుతం మిగిలిన 8 మందికి 13వవారం నామినేషన్స్ ప్రక్రియ మరింత వాడీ వేడిగా సాగింది. ఈ వారం నామినేషన్లలో కెప్టెన్ అయినా కారణంగా ఇనయా సుల్తానా, ఎవరు నామినేట్ చేయనందున శ్రీహాన్ సేఫ్ అయ్యాడు. దీంతో మిగతా ఇంటి సభ్యులు అయినా రోహిత్, రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి భట్ ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరంత ప్రస్తుతం నామినేషన్ లో ఉన్నారు.

 చివరి స్థానంలో ఉండి..

చివరి స్థానంలో ఉండి..

అయితే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 13వ వారం మొత్తంలో పోలయిన ఓట్ల ప్రకారం సింగర్ రేవంత్ మొదటి స్థానంలోనే ఉన్నాడు. అతడి తర్వాత వరుసగా రెండో స్థానంలో ఆది రెడ్డి, మూడో స్థానంలో రోహిత్ సాహ్నీ, నాలుగో స్థానంలో కీర్తి భట్, ఐదో స్థానంలో శ్రీ సత్య, ఆరో స్థానంలో ఫైమాలు ఉన్నారని బిగ్ బాస్ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఇలా చివరి స్థానంలో ఉన్న జబర్ధస్త్ కమెడియన్ ఫైమా తాజాగా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

 ఫైమాకు బదులు రాజ్ ఎలిమినేట్..

ఫైమాకు బదులు రాజ్ ఎలిమినేట్..

అయితే జబర్ధస్త్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫైమా షేక్ గత వారమే ఎలిమినేట్ కావాల్సింది. గతవారం కూడా ఆమె తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉంది. కానీ ఆమె దగ్గర ఉన్న ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఉపయోగించి సేవ్ అయింది ఫైమా. ఇక ఆమెకు బదులు ఆమె తర్వాత స్థానంలో ఉన్న మోడల్ రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ 13వ వారం ఫైమా హౌజ్ ను వీడనుందని సమాచారం. తన కామెడీతో ప్రేక్షకులను, ఇంటి సభ్యులను అలరించింది ఫైమా.

ఇంటి సభ్యులపై వెటకారం..

ఇంటి సభ్యులపై వెటకారం..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో మొదటగా తనదైన కామెడీ, గేమ్స్ లో పోటీ ఇవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించింది జబర్ధస్త్ కమెడియన్ ఫైమా. చూడటానికి సన్నగా ఉన్న ఫిజికల్ టాస్కుల్లో సైతం మిగతా వారికి గట్టి పోటీ ఇచ్చి మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అనిపించుకుంది. ఆమె ఆటతీరును హోస్ట్ నాగార్జున ఎన్నోసార్లు ప్రశంసించారు. అయితే నామినేషన్స్ సమయంలో బాలాదిత్య, మెరీనాలతో వెటకారంగా మాట్లడటం ఆమెకు మైనస్ అయింది. తర్వాత గేమ్ పై ఫోకస్ పెట్టడంతో కామెడీ కూడా తగ్గింది. ఈవారం కూడా ఫిజికల్ టాస్క్ లు చేసిన అంతగా రాణించలేకపోయింది. దీంతో ఫైమాను ప్రేక్షకులు ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X