Bigg Boss 6: జబర్ధస్త్‌కు కోలుకోలేని షాక్.. బిగ్ బాస్‌లోకి టాప్ లేడీ కమెడియన్.. హౌస్‌లో రచ్చ రచ్చే

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మన్ననలు అందుకుని సక్సెస్‌ఫుల్ షోలుగా మారుతుంటాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులో ప్రారంభం అయిన ఈ షో.. చాలా తక్కువ సమయంలోనే విజయవంతం అయింది.

దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తోన్నారు. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల్లోనే ఆరో సీజన్‌ను కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు లీక్ అవుతున్నాయి. ఇక, తాజాగా మరో జబర్ధస్త్ సెలెబ్రిటీ పేరు బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

ఆరో సీజన్‌ అప్పటి నుంచే

ఆరో సీజన్‌ అప్పటి నుంచే

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా తెలుగులోకి వచ్చిన షోనే బిగ్ బాస్. ఇప్పటికే ఇది ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దానిని కూడా సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. దీనిని కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి.

అంచనాలు అన్నీ రెట్టింపు

అంచనాలు అన్నీ రెట్టింపు

సాధారణంగా తెలుగులో బిగ్ బాస్ ప్రారంభం అవుతుందంటే ఎంతటి హడావిడి ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే మరో రెండు రోజుల్లోనే మొదలు కాబోతున్న ఆరో సీజన్ గురించి దాదాపు మూడు నెలల నుంచే ఎన్నో రకాల వార్తలు రావడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే దీని నుంచి విడుదలైన ప్రోమోలు వాటిని రెట్టింపు చేశాయని చెప్పొచ్చు.

ప్రీమియర్‌కు భారీ ఏర్పాట్లు

ప్రీమియర్‌కు భారీ ఏర్పాట్లు

ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌ కోసం నిర్వహకులు ఎప్పటి నుంచో పనులను ప్రారంభించారు. అందుకు అనుగుణంగానే అన్నింటినీ త్వరగానే పూర్తి చేసుకున్నారు. ఇక, ఈ సీజన్‌ ప్రీమియర్ ఎపిసోడ్‌ను సెప్టెంబర్ 4వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం చేయనున్నారు. నిర్వహకులు దీని కోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.

 21 మంది కంటెస్టెంట్లు రెడీ

21 మంది కంటెస్టెంట్లు రెడీ

అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. తర్వాత నేరుగా మాట్లాడి వాళ్లతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా ఆరో సీజన్ కోసం ఏకంగా 21 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

క్వారంటైన్‌లో కంటెస్టెంట్లు

క్వారంటైన్‌లో కంటెస్టెంట్లు

బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సమయం ఆసన్నం కావడంతో కంటెస్టెంట్లను క్వారంటైన్లలో ఉంచారు. ఇందుకోసం నిర్వహకులు దాదాపు హైదరాబాద్ నగరంలోని మూడు హోటళ్లను వాళ్ల కోసం బుక్ చేశారని తెలిసింది. అలాగే, వాళ్ల మొబైళ్లను కూడా తీసుకున్నారు. ఇక, వాళ్లను శనివారం బిగ్ బాస్ సెట్‌కు తీసుకొచ్చి.. అదే రోజు సాయంత్రం హౌస్‌లోకి పంపబోతున్నారని తెలుస్తోంది.

 బిగ్ బాస్‌లోకి జబర్ధస్త్ లేడీ

బిగ్ బాస్‌లోకి జబర్ధస్త్ లేడీ

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ ఇదేనంటూ ఓ జాబితా బయటకు వచ్చింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లోకి జబర్ధస్త్‌ టాలెంటెడ్ లేడీ కమెడియన్ ఫైమా ఎంట్రీ ఇస్తున్నట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది.

భారీ ఆఫర్‌కు ఫ్లాటైన భామ

భారీ ఆఫర్‌కు ఫ్లాటైన భామ

'పటాస్' అనే షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఫైమా.. ఆ తర్వాత జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతోన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీమ్ ఫైమాకు భారీ ఆఫర్ ఇచ్చి మరీ హౌస్‌లోకి తీసుకు వస్తుందని తెలిసింది. దీంతో ఇప్పుడీ న్యూస్ బుల్లితెర వర్గాల్లో హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X