నల్లగా పుట్టడం నా తప్పా ? బాడీ షేమింగ్ కామెంట్స్ పై బజర్థస్త్ నటి ఆవేదన

బుల్లితెరపై తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి జబర్థస్త్ ఫైమా(Jabardasth Faima). ఒకప్పుడు స్టాండప్ షోలో కేవలం గెస్ట్‌గా వచ్చిన ఆమె, తన టైమింగ్‌తో ఆకట్టుకుని అదే ఛానెల్‌లో అవకాశాన్ని దక్కించుకుంది. 'పటాస్'లో చిన్న అవకాశం అందుకున్న ఫైమా, తర్వాత అదే షోలో రెగ్యులర్ కమెడియన్‌గా మారి తన సత్తా చాటింది. అక్కడితో ఆగకుండా, తన కామెడీ స్టైల్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆమె, జబర్థస్త్ వేదికపై మరింత పాపులర్ అయ్యింది.

Also Read
అందరి ముందు చీర విప్పి, అలా పడుకోమన్నాడు.. స్టార్ దర్శకుడుపై తెలుగు నటి షాకింగ్ కామెంట్స్
అందరి ముందు చీర విప్పి, అలా పడుకోమన్నాడు.. స్టార్ దర్శకుడుపై తెలుగు నటి షాకింగ్ కామెంట్స్

తన పంచ్ డైలాగ్స్, ఎనర్జీతో ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ను ఏర్పరుచుకుంది. మధ్యలో బిగ్ బాస్ తెలుగు లో కంటెస్టెంట్‌గా పాల్గొని, తన ఆటతీరుతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇలా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఫైమా, తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏం జరిగింది?

Jabardasth Faima Gets Emotional Opens Up on Struggles and body shaming Trolls
Recommended For You
Sudigali Sudheer: ఆమెతో 14 ఏళ్ల రిలేషన్.. ఆ విషయం తట్టుకోలేక నడిరోడ్డుపై అలా..
Sudigali Sudheer: ఆమెతో 14 ఏళ్ల రిలేషన్.. ఆ విషయం తట్టుకోలేక నడిరోడ్డుపై అలా..

ఇటీవల నటి ఫైమా ప్రముఖ టాక్ షో కిస్సిక్ టాక్స్ లో పాల్గొన్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన అనుభవాలను బయటపెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన అవమానాలు, పేదరికం, అలాగే ఒక ఆడపిల్లగా ఎదుర్కొన్న కష్టాల గురించి భావోద్వేగంగా మాట్లాడింది. తాను ప్రస్తుతం ఉన్న స్థాయికి చేరుకోవడానికి ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. "ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంత గుర్తింపు వచ్చింది. కానీ కొందరు 'ఏముంది దీనిలో? నల్లగా ఉంది, గలీజ్‌గా ఉంది' అంటూ ట్రోలింగ్ చేశారు. ఆ కామెంట్స్ నన్ను చాలా బాధపెట్టాయి" అని ఆమె చెప్పింది. తనపై వచ్చిన విమర్శలు కేవలం తనకే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా బాధ కలిగించాయని పేర్కొంది.

You May Also Like
ఆ హీరో లేకపోతే నేను లేను.. నా అదృష్టం అతడే అంటున్న మృణాల్ !
ఆ హీరో లేకపోతే నేను లేను.. నా అదృష్టం అతడే అంటున్న మృణాల్ !

ఆ బాధలో ఒకరోజు తన తల్లికి ఫోన్ చేసి, "ఎందుకమ్మా నన్ను ఇంత నల్లగా కన్నావు? నల్లగా పుట్టడం నా తప్పా?" అని అడిగానని ఫైమా తెలిపింది. ఆ మాటలు విన్న తన తల్లి తీవ్రంగా ఏడ్చిందని ఎమోషనల్ అయ్యారు. ఈ సంఘటన తన జీవితంలో మరచిపోలేని క్షణమని చెప్పింది. ఇక తన చిన్ననాటి పరిస్థితులను కూడా ఫైమా గుర్తుచేసుకుంది. 'మాది చాలా నిరుపేద కుటుంబం. తినడానికి సరైన ఆహారం కూడా ఉండేది కాదు. వేసుకోవడానికి కొత్త బట్టలు కూడా ఉండేవి కాదు. పక్కింటి వాళ్లు కొత్త డ్రెస్‌లు వేసుకుంటే చూసి ఏడ్చేదాన్ని' అని తెలిపింది.

 “నా పని అయిపోయింది”.. వారణాసి పై పృథ్వీ ఎమోషనల్ కామెంట్స్ !
“నా పని అయిపోయింది”.. వారణాసి పై పృథ్వీ ఎమోషనల్ కామెంట్స్ !

తాము నలుగురు అక్కాచెల్లెళ్లలో చిన్నదైన తనకు, పెద్ద వాళ్లు వేసిన బట్టలే తిరిగి ఇచ్చేవారని చెప్పింది. కొత్త డ్రెస్ కుట్టించాల్సి వచ్చినప్పుడు, అందరి బట్టల ముక్కలను కలిపి ఒక డ్రెస్ తయారు చేసేవారని చెప్పి నవ్వుకుంది. ఇక సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఫైమా తీవ్రంగా స్పందించింది. చిన్న పిల్లలపై జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడుతూ.. 'అలాంటి పనులు చేసే వాళ్లకు కఠిన శిక్షలు ఉండాలి. వాళ్లకు కూడా అదే బాధ అనుభవం కావాలి' అని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక ఆడపిల్లగా జీవించడం ఎంత కష్టమో తన అనుభవాలతో వివరించింది.

Raaka Movie: మెంటలెక్కిస్తున్న అల్లు అర్జున్ న్యూ లుక్.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..
Raaka Movie: మెంటలెక్కిస్తున్న అల్లు అర్జున్ న్యూ లుక్.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..

"ఆడపిల్లగా పుట్టినందుకు నేను చాలా సార్లు బాధపడ్డాను. మనం అనుకున్నంత ఈజీ కాదు. చాలా కష్టాలు ఉంటాయి. అందుకే వచ్చే జన్మలో అయినా మగాడిగా పుట్టాలని అనుకుంటున్నాను" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాటల్లో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X