పెళ్లిపై నోరు విప్పిన జబర్ధస్త్ ఫైమా.. అప్పుడే చేసుకుంటానంటూ షాకిచ్చిందిగా!
తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎంతో మంది లోకల్ అమ్మాయిలు తెగ హైలైట్ అవుతున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం ఫైమా ఒకరు.
చాలా కాలం క్రితమే ఈ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె.. తనదైన టాలెంట్‌తో మెప్పించింది. తద్వారా ఎన్నో షోలలో అవకాశాలను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జబర్ధస్త్ ఫైమా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. అదేంటో మీరే చూసేయండి మరి!

బుల్లితెరపై సంచలనం
చిన్న వయసులోనే ఫైమా 'పటాస్' అనే షో ద్వారా టెలివిజన్ రంగంలోకి ఎంటరైంది. ఆ తర్వాత ఈ చిన్నది జబర్ధస్త్‌లోకి సైతం అడుగు పెట్టింది. అందులో తనదైన కామెడీతో అలరించిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే సెలెబ్రిటీగా ఎదిగింది. దీంతో ఆమెకు ఆఫర్లు భారీగా వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో షోలు, ఈవెంట్లలో భాగమై సంచలనంగా మారిపోయింది.

బిగ్ బాస్‌తో క్రేజ్ ఫుల్లు
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి జబర్ధస్త్ ఫైమా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలోనే ఫాలోయింగ్ ఉండడంతో ఈ లేడీ కమెడియన్ ఆరంభంలోనే యమ హైలైట్ అయింది. ఆటకు ఆటతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తూ విశేషమైన పేరు ప్రఖ్యాతలను కూడా అందుకుంది. ఇలా ఫినాలే ముందే ఎలిమినేట్ అయినా ఆమెకు క్రేజ్ ఫుల్లుగా లభించింది.
ఆ షోలో గెలిచిన పిల్ల
ఫైమాకు బిగ్ బాస్ ఆరో సీజన్ తర్వాత మరింత నేమ్, ఫేమ్ పెరిగిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా అదే రీతిలో లభించాయి. ఇలా ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం స్టార్ మాలో ప్రసారం అయిన 'బీబీ డ్యాన్స్' షోలో పాల్గొంది. ఇందులో సూర్యతో కలిసి విజేతగా నిలిచింది. దీని తర్వాత చాలా రోజుల పాటు స్టార్ మాలో ప్రసారం అయిన ఈవెంట్లలో భాగమై సత్తా చాటింది.

రీఎంట్రీలో ఫుల్ బిజీ
బిగ్ బాస్ షో తర్వాత 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో చేసింది. దీనితో పాటు ఎన్నో స్పెషల్ ఈవెంట్లలో కూడా భాగం అవుతోంది. అయితే, ఇటీవలే ఫైమా తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అందులో బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో సభ్యురాలిగా హల్చల్ చేస్తోంది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలు కూడా లభిస్తూనే ఉన్నాయి.
అతడికి బ్రేకప్ కొత్తగా
జబర్ధస్త్ ఫైమా కెరీర్ పరంగా ఎంత పేరు తెచ్చుకుందో.. పర్సనల్ లైఫ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె 'పటాస్' షోలో పాల్గొన్నప్పటి నుంచే ప్రవీణ్‌తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. కానీ, అతడికి ఆమె బ్రేకప్ చెప్పేసింది. అంతేకాదు, ఇప్పుడు ఈ అమ్మడు ప్రవీణ్ నాయక్ అనే కుర్రాడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఇటీవలే ఈ విషయాన్ని రివీల్ చేసేసింది.

పెళ్లిపై క్రేజీగా కామెంట్
సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే ఫైమా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ లైవ్ చాట్ నిర్వహించింది. అందులో ఓ నెటిజన్ 'అక్కా మీ పెళ్లి ఎప్పుడు' అని సూటిగా ప్రశ్నించారు. దీనికి ఫైమా 'పెళ్లి జరిగినప్పుడే' అంటూ డిఫరెంట్‌గా ఆన్సర్ ఇచ్చింది. కానీ, అసలు ఎప్పుడు చేసుకుంటాను అనేది మాత్రం స్పష్టం చేయలేదు. దీనిపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











