ఫైమా అందంపై కుర్రాడి కామెంట్.. ఓపెన్ చేసి చూస్తే కళ్లు పగిలిపోతాయి అంటూ!
కొంత కాలంగా తెలుగు బుల్లితెరపై లోకల్ అమ్మాయిలు ఎక్కువగా సందడి చేస్తూ అలరిస్తున్నారు. అయితే, వారిలో అతి తక్కువ మంది మాత్రమే బిగ్ సెలెబ్రిటీలుగా హవాను చూపిస్తున్నారు. అందులో లేడీ కమెడియన్, జబర్ధస్త్ ఫేం ఫైమా ఒకరు. ఆరంభం నుంచే అద్భుతమైన టాలెంట్లతో అదరగొడుతోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తోంది. ఇక, తాజాగా ఫైమాకు ఓ నెటిజన్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. దీనికామె దిమ్మతిరిగే కౌంటర్ కూడా ఇచ్చింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
జబర్ధస్త్‌గానే ఫైమా కెరీర్
'పటాస్' అనే షో ద్వారా ఫైమా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ చిన్నది జబర్ధస్త్‌లోకి సైతం అడుగు పెట్టింది. అందులో తనదైన కామెడీతో అలరించిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే సెలెబ్రిటీగా ఎదిగిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు పోటెత్తుతోన్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో షోలు, ఈవెంట్లలో భాగమైంది. తద్వారా కెరీర్‌ను జబర్ధస్త్‌గా సాగిస్తోంది.

బిగ్ బాస్ ఎంట్రీతో క్రేజ్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి జబర్ధస్త్ ఫైమా కూడా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఫేమ్‌కు తగ్గట్లుగానే ఈ లేడీ కమెడియన్ ఆరంభంలోనే యమ ఫోకస్ అయింది. ఆటకు ఆటతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తూ విశేషమైన పేరు ప్రఖ్యాతలను కూడా అందుకుని సత్తా చాటింది. ఇలా ఫినాలే ముందు వరకూ వచ్చి ఎలిమినేట్ అయినా క్రేజ్ మాత్రం పెరిగిపోయింది.
ఆ షోలో విజేతగా ఫైమా
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో తనదైన రీతిలో సందడి చేసిన ఫైమాకు గతంలో కంటే ఫాలోయింగ్ వచ్చింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా అదే రీతిలో వస్తున్నాయి. ఇలా ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం స్టార్ మాలో ప్రసారం అయిన 'బీబీ డ్యాన్స్' షోలో పాల్గొంది. ఇందులో సూర్యతో కలిసి జట్టుగా వచ్చిన ఫైమా.. అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ఫలితంగా వీళ్లిద్దరూ ఏకంగా టైటిల్ కొట్టేశారు.

ఎన్నో షోలు.. రీఎంట్రీ
బిగ్ బాస్ షో తర్వాత ఫైమా స్టార్ మాలో సెటిల్ అయిపోయింది. ఇలా కొంత కాలం పాటు 'స్టార్ మా పరివారం' షోలో చేసింది. అలాగే, కొన్ని ఈవెంట్లలోనూ భాగం అయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఈ చిన్నది జబర్ధస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చేసింది. ఇందులో బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో తనదైన రీతిలో కామెడీని పంచుతోంది. తద్వారా పాత ఫైమాను అందరికీ చూపిస్తోంది.
సోషల్ మీడియాలో షాక్
కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ జబర్ధస్త్ ఫైమా సోషల్ మీడియాలోనూ ఫుల్లుగా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్ చాట్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ఆస్క్ మీ (ASK ME) సెషన్‌లో ఓ కుర్రాడు 'మీరు అస్సలు బాగుండరు' అంటూ ఫైమాకు కోలుకోలేని షాక్ ఇచ్చేశాడు.

మీరు అంత బాగున్నారు
సదరు నెటిజన్ కామెంట్‌పై ఫైమా 'ఈ మెసేజ్ చూసిన తర్వాత అయ్యో.. నిజమా.. నేను బాగుండనా అనుకున్నాను. ఆ తర్వాత మెసేజ్ పెట్టిన అతను ఎలా ఉంటాడా అని చూద్దాం అని మీ అకౌంట్ ఓపెన్ చేశా. మీరు చాలా బాగున్నారు. మీరు పెట్టిన ఫిల్టర్ ఏదైతే ఉందో అది అద్భుతం. నిజంగా అద్భుతం. ఇంక మాటల్లో చెప్పలేను. ఎందుకంటే అంత బాగున్నారు' అని చెప్పింది.
కళ్లు పగిలిపోయాయని
అదే వీడియోలో ఫైమా 'మిమ్మల్ని చూడగానే నా కళ్లు మొత్తం పగిలిపోయాయి. అంత బాగున్నారు. సో.. మీరు బాగున్నప్పుడు నన్ను అనడంలో తప్పేమీ లేదు. బాగున్న వాళ్లందరూ బాలేని వాళ్లను అంటారు కదా. కాబట్టి మీ కామెంట్‌ను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ, ఇంకోసారి ఫొటో పెట్టేటప్పుడు ఫిల్టర్ పెట్టకండి. ఎందుకంటే మీ అందం పాడైపోతుంది ఓకేనా' అని కౌంటర్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











