కొత్త లవర్‌ను పరిచయం చేసిన ఫైమా: కుర్రాడు భలే హ్యాండ్సమ్‌గా ఉన్నాడే.. ఇంతకీ ఎవరీ నాయక్?

గతంలో కంటే ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఎంతో మంది టాలెంట్ ఉన్న అమ్మాయిలు సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను పెంచుకుని ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫైమా ఒకరు. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో లవ్ ట్రాకులతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఫైమా తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. ఆ వివరాలను మీరు కూడా చూసేయండి మరి!

బుల్లితెరపై సెన్సేషన్‌గా:టీనేజ్‌లో ఉన్నప్పుడే ఫైమా 'పటాస్' అనే షో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ చిన్నది జబర్ధస్త్‌లోకి సైతం అడుగు పెట్టింది. అందులో తనదైన కామెడీతో అలరించిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే సెలెబ్రిటీగా ఎదిగింది. దీంతో ఆమెకు ఆఫర్లు భారీగా వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో షోలు, ఈవెంట్లలో భాగమైంది. తద్వారా ఫైమా సెన్సేషన్ అయింది.

Jabardasth Faima Introduce Her Boyfriend and Shares Photos

బిగ్ బాస్‌తో ఫుల్లు క్రేజ్:జబర్ధస్త్ ఫైమా బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫేమ్‌కు తగ్గట్లుగానే ఈ లేడీ కమెడియన్ ఆరంభంలోనే యమ హైలైట్ అయింది. ఆటకు ఆటతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తూ విశేషమైన పేరు ప్రఖ్యాతలను కూడా అందుకుని సత్తా చాటింది. ఇలా ఫినాలే ముందు వరకూ వచ్చి ఎలిమినేట్ అయినా ఆమెకు ఫుల్లు క్రేజ్ వచ్చింది.

అందులో గెలిచి.. అలా:బిగ్ బాస్ ఆరో సీజన్‌ తర్వాత ఫైమాకు గతంలో కంటే ఫాలోయింగ్ యమా పెరిగిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా అదే రీతిలో వస్తున్నాయి. ఇలా ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం స్టార్ మాలో ప్రసారం అయిన 'బీబీ డ్యాన్స్' షోలో పాల్గొంది. ఇందులో సూర్యతో కలిసి విజేతగా నిలిచింది. దీని తర్వాత చాలా రోజుల పాటు స్టార్ మాలో ప్రసారం అయిన ఈవెంట్లలో భాగం అయింది.

Jabardasth Faima Introduce Her Boyfriend and Shares Photos

రీఎంట్రీ ఇచ్చేసి సత్తా:బిగ్ బాస్ షో తర్వాత ఉండే కాంట్రాక్ట్ కారణంగా ఫైమా స్టార్ మాలోనే చాలా కాలం చేయాల్సి వచ్చింది. ఇలా 'స్టార్ మా పరివారం' షోలో చేసింది. దీనితో పాటు ఎన్నో స్పెషల్ ఈవెంట్లలో కూడా భాగం అవుతోంది. అయితే, ఇటీవలే ఫైమా తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అందులో బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో సభ్యురాలిగా హల్చల్ చేస్తోంది.

ప్రవీణ్‌తో బ్రేకప్ అని:జబర్ధస్త్ ఫైమా కెరీర్ పరంగా ఎంత సక్సెస్ చేసుకుందో.. పర్సనల్ లైఫ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ సాగుతోంది. ఆమె 'పటాస్' షోలో పాల్గొన్నప్పటి నుంచే ప్రవీణ్‌తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. కానీ, అతడికి ఆమె బ్రేకప్ చెప్పేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫైమానే స్వయంగా ప్రవీణ్‌ను ఎప్పుడూ ప్రేమించలేదని చెప్పుకొచ్చేసింది.

కొత్త లవర్‌తో ఫొటోలు:జబర్ధస్త్ ఫైమా ప్రవీణ్‌తో ప్రేమాయణం సాగిస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఆమె ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తాజాగా ఈ లేడీ కమెడియన్ పుట్టినరోజు సందర్భంగా ఓ యువకుడు ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. అందులో ఐదేళ్లుగా ఫైమాతో రిలేషన్‌లో ఉన్నట్లు, భవిష్యత్‌లోనూ ఆమెతో లైఫ్‌ను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

ఎవరీ నాయక్ అంటూ:తాజా పోస్టు ద్వారా అతడు జబర్ధస్త్ ఫైమా కొత్త బాయ్‌ఫ్రెండ్ అన్న విషయం అర్థం అయిపోయింది. కానీ, ఈ పోస్టులో షేర్ చేసిన ఫొటోల్లో అతడి ముఖం కనిపించడలేదు. దీంతో అతడి గురించి అందరూ ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. అయితే, అతడి పేరు ప్రవీణ్ నాయక్ అని మాత్రమే తెలిసింది. మరి రాబోయే రోజుల్లో ఫైమా అతడి గురించి చెప్తుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X