Jabardasth టెలివిజన్ రేటింగ్‌ల కోసం అదంతా ఫేక్.. ఆ స్టంట్స్‌ను నమ్మొద్దు.. జబర్దస్త్ ఫైమా
పటాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఫైమా.. తన కామెడీ, టైమింగ్, చలాకీతనంతో తెలుగువారికి బాగా దగ్గరైంది. ఆ వెంటనే జబర్దస్త్ షోలోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులరైంది. ఆమె విసిరే పంచ్‌లకు నవ్వుల పువ్వులు గ్యారెంటీ. మేల్ కమెడియన్లదే రాజ్యమైన జబర్దస్త్‌లో ఫిమేల్ కమెడియన్లకు స్టార్ స్టేటస్ తెచ్చినవారిలో ఫైమా ఒకరు. బుల్లితెరతో పాటు ఎన్నో షోలు, ఈవెంట్లలలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్లింది ఫైమా. ఈ పాపులారిటీతోనే బిగ్‌బాస్ ఆరో సీజన్‌లోనూ పాల్గొనే ఛాన్స్ దక్కించుకుని గ్రాండ్ ఫినాలేకు ముందు వరకు వచ్చి 13వ వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా వుంటూ యూట్యూబర్‌నూ తన రేంజ్‌ను మరింత పెంచుకుంటూ వెళ్తోంది ఫైమా.
బుల్లి తెరపై సందడి చేసే నటీనటులపై రూమర్స్ రావడం కామన్. అలాగే ఫైమా ప్రేమ, పెళ్లి అంటూ బోల్డెన్నీ గాసిప్ప్ మీడియాలో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. పటాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచే తన కో స్టార్ ప్రవీణ్‌తో ఫైమా కాస్త క్లోజ్‌గా వుంటుంది. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు తోడుగా వుండటం, కెరీర్ ప్లానింగ్, శుభకార్యాలు ఇలా వుండేది వారిద్దరి జీవితం. అలా వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ఇలా ఎక్కడ చూసినా వీరి ప్రేమ ముచ్చట్లే వినిపించేవి, కనిపించేవి. అయితే బిగ్‌బాస్, ఇతర షోల కారణంగా ఫైమా క్రేజ్ మరింత పెరగ్గా.. తర్వాత ప్రవీణ్‌తో కలిసి కనిపించడం మానేసింది.

ఇక పుకారు రాయుళ్లు రెచ్చిపోయారు. ఏం లేకపోతేనే హాట్ హాట్ వార్తలను , గాసిప్స్‌ను వండివార్చే ఈ జనాలు ఫైమా-ప్రవీణ్‌లను వదిలిపెడతారా. ఎలా పడితే .. అలా గాసిప్స్‌ను వదిలారు. తామిద్దరం మంచి స్నేహితులమని ఫైమా ఎన్నోసార్లు చెప్పినా వదిలిపెట్టలేదు. ఈ నేపథ్యంలో ఓ తెలుగు వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైమా తన పెళ్లి, ప్రవీణ్‌తో రిలేషన్ తదితర ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తన ఇంట్లోనూ పెళ్లి టాపిక్ నడుస్తోందని.. కానీ దేనికైనా టైం రావాలని ఫైమా చెప్పారు. మరి పెళ్లి కొడుకు ఎవరని .. యాంకర్ అడిగితే, చాలా తెలివిగా ''అబ్బాయ్ '' అని ఆన్సర్ ఇచ్చింది ఫైమా. జనవరిలో ఓ షోలో చేసిన పెళ్లిచూపులు స్కిట్‌పైనా ఆమె స్పందించారు. టీవీల్లో చూపించేది నమ్మొద్దని , రేటింగ్ కోసం ఓ జోడీని క్రియేట్ చేసి వదులుతారని.. అదంతా ఓ స్టంట్.. టెలివిజన్‌లో కనిపించే ఏ జోడీ నిజం కాదని ఫైమా క్లారిటీ ఇచ్చారు. ప్రవీణ్‌తో తనకు షోలలో పరిచయం వుందని.. అది జనాలకు బాగా కనెక్ట్ అవ్వడంతో మా బంధంపై వాళ్లు కూడా ఎమోషనల్ అవుతున్నారని ఆమె చెప్పింది.
గతంలో ప్రేమ గురించి చెబుతూ చేసిన ఇంటర్వ్యూ నిజమా .. కాదా అన్న ప్రశ్నకు .. అది యాక్టింగ్ కాదని, నిజం అవ్వొచ్చు, కాకపోవచ్చు మన చేతుల్లో ఏం లేదని ఫైమా సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఇద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ వున్నాయని.. వ్యక్తిగతంగానూ కొన్ని డిస్ట్రబెన్స్ తెచ్చాయని ఆమె తెలిపారు. ఏదైనా గొడవ జరిగి మనుషులు దూరమైతే.. దానిని పక్కకుబెట్టి మళ్లీ ఎలా బాగుండాలా అని ఆలోచించాలని ఫైమా సూచించారు. ఏం జరిగినా మా ఇద్దరి రిలేషన్ , అండర్‌స్టాండింగ్ బాగుందని.. కొన్ని పర్సనల్ ఇష్యూ వల్లే దూరమయ్యాం, మాట్లాడుకోవడం లేదన్నారు.
తల్లిదండ్రులు లేరని ప్రవీణ్‌పై ప్రజల్లో ఓ సింపతీ వుందని .. అతను ఏం చెప్పినా తప్పు నాదేనన్నట్లుగా భావిస్తారని ఫైమా వ్యాఖ్యానించింది. ప్రవీణ్‌పై పెంచుకున్న ప్రేమతో జనం నన్ను తిట్టడం కరెక్ట్ కాదని .. గొడవలు జరిగినా మేమిద్దరం కలుసుకున్నాం, వీడియోలు కూడా చేశామని చెప్పింది. మేం మేం బాగానే వుంటున్నాం.. మీరు దానిని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని సున్నితంగా చురకలంటించింది. ప్రవీణ్‌తో ఎందుకు దూరం పెరిగిందో, తిరిగి ఇద్దరం ఎలా కలిశామో అది మా వ్యక్తిగత వ్యవహారమన్నారు.


Click it and Unblock the Notifications











