చచ్చిపోతానని ఇంట్లో బెదిరించా... ప్రవీణ్‌తో పెళ్లి అప్పుడే... పటాస్ ఫైమా
తెలుగు బుల్లితెరపై తన అల్లరి, పంచ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్వా నవ్విస్తున్నారు పటాస్ ఫైమా. పటాష్ షోలో ప్రవీణ్‌తో కలిసి స్కిట్లు చేస్తూ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చి లేడీ కమెడియన్‌గా సత్తా చాటింది. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన మరింత పాపులర్ అయ్యింది. అయితే ఫైమాతో ప్రవీణ్ క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఫైమాకు పటాస్ ప్రవీణ్ కంటే ముందే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు కూడా ప్రవీణ్ కావడం విశేషం. ప్రవీణ్ వచ్చాక పటాస్ ప్రవీణ్‌తో దూరం పెరిగిందని, అతనితో వీడియోలు కూడా చేయడం లేదని టాక్ నడిచించింది. దీనికి ఫైమా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్‌తో పెళ్లి, తన లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేసింది ఫైమా? ఈ వివరాల్లోకి వెళితే..
ఫస్ట్ నుంచి ఉన్న ప్రవీణ్ వీడే.. కాకపోతే నాకు రీల్ జోడీ కనెక్ట్ కావడం వల్ల ఇద్దరూ ప్రవీణ్‌లు వేర్వేరని చెబితే జనాలు ఏమనుకుంటారో అనుకున్నా. టైం తీసుకుని ప్రవీణ్ ఎవరో రివీల్ చేయాల్సి వచ్చింది. ప్రవీణ్- నేను అంతపెద్ద సెలబ్రిటీలం కూడా కాదు. మాకు పెద్ద పేమెంట్స్ కూడా రావు. ఇదే అండర్‌స్టాండింగ్‌తో ఇద్దరికీ ఫ్యూచర్ బాగుండాలనే ఉద్దేశంతోనే ఇద్దరి నోట్లో నుంచి వచ్చింది. అంతేకానీ డబ్బుల కోసం ఇలా చేయ్, అలా చేయ్ అని ఎప్పుడూ చెప్పలేదు. వాడు చెబితే నేను చేశాను, నేను చెబితే వాడు చేశాడు. వాడి యూట్యూబ్ ఛానెల్‌లో నేను.. నా ఛానెల్‌లో వాడు ఇద్దరం వీడియోలు చేశాం. ఆల్రెడీ ప్రవీణ్‌తో జోడీ కనెక్ట్ అయినప్పుడు.. నా లవర్ ప్రవీణ్‌ని పరిచయం చేయలేకపోయానని ఫైమా తెలిపారు.

బిగ్‌బాస్‌కి వెళ్లేముందే ప్రవీణ్‌ని పరిచయం చేసే వెళ్లాను. స్టేజ్ ఎక్కిన తర్వాత నాకు లెటర్ రావడంతో షాక్ అయ్యా. మా ప్రవీణ్ నాకు బట్టలు, బయటి విషయాలు తనే చూసుకున్నాడు. కానీ నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. బిగ్‌బాస్ మధ్యలో కూడా లక్కీ అని చెప్పా.. కానీ క్లారిటీ లేక జనాలు నన్ను అర్ధం చేసుకోలేదు. అప్పటికే ప్రవీణ్‌తో వీడియోలు ఆపేశా. ఈ వీడియోల వల్ల నేనొక్క దానినే నెగిటివ్ అయిపోతున్నా... వాడు అవేవి పట్టించుకోవద్దని నచ్చజెప్పాలని ట్రై చేశాడని ఫైమా పేర్కొంది.
ప్రవీణ్‌తో పెళ్లి త్వరలోనే ఉంటుంది, అదెప్పుడు ఉంటుంది అనేది మాత్రం చెప్పలేను. ఇప్పటి వరకు నా ఫ్యామిలీని బాగానే చూసుకున్నా.. వన్ ఇయర్‌లో పెళ్లి చేసుకుంటే నాకు కూడా ఒక ఫ్యామిలీ వస్తుంది. దానిని కూడా బాగా చూసుకోవడానికి ప్లాన్స్ ఉన్నాయి. పటాస్‌లో ఉన్నప్పుడే ప్రవీణ్‌తో పరిచయం ఉంది.. పటాస్ ప్రవీణ్ కూడా అతనికి తెలుసు, మేం వీడియోలు తీసినప్పుడు కూడా అతనే షూట్ చేసేవాడు. మేం ఎక్కడికి వెళ్లినా ప్రవీణ్ ఉంటాడు.. ఇద్దరి పేర్లు ప్రవీణ్ అవ్వడం వల్ల బుర్ర బద్ధలైపోతోంది. హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎవరూ లేరు. హాస్టల్‌లో ఉన్నప్పుడు కొత్త కొత్త వాళ్లు పరిచయం అయ్యారు. ఫ్రాంక్ కాల్ ద్వారా ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. హాస్టల్‌కు వాళ్ల ఫ్రెండ్‌ని కలవడానికి వచ్చేవాడు.. అతనితో మాట్లాడుతూ క్లోజ్ అయ్యాం. తన కేరింగ్ బాగా నచ్చి, నేనే ప్రపోజ్ చేశానని ఫైమా గుర్తుచేసుకున్నారు.
ప్రవీణ్‌తో జోడీ కావడంతో మా ఇద్దరికీ షోలు పెరిగాయి. ఇద్దరం మధ్యతరగతి కుటుంబాల నుంచే రావడంతో ఈ జోడీని ఇలాగే కంటిన్యూ చేద్దామని ప్రవీణ్ అడగటంతో సరేనని అన్నా. అయితే దానిని మేం మిస్ యూజ్ చేసుకున్నామేమో అనుకున్నా. ఇంట్లో వాళ్లు వద్దు అనడంతో ప్రవీణ్ గాడే మా అమ్మకి కాల్ చేసి నచ్చచెప్పాడు. పటాస్‌కి వెళ్లినప్పుడు తొలి రెండేళ్లు నాకు పెద్దగా ఛాన్స్‌లు రాలేదు, పేమెంట్స్ కూడా పెద్దగా లేవు. భాస్కర్ అన్న స్కిట్స్ చేయడం మొదలైనప్పటి నుంచి పేమెంట్స్ పెరిగాయి. భాస్కర్ అన్న వల్లే నేను త్వరగా ఫేమస్ అయ్యా.. బయట ఈవెంట్స్‌కి కూడా తీసుకెళ్లడంతో నాకు రెండూ ప్లస్ అయ్యాయని ఫైమా తెలిపారు.
పటాస్ షో కోసం స్టూడెంట్స్ కావాలని మా కాలేజీకి కబురొచ్చింది. అప్పుడు మనిషికి 500 ఇచ్చి వచ్చాం.. అప్పుడు నా దగ్గర అవి కూడా లేకపోతే మా ఫ్రెండ్ ఇచ్చింది, ఇప్పటికీ తనకీ నేను బాకీ తీర్చలేదు. పటాస్ షోకి పంపించడానికి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు.. చచ్చిపోతానని బ్లాక్‌మెయిల్ చేశా, రెండ్రోజులు అన్నం తినలేదు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం కానీ ఆయన కూడా వద్దు అనడంతో డోర్ లాక్ చేసి చచ్చిపోతానని బెదిరించా. ఆ దెబ్బకి మా అమ్మ ఒప్పుకుంది. నాకు యాక్టింగ్ రాకపోయినా డైరెక్టర్ సంతోష్ అన్నా ఎలా చేయాలో నేర్పించాడని ఫైమా పేర్కొన్నారు.
సినిమా ఆఫర్లు చాలా వచ్చాయి.. కానీ సినిమా అంటే ఎలా చేయాలో అర్ధం కాలేదు. ఒక సినిమాలో ఆఫర్ వస్తే వెళ్లా.. లేడీ కమెడియన్‌గా మంచి క్యారెక్టర్ అని చెప్పడంతో నేను ఏదేదో ఊహించుకున్నా. అక్కడికి వెళితే నాకు డైలాగ్స్ లేవు, 10 రోజులు షూట్ అని చెప్పారు, కానీ నన్ను సరిగా యూజ్ చేసుకోలేదు. సినిమాలపై నాకు కాన్ఫిడెంట్ లేదు.. మధ్యలో నాకు జబర్దస్త్ షూట్స్ ఉంటాయి, కావాలంటే ఏదైనా వదులకుంటా కానీ, జబర్దస్త్‌ను మాత్రం వదులుకోనని చెప్పేశానని పటాస్ ఫైమా తెలిపారు.


Click it and Unblock the Notifications


















