తొలిసారి తన ప్రియుడు ఎవరో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. స్టేజీపైకి తీసుకొచ్చి మరీ సర్‌ప్రైజ్!
పటాస్ కమెడియన్, జబర్దస్త్ కమెడియన్, బిగ్ బాస్ బ్యూటీ ఫైమా గురించి అందరికీ తెలిసిందే. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు తెలిసినంతగా ఈమె గురించి మరెవరికీ తెలియదేమో. ముఖ్యంగా ప్రవీణ్ కు జోడీగా అద్భుతమైన స్కిట్ లు చేసి అందరినీ అలరించిన ఈమె బిగ్ బాస్ షోకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ప్రవీణ్ తో వీడియోలు చేయట్లేదు. ఇలా వీరిద్దరూ విడిపోయారని అందరూ తెలుసుకున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ శ్రీదేవి డ్రామా కంపెనీకి తన కొత్త ప్రియుడును తీసుకువచ్చింది. అతడిని అందరికీ పరిచయం చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పటాస్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన లేడీ కమెడియన్ ఫైమా గురించి అందరికీ తెలిసిందే. ముందుగా ఓ కాలేజీ స్నేహితులతో పటాస్ షోకు వచ్చిన ఈమె.. చాలా యాక్టివ్ గా ఉండడం చూసి ఆమెకు ఆషోలోనే ఓ ఛాన్స్ ఇచ్చారు. దాంతో ఆమె అందరినీ నవ్వించడం.. ఆమె వేసే పంచులు పేలడంతో ఆమెను రెగ్యులర్ కమెడియన్ గా మార్చారు. ముఖ్యంగా ఈమెకు ఓ పార్టనర్ ను ఇవ్వడం వారిద్దరికీ బాగా స్నేహం కుదరడంతో స్కిట్ లు మరింత చక్కగా చేశారు. ఇలా అద్భుతమైన స్కిట్ లు చేస్తూ అందరినీ నవ్వించారు.

కేవలం పటాస్, జబర్దస్త్ లలో మాత్రమే కాకుండా పైమా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టి వీరి ప్రేమ గురించి వివరించారు. అందులో మొత్తం వీరి ప్రేమాయణంకు సంబంధించిన ముచ్చట్లే చెప్పారు. అయితే ఫైమా ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కు ఎంపిక అవడం అక్కడకు వెళ్లడంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. అద్భుతమైన ఆట కనబర్చిన ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రవీణ్ తో కలిసి కనిపించడం మానేసింది. ఇదే విషయం గురించి చాలా ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు ఎదురవగా.. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని చెప్పుకొచ్చింది.
మరోవైపు ప్రవీణ్ కూడా అలాగే చెప్పుకొచ్చాడు. అయిత్ ప్రస్తుతం ఫైమా శ్రీదేవి డ్రామా కంపెనీలు చేస్తోంది. అయితే తాజాగా విడుదల అయిన ఈషో ప్రోమోలో ఫైమా తన ప్రియుడని చూపించింది. అందరికీ పరిచయం చేసింది. అయితే ఆమె చూపించిన ప్రియుడు మరెవరో కాదు.. బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంటే. అతడే రాజ్. అయితే ఈ విషయం విన్న అంతా షాకయ్యారు. కానీ ఆ తర్వాత బాగా నవ్వుకున్నారు కూడా. ఎందుకు అంటారా ఆమె స్కిట్ లో భాగంగా రాజ్ తన ప్రియుడు అని చెప్పింది.

నిజానికి ఆమె ప్రస్తుతం సింగిల్ గానే ఉంటోంది. కుటుంబం కోసం చాలా కష్టపడి పని చేస్తోంది. ఇటీవలే తన తల్లిదండ్రులకు ఓ ఇల్లు కూడా కట్టించింది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫుల్లుగా కామెడీ చేస్తూ తెగ నవ్విస్తోంది. మీరూ ఓసారి ఈ లేటెస్ట్ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











